మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్,
ఆహారం అవసరం. అలాగే అక్కడి కార్బన్‌డయాక్సైడ్, మరికొన్ని మలిన పదార్థాల్ని
ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ పని రక్తం ద్వారా జరుగుతుంది.
గుండె కొట్టుకొంటూండడంతో రక్తం శరీర భాగాలన్నింటికీ వెళ్ళడం, అక్కడ నుంచి
వెనక్కి తిరిగి రావడం జరుగుతుంటుంది. ఇలా గుండె ఒక పద్ధతి ప్రకారం
కొట్టుకుంటుండాలంటే దాని నిర్మాణంలో లోపాలుండకూడదు. కండరాలు ఆరోగ్యంగా,
బలంగా ఉండాలి. కవాటాలు సరిగా పనిచేస్తుండాలి. గుండె కండరాలకు రక్తసరఫరా
సరిగ్గా జరుగుతుండాలి. గుండెలోని శక్తి ప్రవాహం కూడా పద్ధతిగా ఉండాలి.
అప్పుడే గుండె ‘లబ్ డబ్’అంటూ సరి వేగంతో కొట్టుకుంటుంది. అలాగే గుండెనుంచి
రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ తీసుకువెళ్ళే రక్త నాళాలలో సమస్యలొచ్చినా
అనారోగ్యాలు కలుగుతాయి.
గుండె చుట్టూ వుండే రక్షక పొరని ‘పెరికార్డియమ్’ అంటారు. పెరికార్డియమ్‌లో కూడా ఇన్‌ఫెక్షన్ రావచ్చు. అలా ఇన్‌ఫెక్షన్ వస్తే గుండె చుట్టూ నీరు చేరుతుంది. ఈ అనారోగ్యంలో కూడా ఛాతీ ప్రాంతంలో నొప్పి వస్తుంది.
గుండె కండరాలు బలహీనమైతే గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. ఇలా వదిలేస్తే ‘హార్ట్ ఫెయిల్యూర్’కి దారితీస్తుంది. గుండెలోని ఒక ప్రక్కవున్న గదుల ద్వారా ఆక్సిజన్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలకి వెళ్తే, రెండో ప్రక్కనున్న గదులలోకి కార్బన్‌డయాక్సైడ్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలనుంచి చేరుతుంది. కాబట్టి రెండు ప్రక్కల రక్తాలు కలవకుండా ఉండాలి. అలాగే రక్తం ఒకవైపే ప్రవహిస్తుండాలి. ఇందుకు కవాటాలు తోడ్పడుతుంటాయి. వీటిలో లోపమున్నా గుండె గోడలో రంధ్రాలున్నా ఈ సమతుల్యం దెబ్బతిని గుండె నీరసించే ప్రమాదముంది. సాధారణంగా ఇలాంటి ఇబ్బందులు పుట్టుకతోను, చిన్నతనంలో రుమాటిక్ జ్వరం రావడంవల్ల కలగవచ్చు.
గుండెలో రంధ్రాలతోపాటు కవాటాలు మూసుకుపోయి పుట్టిన పిల్లల్లో చెడు, మంచి రక్తం కలవడంతో ‘సైనోటిక్ హార్ట్ డిసీజెస్’ రావచ్చు. వీళ్ళనే ‘బ్లూబేబీస్’ అంటారు. రక్తం నీలంగా మారడంవల్ల పిల్లలు నీలంగా కనిపిస్తారు. పుట్టుకతో వచ్చే ఈ లోపాలన్నింటినీ శస్త్ర చికిత్సలతో సరిదిద్దవచ్చు.
పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు 6-12 సం. మధ్య గొంతు ఇన్‌ఫెక్షన్స్ (ఫెరింజైటిస్) వచ్చి, వాటిని అశ్రద్ధచేస్తే- కీళ్ళ నొప్పులు, జ్వరంతో కూడిన ‘రుమాటిక్ ఫీవర్’ అనే వ్యాధి వస్తుంది. దీనికి వైద్యులకు చూపించి, సరైన చికిత్స చేయించాలి. లేకపోతే క్రమంగా కవాటాలు దెబ్బతిని, రుమాటిక్ హార్ట్ వ్యాధులకు దారితీస్తుంది.
