Full Style

>

నోటిలో పొక్కులు, నోటిలో పుండ్లు

నోటిలో పొక్కులు, నోటిలో పుండ్లు చాలా మందిలో నిత్యం ఉండే సమస్యలే.వాటి లక్షణాలు,కారణాలు,నివారణ,జాగ్రత్తలు

నోటిలో పొక్కులు, నోటిలో పుండ్లు చాలా మందిలో నిత్యం ఉండే సమస్యలే. ఇవి కొందరిలో తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. నోరు, పెదవులు, నాలుక, చెంపలోపలి వైపు భాగాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. వైద్య పరిభాషలో వాటిని ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. వృద్ధులు, చిన్న పిల్లల్లో కంటే యుక్తవయసు వారిలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. వృద్ధుల్లో ఇవి దంత సమస్యలతో పాటు వస్తాయి. నోటి పరిశుభ్రత సరిగా పాటించనివారిలో ఇవి కనిపిస్తాయి. నోటిలో పొక్కులు అన్నవి కొందరిలో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. మరికొందరిలో కొన్ని మందులు వాడటం వల్ల రావచ్చు. కొందరిలో ఇవి రావడం అన్నది సెకండరీ ఇన్ఫెక్షన్‌కు దారి తీసి ఇబ్బందులు కలిగించవచ్చు.  

లక్షణాలు: 
నోటిలో పొక్కులకు కారణాన్ని బట్టి అవి వేర్వేరు లక్షణాలను కలిగి ఉండవచ్చు. కొందరిలో నోటిలో పొక్కులు వచ్చే ముందర గుచ్చినట్లుగా నొప్పి రావచ్చు. కొద్ది రోజుల్లో అవి ఎర్రటి మచ్చగా మారవచ్చు. కొందరిలో అవి పుండ్లలా మారవచ్చు. కొన్నిసార్లు అవి నోటిలో పొక్కు చుట్టూ తెల్లటి సర్కిల్‌లా కూడా రావచ్చు. చాలా సందర్భాల్లో నోటిలోని పొక్కులు చాలా నొప్పిగా ఉంటాయి. ప్రత్యేకంగా ఏఐదనా కారపు పదార్థాలు, ఉప్పుగా ఉన్న పదార్థాలు తిన్నప్పుడు నోటిలో మంట మరీ ఎక్కువగా కావచ్చు. 

కారణాలు:  
 
నోటిలో పొక్కులకు ప్రత్యేకంగా కారణం ఉండదు. మనలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు అవి వస్తాయని నిపుణులు భావిస్తుంటారు. చాలామందిలో అవి మళ్లీ మళ్లీ వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అవి కనిపించవచ్చు. అవి... 
బ్యాక్టీరియల్ జింజివోస్టొమటైటిస్ పొగాకు వాడకం
హెర్పిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ 
నోటి క్యాన్సర్లు 
నోటి శుభ్రత సరిగా పాటించకపోవడం 
టూత్‌పేస్టుల్లోని రసాయనాల దుష్ర్పభావం సరైన పోషకాహారం తీసుకోకపోవడం అనీమియా కొందరిలో వంశపారంపర్యంగా నోటిలో పొక్కులు తరచూ కనిపిస్తుంటాయి. 

నివారణ: 

నోటి శుభ్రత పాటించడం వల్ల నోటిలో పొక్కులు చాలావరకు తగ్గుతాయి. 
రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. 
పొగతాగడం మానేయాలి, పొగాకు ఉత్పాదనలు తగ్గించాలి. 
హెర్పిస్ సింప్లెక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. 


జాగ్రత్తలు: 
నోటిలో పొక్కులు వచ్చినప్పుడు తగినన్ని నీళ్లు తాగాలి. 
పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. 
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. 
ఏదైనా మందుల వల్ల నోటిలో పొక్కులు వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించి వాటిని అవాయిడ్ చేయాలి. 
డాక్టర్‌ను సంప్రదించి పైపూతగా వాడాల్సిన యాంటీ హిస్టమైన్స్, అనస్థిటిక్స్, యాంటాసిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులు వాడాలి. అవసరాన్ని బట్టి నొప్పిని ఉపశమింపజేసే పూత మందులను డాక్టర్ సలహాపై తీసుకోవాలి. 
కొన్ని యాంటీబయాటిక్ మౌత్‌వాష్‌లను ఉపయోగించవచ్చు. 
డాక్టర్ సలహా మేరకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వాడవచ్చు, నొప్పి నివారణ మందులు వాడవచ్చు. 
చాలావరకు నోటిలో వచ్చే పొక్కులు వాటంతట అవే తగ్గుతాయి. కాబట్టి మరీ అవసరమైతే తప్ప మందులు వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అది కొన్ని వ్యాధులకు సూచన అని డాక్టర్లు భావిస్తున్నప్పుడు వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. 

నోటిలో పొక్కులు వచ్చినప్పుడు తగినన్ని నీళ్లు తాగాలి. 

పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. 
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. 
ఏదైనా మందుల వల్ల నోటిలో పొక్కులు వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించి వాటిని అవాయిడ్ చేయాలి.

Post a Comment

0 Comments