బాదాం ఆయిల్: రాత్రిపూట పడుకునేముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ ను కంటి చుట్టూరాసీ నెమ్మదిగా మసాజ్ చేయాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి. అల్ఫా హైడ్రోక్సియాసిడ్స్ లేదా రెటివాల్స్ గల నైట్ క్రీమ్ను ముఖానికి మెడకు రోజూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
టీ బ్యాగ్స్: ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచడం మనలో చాలామందికి తెలిసిందే. అయితే చేసే పొరబాటేంటంటే.. వాటిని నేరుగా వాడేస్తుంటారు. ఏం చేయాలంటే.. టీ బ్యాగుల్ని ముందుగా ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరవాత కళ్లపై పెట్టుకోవాలి. అలాగే హెర్బల్ టీ బ్యాగుల్ని వాడకూడదు. వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు.
బంగాళదుంప: బంగాళా దుంపలో చర్మాన్ని తేటపరిచే (SkinLightening) తత్త్వం ఉంది. ఇది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళా దుంప రసాన్ని కంటి దింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. అలాగే బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.
నిమ్మరసం: నిమ్మరసం, టమాటరసం చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి నల్లనివలయాలపై ప్యాక్‌లా రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి. కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.
ఆహారం: ఇలా సౌందర్య చిత్కాలతోనే కాదు ఆహారము లో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందవచ్చును. విటమిన్ల లోకే"విటమిన్క్ష్ కి ఇదే గుణము(SkinLightening) ఉంది. కంటికింద మచ్చలతో భాధపదేవారు సౌందర్య ఛిట్కాలతోపాటు' కే ' విటమిన్ అధికంగా లభ్యమయ్యే ఆహారము తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. "కే విటమిన్ పుష్కలంగా లభించే ఆహారపార్దాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్, బీన్స్, సోయాబీన్స్, దోసకాయ, పచ్చిబఠానీలు, కాలేయము(Liver), చేప నూనె, పెరుగు, పాలు, అన్ని రకాల ఆకుకూరలు - పాలకురలో ఎక్కువ.
మంచి నిద్ర: లేట్ నైట్ పార్టీలు, ఎక్కువ సేపు టీవీలు చూడటం వంటివాటికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం 7-8గంటల నిద్ర అవసరం. నిద్ర సమయాన్ని మార్చినా కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. కొందరు రాత్రి మేల్కొని పగలు నిద్రపోతుంటారు. ఇలా చేడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది.
3 Comments
This comment has been removed by a blog administrator.
ReplyDeletemE Sowndrya ChiTkalu
ReplyDeletemee soundarya chitkalu bagunnai
Delete