పొట్ట రాకూడదని అనుకునేవారు, వచ్చినా దాన్ని తగ్గించుకోవాలని అనుకునేవారు పాటించాల్సిన జాగ్రత్తలు
- కప్పు గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే పరగడపున తాగాలి. రోజులో కూడా ఎక్కువ నీటిని తాగాలి. అప్పుడు పొట్టలోని మలినాలు, కొవ్వు కరిగి బయటకు వెళ్తాయి.
- పకృతి సహజంగా లభించే తేయాకులతో చేసిన గ్రీన్‌టీని ఉదయం పూట తాగాలి. దానిమ్మ జ్యూస్ తప్ప మిగతా అన్ని రకాల జ్యూస్‌లను ఉదయాన్నే తీసుకోవచ్చు. అయితే జ్యూస్ కంటే తాజా పళ్లు తీసుకోవడం మంచిది. జ్యూస్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
- కాఫీ తాగే అలవాటు ఉన్నవారు రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి.
- పంచదారను ఏ రూపంలోనూ తీసుకోకూడదు. అలాగే వైట్ పాస్తా, బ్రెడ్, బంగాళదుంపలు తినకూడదు.
- గోధుమ పాస్తా, గోధుమ బ్రెడ్‌ను తీసుకోవచ్చు. ప్యాకెట్ లేబుల్స్ పైన ఏ పిండిని ఉపయోగించారు అనేది రాసి ఉంటుంది. చెక్ చేసుకుని తీసుకోవాలి.
- అన్నిరకాల ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవచ్చు. మాంసాహారం తక్కువ తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారం తీసుకోవాలన్న కోరిక ఉంటే దానికి బదులు చేపలు తినవచ్చు.
- రోజులో రెండు, మూడు సార్లు ఎక్కువ మోతాదులో కాకుండా అయిదుసార్లు కొద్ది మోతాదుల్లో ఆహారాన్ని తీసుకోవాలి.
- రాత్రి ఏడు తర్వాత ఆహారం తీసుకోకూడదు.
- తినే ఆహారంలో ఎక్కువగా ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి. చిప్స్, పాప్‌కార్న్, కుకీస్, కేక్స్ మొదలైన జంక్‌ఫుడ్‌ని అస్సలు తినకూడదు.
- రోజుకు ఒక పండు తినాలి. దాన్ని ఉదయం 12గం.ల లోపు తినేలా చూసుకోవాలి. అవి కూడా బెర్రీ ఫ్యామిలీకి చెందిన బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్ బెర్రీస్‌కి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి.
- రోజులో అరగంట, నలభై అయిదు నిమిషాలు కార్డియో ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. ఆరోగ్యసమస్యలున్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు వ్యాయామాలు చేయాలి.
- పొటీన్లు సమృద్ధిగా ఉన్న డ్రింక్‌ని రోజులో తప్పనిసరిగా ఒక్కసారైనా తీసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉండి,
- పోషకాలు అస్సలు ఉండని కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
- తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ లేదా సీడ్స్‌ని తీసుకోవాలి. రోజులో ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే స్ట్రెస్ హార్మోన్లు రిలాక్స్ అయి పొట్టపైన ప్రభావం చూపకుండా ఉంటుంది.
- స్నాక్స్‌లో రోజులో నాలుగు సార్లు అయిదు బాదాంల చొప్పున తినాలి.
- తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
- స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి.
- వేపుడు పదార్థాలను తీసుకోకూడదు. కేవలం ఉడికించిన వాటినే తీసుకోవాలి.
0 Comments