ఆండ్రోజన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల తయారీలోనూ పాలుపంచుకుంటుంది. అడ్రినల్ గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్ల తయారీకి కూడా కొవ్వు చాలా అవసరం. విటమిన్ డి తయారీలోనూ కొలెస్ట్రాల్ పాత్ర ఉంటుంది. కొలెస్ట్రాల్‌లో మూడు రకాల లైపోప్రొటీన్స్ ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను తీసుకెళతాయి.
ఎల్‌డీఎల్(లో డెన్సిటీ లైపోప్రొటీన్) :
ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది కాలేయం నుంచి కణాలకు కొలెస్ట్రాల్‌ను తీసుకెళుతుంది. ఒకవేళ కొలెస్ట్రాల్‌ను ఎక్కువ తీసుకెళితే కణాలు ఎక్కువ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఈ ఎల్‌డీఎల్ లెవెల్స్ బాగా పెరిగితే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
హెచ్‌డీఎల్(హై డెన్సిటీ లైపోప్రొటీన్) :
ఇది మంచి కొలెస్ట్రాల్. ఇది పెరిగిపోతున్న ఎల్‌డీఎల్‌ను తొలగిస్తుంది. రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటాన్ని నివారిస్తుంది. ఇది ఎల్‌డీఎల్‌కు విరుద్దంగా పనిచేస్తుంది. కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను కాలేయంకు చేరుస్తుంది. కణాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూడటమే దీని విధి.
ట్రైగ్లిసరైడ్స్ :
ఇవి ప్లాస్మాలో ఉంటాయి. ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్‌తో కలిసి ప్లాస్మా లిపిడ్స్(బ్లడ్ ఫ్యాట్)గా మారుతుంది. తీసుకునే ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల, కార్బోహైడ్రేట్స్ వల్ల శరీరంలో ట్రైగ్లిసరైడ్స్ తయారవుతుంటాయి. తీసుకున్న క్యాలరీలు వెంటనే ఖర్చు కానప్పుడు కణాలు వాటిని ట్రైగ్లిసరైడ్స్‌గా మార్చి కొవ్వు కణాలలో నిల్వ చేస్తాయి. శరీరానికి శక్తి అవసరమయినపుడు, ఆహారం అందనపుడు కొవ్వు కణాలు ట్రైగ్లిసరైడ్స్‌ను విడుదల చేసి శక్తిని తయారుచేసుకుంటాయి. ఈ ప్రక్రియను హార్మోన్లు నియంత్రిస్తుంటాయి.
కొలెస్ట్రాల్ లెవెల్స్
కొలెస్ట్రాల్ 200 ఝజ/ఛీఔ కంటే తక్కువ.
హెచ్‌డీఎల్ ( గుడ్ కొలెస్ట్రాల్) 35 కంటే ఎక్కువ.
ఎల్‌డీఎల్ (బ్యాడ్ కొలెస్ట్రాల్) 130 కంటే తక్కువ.
ట్రైగ్లిసరైడ్స్ 150 కంటే తక్కువ.
కొలెస్ట్రాల్ పెరిగితే...
కొలెస్ట్రాల్ పెరిగితే దీర్ఘకాలంలో రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కారణాలు?
వయస్సు, కుటుంబ చరిత్ర, పొగతాగే అలవాటు, అధిక రక్తపోటు, శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్ తదితర అంశాలన్నీ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంటాయి. అంతేకాకుండా జన్యుపరమైన కారణాలు కూడా కొలెస్ట్రాల్ పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. జీవనవిధానం, ఆహార నియమాలు, వేపుళ్లు ఎక్కువగా తినడం కూడా కారణమవుతుంది.
రిస్క్ ఎవరికి ఎక్కువ
వంశపారపర్యంగా గుండె జబ్బులు వస్తున్న వారిలో, డయాబెటిస్ ఉన్న వారికి, థైరాయిడ్ సమస్య ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఎక్కువ.
పెరిగితే ఏం చేయాలి?
ముందుగా ఏ కారణం చేత కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. అధిక బరువు ఉన్నట్లయితే తగ్గించుకోవడం, డయాబెటిస్ ఉన్నట్లయితే నియంత్రించుకోవడం చేయాలి. «థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే దానికి సంబంధిచిన చికిత్స తీసుకోవడం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరవద్దు. కొవ్వు తక్కువగా ఉండే ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. మాంసాహారంకు దూరంగాఉండాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి.
పరీక్షలు
లిపిడ్ ప్రొఫైల్ అనే రక్తపరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉన్నదీ తెలుసుకోవచ్చు. పరగడపున రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. శాంపిల్ ఇచ్చే ముందు 9నుంచి 12 గంటల ముందు ఆహారపానీయాలు ఏమీ తీసుకోకూడదు. 40 ఏళ్లు లోపు ఉన్న వారు ఆరునెలలకొకసారి, 40ఏళ్లు పైబడిన వారు 3 నుంచి 6 నెలలకొకసారి, డయాబెటిస్, థైరాయిడ్ సమస్య ఉన్న వారు రెగ్యులర్‌గా పరీక్ష చేయించుకోవాలి.
చికిత్స
కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల టౌటఠఠ్చిట్ట్చ్టజీn అనే మందు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల మంచి ఫలితం ఉంటోంది. మందుల వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ 10 శాతం పెరిగే అవకాశం ఉంది. nజ్చీఛిజీn అనే మందులు కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ బ్యాండింగ్ డ్రగ్స్ కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపకరిస్తాయి.
0 Comments