Full Style

>

ఆరోగ్యమే మహాభాగ్యం


Health is our Property in Telugu


          అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. ఈ రోజుల్లో అందరికీ మహాభాగ్యం అంటే ధనం, బంగారం, కార్లు, బంగ్లాలు కలిగి ఉండడమని భావిస్తారు. కాని వీటంన్నింటికంటే ముఖ్యమైన భాగ్యం. ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా, తన సొంత సోత్తు అయిన ఆరోగ్యాన్ని తను కాపాడుకోలేక పోతున్నాడు. మనిషి మనుగడలో ముఖ్యంగా మానసికమైన అలజడులకు, ఆలోచనలకు మహఃభావాలకు, అధికారాలకు అధికముగా లోబడుతున్నాడు. ఈ ఘర్షణే మానసికమైన శక్తిని కోల్పోతూ ప్రపంచంలో నిరుత్సాహంగా, నిర్జీవమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఫలితంగానే శారీరకంగా ఎన్నో రుగ్మతులకు ఆహ్వానం పలుకుతున్నాడు. ఇటువంటి అనారోగ్యాలను ఎదుర్కొవాలంటే మనిషి మనస్సులో మనోశక్తి, శరీరములో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు చక్కని మార్గము మన పూర్వికులు మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించి, పరిశోధించి ఆరోగ్యానికి ఎన్నో చక్కని మార్గాలను, యోగ సాధనను సృష్టించి అందించగలిగారు. 
”నతస్య రోగో నజరా నమృత్యుః – ప్రాప్తస్య యోగాగ్ని మయంశరీరమ్‌’ 
యోగి అయిన వాడు, యోగాగ్నిమయ శరీరుడై, రోగములను, ముసలితనమును మృత్యువును జయించ గలుగుతాడు. యోగాకు పుట్టినిల్లు భారతదేశమైతే, ప్రస్తుతం ప్రాశ్చాత్తపు దేశాల్లో అద్భుతంగా ప్రచారంలో ఉంది. కానీ, ఇప్పుడిప్పుడే మన దేశంలో ఉధృతమైన ఆరాధన మొదలైనది. అందరూ ప్రకృతి పరమైన ఆహారానికి, యోగ సాధనకు పిల్లల నుండి పెద్దల వరకూ మక్కువ చూపుతున్నారు. ‘యోగ’ అనే పదం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. ‘యుజ్‌’ అంటే చేర్చ, కలుపు అని అర్ధం. శారీరక మానసిక ఆత్మ శక్తులను భగవంతునితో అనుసంధానం చేయడమే యోగం. బహు విధములైన జీవితాన్ని సముదృష్టితో చూసే మానసిక ధైర్యం అలవర్చుకోవడమే యోగ సాధన. భారతీయ తత్వజ్ఞాన ప్రకారము షడ్‌ దర్మనాలలో యోగ దర్శనం ఒకటి. భారతీయ భావనతో పరమాత్మ అంథటా వ్యాపించుంది. దానిలో జీవాత్మ ఒక అంశం’ జీవాత్మను, పరమాత్మతో అనుసంధానము చేసే మోక్షసాధనకు యోగాభ్యాసము మార్గం చూపుతుంది. ఈ యోగ మార్గాన్ని అనుసరించేవాడు యోగి లేదా యోగిని. 
    భగవద్గీత యందు 6వ అధ్యాయంలో బాధ నుంచి, దుఖ నుంచి విముక్తి పొందడమే యోగం అని శ్రీకృష్ణుడు అర్జునుడకు ఉపదేశించాడు. సానపట్టిన వజ్రము పలు వర్ణాలలో ప్రకాశిస్తున్నట్లు యోగ అనే శబ్దానికి పలు అర్దాలు కలవు. ఇటువంటి యోగిన్ని సుమారు 500 సం|| నకు పూర్వమే మన సంస్కృతిలో భాగమైనది. యోగ ఈనాడు మానవ మానసిక, శారీర అసమతుల్యతల ద్వారా పొందుతున్న రోగాలకు చక్కని మార్గలను మన యోగులు, ఋషులు తపోశక్తితో సుమారు 2700 సంవత్సరముల పూర్వము కపిల మహర్షి తన శాంక్య దర్శనములో