మిగతా అన్ని అవయవాలకు లాగానే గుండెకి రక్తం సరఫరాచేయడానికి వేరే రక్తనాళాలుంటాయి. ఆ రక్తనాళాలను కరొనరి ధమనులంటారు. వాటిలో అడ్డంకులేర్పడడంవల్ల గుండె కండరాలకు రక్తసరఫరా తగ్గి ఎంజైనా మరియు హార్ట్ ఎటాక్‌లు రావచ్చు. వీటిని ‘కరొనరి హార్ట్ డిసీజెస్’ అంటారు.
మన లివర్ కొలెస్ట్రాల్‌ని తయారుచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. రక్తంలో ఒక భాగం ఇది. రక్తంలో ఇది ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడలలోపల గోడలమీద పేరుకుపోతుంటుంది. ఇలా కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటే రక్తనాళాల లోపల దారి మూసుకుపోతుంటుంది. రక్తప్రసరణ దెబ్బతింటుంది.
రక్తం లీటరులో 5.5 మి. ఎమ్‌ఒఎల్‌కన్నా ఎక్కువుంటే ‘కరొనరి ఆర్టెరి డిసీజెస్’ వచ్చే అవకాశముంది.
రక్తంలో ప్రవహించే కొలెస్ట్రాల్‌లో కొవ్వులు, ప్రొటీన్లు రకరకాల పద్ధతుల్లో కలిసి ఉంటాయి. వీటినే లైపోప్రొటీన్లంటే తక్కువ సాంద్రతగల లైపోప్రొటీన్స్‌లో లెటిలైపో... ప్రోటీన్స్ (ఎల్‌డిఎల్). ఇది చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తంలో ఎక్కువ. ఎక్కువ సాంద్రతవున్న కొలెస్ట్రాల్... హైడెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) కూడా రక్తంలో ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్. ఎథిరో స్క్లేరోసిస్ రాకుండా ఇది కాపాడుతుంది. కాబట్టి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువుండాలి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువుడాలి.
ఉదయం 5 గం. ప్రాంతంలో నడక వల్ల వ్యాయామమే కాదు ఈ సమయంలో శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాయి. ఈ సమయంలో నడకవల్ల ఎల్‌డిఎల్ తగ్గి, హెచ్‌డిఎల్ పెరుగుతుంది.
నడకతోబాటు మన నడతని మార్చుకోవాలి. ధూమపానం, ఆల్కహాల్‌లాంటి అలవాట్లు మానుకోవాలి. ఆహారపుటలవాటు మార్చుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇవన్నీ చేయక తప్పదు మన గుండెకోసం.
కరొనరి ధమనులు గుండెకి ఎడమవైపు రెండు, కుడివైపు ఒకటి ఉంటాయి. క్రొవ్వు పదార్థాలు, అడ్డంకులు తొలగించడానికి ఈ అడ్డంకులు 50% కన్నా తక్కువ వుంటే మందులతో కరిగించవచ్చు. 75%కన్నా ఎక్కువ ఒకటి లేక రెండింట ఉంటే యాంజియో ప్లాస్టి ద్వారా తొలగించవచ్చు.
అసలు అడ్డంకుల్ని తెలుసుకోవడానికి ‘యాంజియోగ్రామ్’ తోడ్పడుతుంది. ఇప్పడు ‘ఐవస్’ గైడెన్స్ కేథలాబ్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అమర్చిన స్టెంట్‌లు సరిగ్గా అమరాయా? లేదా తెలుసుకోవచ్చు. కష్టాన్ని కలిగించే అడ్డంకులకి బెలూన్స్ చికిత్సవల్ల లాభముందా? లేదా? తెలుసుకోవచ్చు. కాంప్లెక్స్ యాంజియో ప్లాస్టీలంటే ఎడమవైపు ఉండే ముఖ్య రక్తనాళంలో బ్లాక్‌లు, రక్తనాళాలు శాఖలుగా విభజన జరిగే ప్రాంతాలలో అడ్డంకులు, బైపాస్ అయిపోయిన తర్వాత గ్రాఫ్ట్‌లలో అడ్డంకులు, గట్టి కార్డియం అడ్డంకుల్ని తొలగించడానికి నిర్వహించేవి. వీటికి ఐవస్ తోడ్పడుతుంది.
