Full Style

>

గుండెపోటుని నియంత్రించే బాదంపప్పు

బాదంపప్పు చూడటానికి చిన్నదే... కానీ చేసే మేలు మ్త్రాం ఒక విశాలమయిన జీవితమంత... గుండెపోటు రాకుండా చేసే చక్కటి గుణాలు ఈ బాదంపప్పులో ఉన్నాయట.


Almondsబాదంపప్పులో మనలో ఆయుష్యూను పెంచే ఎన్నో గుణాలున్నాయని వెైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెకు సంబంధించిన వ్యాధుల్ని నివారించే శక్తి గుండెలో మంటను, కడుపులో కలవరాన్ని ఈ బాదంపప్పులు తగ్గిస్తాయి. మన కడుపులో కారం తినడం వల్ల వచ్చే మంటను బాగా తగ్గించే విశిష్టగుణం ఈ బాదంపప్పులో ఉంది. ఈ విషయాన్ని టొరొంటో విశ్వవిద్యాలయం ఇటీవల సాగించిన నూతన అధ్యయనం తేల్చిచెప్పింది. కడుపులో మంటను తగ్గించేందుకు మనం మందులు వాడతాం. కానీ ఆ మందులకు సమానంగా ఈ బాదం పప్పులు ఉపయోగపడతాయట. యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషియన్‌ ఈ అధ్యయన విశ్లేషణల్ని ప్రచురించింది.

బాదంపప్పు వల్ల ఉపయోగాలు
  • గుండె సంబంధవ్యాధుల నివారణ.
  • శరీరంలో కొలెస్టెరొల్‌ను సమస్థాయిలో ఉంచుతుంది.
  • ప్రొటీన్‌లు అందిస్తుంది.
  • న్యూట్రిషన్‌ గుణాలు అధికంగా ఉన్నాయి.
  • బాదంపప్పులు తింటే వేరే పోషక పదార్థాలున్న మెడిసిన్‌ వాడనవసరం ఉండదు.
  • బాదంపప్పులో ఆరోగ్యానికి సంబంధించిన హానికర అంశాలేమీలేవు.


  • బాదం పప్పుల వినియోగం
    ఉపయోగాలకు సంబంధించి అమెరికాలోని కాలిఫోర్ని యాలో అధ్యయనం జరిగింది. మామూలు భోజనం అలాగే బాదంపప్పులతో కూడిన భోజనాన్ని ఎంపిక చేసి న కొంతమందికి వడ్డించారు. వీరు మామూలు భోజ నం తిన్నారు. అలాగే బాదంపప్పుల భోజనం తిన్న తర్వాత మరింత శక్తివంతంగా తయారయ్యారని కాలి ఫోర్నియాలో జరిగిన అధ్యయనం తేటతెల్లంజేసింది.టొరొంటో విశ్వవిద్యాలయం వెైద్యనిపుణులలో సిరిల్‌ కెన్‌డాల్‌ మాటల్లో ‘‘బాదంపప్పులపెై మాఅధ్యయనంలో ఒక విషయం స్పష్టమైంది. అది గుండెలో, కడుపులో మంటల్ని తగ్గించి చల్లదనం ఇస్తుంది. అలాగే కెలొస్టెరొల్‌ శాతం తగ్గిస్తుంది’’.ఒక జీన్సు లేదా 164 కేలరీల బాదంపప్పులు లేదా గుప్పెడు బాదంపప్పులు ఎంతో విలువయినవి. ఆ మోతాదు బాదంపప్పులు తింటే మన శరీరంలో ‘ఇ’ విటమిన్‌కు తిరుగుండదు. అలాగే బాదంపప్పులు వల్ల శరీరానికి మాగ్నిషియమ్‌, పొటాషియమ్‌, కాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ లభిస్తాయి.

Post a Comment

0 Comments