వివరించినారు. స్వామి వివేకానందుడు ”ప్రతి జీవియందును దివ్యత్వము గర్భితముగ నున్నది. బాహ్యాంతర ప్రకృతినందయు నిరోధించి అంతర్గతమగు నీ దివ్యత్వమును వ్యక్తము జేయుటయే జీవిత పరమావధి, ఇందులకై కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన మార్గములలో నొకటిని గాని, కొన్నిటిని గాని లేక అన్నిటిని గాని అవలంబించి ముక్తులగుడు” అని వక్కాణించెను. ఈ విధముగ మానవునిలో నంతర్గతముగన్న దైవాంశ శక్తిని బహిర్గతము చేసి, మానవుని పురిపూర్ణతవైపు పయనింపజేయు క్రమ పద్దతిని శ్రీ అరవిందులు ”యోగము” అనిరి. ఈ విధముగ యోగమనునది మానవుని జంతుస్ధితి నుండి క్రమంగా దైవస్ధితికి చేర్చు పద్దతి. ఈ ప్దదతిలో మానవుని పరిమిత, సంకుచిత, స్వార్ధపూరిత ఆలోచనా సరళి సంపూర్ణముగ పరివర్తన చెంది, సమతాభావముచే అబివ్యక్తమగుచు, సమన్వయ, సమగ్ర, నిస్వార్ధ వ్యక్తిత్వముగా రూపొందును. ఈ దైవత్యము, లేక ఆత్మ పరపక్వస్ధితి అత్యంత శుద్ధ చైతన్యము, సృజనాత్మకము, ఆనందమూను. కనుక యోగము ద్వారా ఆ స్ధితికి పయనించుట ఆహ్లాదకరము, ఆనందదాయకము. వ్యక్తిగాని, సమాజముగాని నిత్యము సుఖమును ఆనందమును, సృజనశీలతను, ఉన్నత మానసిక శక్తిని సాధించుటకు కృషి చేయుచుండుట చేత, వ్యక్తిగత పరిపూర్ణతకు, సామాజిక సమన్యమునకు యోగమే నిజమైన పరిష్కారము. 
    ఈ యోగ పద్దతులు బహుముఖములు. దానిలో అంతర్గతముగనున్న ఐక్యతను, సమన్వయమును తెలిసికొనిననేగాని, ఈ బహుముఖత మధ్యలో దారి తప్పుట తథ్యము. ఒకసారి భిన్నత్వములోని ఏకత్వము చూసి అంతర్ధృష్టి పెంపొందించినచో, యోగ స్వభావమును తెలియజేయు సత్యము బయల్పడును. స్వామి వివేకానంద తమ ఉపన్యాసములలో ఈ సమన్వయతను వక్కాణించిరి. ఆయన ఇనుప కండరములు, ఉక్కు నరములు కలిగిన మానవులను కోరిరి. శ్రీ అరవిందులు భౌతిక, మానసిక, వైజ్ఞానిక, భావప్రేరిత, ఆధ్యాత్మిక పెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించి చెప్పిరి. మానవుని వ్యక్తిత్యము అన్ని కోణములలో అభివృద్ధి చెందుటకనువుగా, యోగాచరణ పద్దతులు పొందుపరచబడిని. ఆసనములు శక్తిని పొదుపుచేసి, దానిని సూక్ష్మ రూపములైన మానసిక శక్తులుగా మార్చుట కుపయోగపడును. అట్టి ఆసనములు చేయుటకు వీలుగా శరీరమును తేలికాను, సులభముగాను వంచుటకు వీలుగా వ్యాయామములు ఉన్నవి. ఆసనములు మనిషి యొక్క అంత ప్రజ్ఞను పెంపొందింపజేసి, మనశ్శాంతిని కలుగుజేయును. శ్వాసకోశ, రక్తచలన, నరముల, జీర్ణకోశ మండలములును శుభ్రపరచుటను, శరీరమొక సమతుల క్రమపద్దతిలో పనిచేసి, తద్వారా సూక్ష్మనాడులను శుభ్రపరుచుటకు తోడ్పడును. ఈ మెలకువలు వ్యక్తిని ప్రాణాయామము, ముద్రలు, బంధములు అభ్యసించుటకు సిద్దపరుచును. 
    ’యోగ’ మన మానసిక, శారీరక సమస్యలకు చక్కని సమాధానం మనిషి యొక్క ఆహారము, ఆలోచన, ప్రవర్తన, దృష్టి, కర్మ జీవనశైలిని ప్రభావితం చేసే గొప్ప సాధన – ‘యోగసాధన’.

Post a Comment

0 Comments