మూడు రక్తనాళాలలో అడ్డంకులుంటే శస్తచ్రికిత్సతో తొలగించాల్సి రావచ్చు. ఈ శస్త్ర చికిత్సలో ఇప్పుడు సన్నటి రంధ్రం ద్వారా చేస్తున్నారు. కవాట మార్పిడి శస్తచ్రికిత్సల్ని చిన్న రంధ్రం ద్వారా చేస్తున్నారు.
చికిత్సలోకన్నా కూడా మనం ప్రధానం తెలుసుకోవాల్సింది వ్యాధులు రాకుండా నివారించడం. ఒకవేళ వ్యాధులు మొదలైనా ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే అపాయం కలగకుండా నివారించవచ్చు.
గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంటుంది. ఆ లయ రిథమ్ తప్పి కొట్టుకోవడాన్ని ‘ఎరిధ్మియా’ అంటారు. పైనుండే చిన్న రెండు గదులు- ఆరికల్స్‌లో కొట్టుకునే లయ తప్పడాన్ని ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ అంటారు. అది డిజార్గనైజ్డ్‌గా తీవ్రంగా వచ్చే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్‌వల్ల వస్తుంది. ఎరిధ్మియాలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సాధారణంగా వస్తుంటుంది. వయసుని బట్టి ఈ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ ఎక్కువవుతుంది. ఇది వచ్చిన లక్షణాలుండకపోవచ్చు. చెమటలు పట్టడం, ఫెయింట్ అవడం జరగవచ్చు. ఛాతీ నొప్పి రావచ్చు. గుండె ఫెయిలవ్వవచ్చు. గుండె కొట్టుకునే రేటు పెరిగినా, తగ్గినా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది. పైగా ఆరికల్స్ కదలికలు సరిగ్గా ఉండకపోతే రక్తం పేరుకుపోవడానికి ‘స్టాసెస్’ కారణమవుతుంది. దీనివల్ల రక్తం గడ్డలు కట్టే రిస్క్ ఎక్కువ. ఈ బ్లడ్ క్లాట్స్, గుండెవైపు వెళ్ళి, అక్కడి రక్తనాళాలలో అడ్డంగా ఏర్పడవచ్చు.
కొన్ని మందులతో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గవచ్చు. గుండె కొట్టుకునే రేటు ఈ మందులతో తగ్గుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకునే రేటుని ఎలక్ట్రిక్ కార్డియో వెర్షన్‌తో మామూలు స్థితికి రావచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గడానికి శస్తచ్రికిత్స, కేధటార్‌తో చేసే చికిత్సా విధానాలు తోడ్పడతాయి. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌తో బాధపడేవారు రక్తం పలుచనవడానికి మందులు తీసుకోవడం మంచిది.
గుండె కొట్టుకునే రేట్ సరిగ్గా ఉండేందుకు, చర్మం క్రింద (్ఛతీ భాగంలో) పెట్టే పరికరాన్ని కృత్రిమ ఫేస్‌మేకర్ అంటారు. మామూలుగా గుండెలో ఉండే ఫేస్ మేకర్ పనిచేయకపోయినా, నోడ్ దగ్గర పుట్టిన విద్యుత్‌ని గుండె అంతా వెంట్రికిల్స్ వరకు విస్తరించేట్టు చేసే మార్గాల్లో అడ్డంకులేర్పడ్డా కృత్రిమ ఫేస్‌మేకర్ని పెట్టాల్సి ఉంటుంది.
ఈ విషయాలన్నింటిమీదా అవగాహన ఉంటే గుండె అనారోగ్యాలు కలుగకుండా జాగ్రత్తపడవచ్చు. ఒకవేళ ఏవైనా అనారోగ్యాలు కలుగుతున్నా ప్రారంభంలో గుర్తించగలగాలి. గుర్తించి ఊరుకోకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యుడికి చూపించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించి, చికిత్స చేయించుకోవాలి.ఇవాళ ఎటువంటి హృద్రోగానికైనా చికిత్స ఉంది. గుండె పూర్తిగా దెబ్బతింటే గుండె మార్పిడి చేస్తున్నారు. ఎటొచ్చీ..మన గుండె చప్పుడు మనం గమనిస్తుండాలి..అంతే.
గుండె నేర్పే పాఠాలు
నీ జీవన విధానాన్ని సరిగా ఉంచుకో.. ఏ ఆహారం పడితే ఆ ఆహారాన్ని సమయం సందర్భం లేకుండా తీసుకోకు.. కాయకష్టమే పాతకాలం వాళ్ళ గుండెకి శ్రీరామరక్ష. శారీరక శ్రమ, తీసుకున్న కేలరీలను ఖర్చుపెట్టడానికి సైక్లింగ్, ఈతో, నడకో ఏదో ఒక వ్యాయామం రోజుకో 45 నిముషాలన్నా అవసరం. ధూమపానం ఆల్కహాల్ సేవనం లంటి అలవాట్లకి దూరంగా ఉండడం, వంశపారంపర్యంగా గుండె సమస్యలుంటే ఆ రిస్క్‌కి తగ్గ జాగ్రత్తలు, చిన్నవయసు నుంచే తీసుకోండి. మానసిక వత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానము, సంగీతం వినడం, పుస్తక పఠన లాంటి- అలవరచుకోండి. మీ జీవన విధానాన్ని మార్చుకోవాలని ఒక ప్రక్క చెబుతూ మరోప్రక్క-
నిర్విరామంగా కృషిచేయండి. నిస్వార్థంగా బ్రతకండంటూ కూడా చెబుతోంది. గుండె ఇరవై నాలుగ్గంటలూ కొట్టుకుండేలా కష్టపడమని మనకి చెబుతోంది. అలాగే శరీరమంతటికీ వెళ్ళాల్సిన రక్తం తన గుండెకి వెళ్తున్నా గుండె ఒక్క చుక్క తీసుకోదు... అని అవయవాలకు కొన్ని రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. అలాగే గుండెకీ కరొనరి రక్తాల ద్వారా సరఫరా జరుగుతుంది.
గుండె జబ్బులు రాకుండా...
గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యవంతులు తీసుకోవలసిన ఆహారం గురించి ముందు మాట్లాడుకుందాం. ఫైబర్... అంటే పీచు పదార్థాలు తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. ఓట్స్, చిక్కుడు జాతి కూరగాయల్లో, అవిసె గింజల్లో, యాపిల్, సోయా గింజల్లో, కారట్, ఆకుకూరల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌లోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ని తగ్గిస్తాయి. మాంసం, పాల పదార్థాలలో శాచురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి. మనం రోజువారీ తీసుకునే కేలరీస్‌లో ఇవి 10%కి మించరాదు. బిస్కట్లు, పేస్టీస్, చాక్‌లెట్, ఫ్రెంచి ఫ్రైస్‌లాంటి బేకరీ పదార్థాలలో ట్రాన్స్‌ఫాట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని తినకుండా ఉండడం మంచిది. నెయ్యి, వెన్న, డాల్డాలాంటి శాచురేటెడ్ ఫాట్స్‌ని బాగా తగ్గించి తీసుకోవాలి. ఉప్పుని కూడా బాగా తగ్గించి తీసుకోవాలి. చల్లని నీళ్ళలో ఉండే పాలోన్, పాల్‌డైన్ లాంటి చేపలు మంచివి.
గుండెకి మూలకణ చికిత్సలు
‘కార్డియా’ అనే గ్రీకు పదానికి ‘గుండె’ అని అర్థం. అందుకని కార్డియక్ అంటే గుండెకి సంబంధించిన అని అర్థం. ఇన్‌వాలంటరీగా పనిచేసే కండరాలతో పనిచేస్తుంటుంది కాబట్టి గుండె ఆగకుండా అలా కొట్టుకుంటుంది. మన శరీరంలో ఇలాంటి కండరాలు మరెక్కడా లేవు. గర్భంలోని శిశువుకు 21 రోజు వయసు వచ్చేసరికి గుండె ఏర్పడడమే కాదు, కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. గర్భంలో ఆడ, మగ గుండె కొట్టుకునే రేట్లలో తేడా ఉంటుంది.
మొదటి నెలలలో గర్భంలో శిశువు గుండె నిముషానికి 75నుంచి 80 సార్లు వరకు కొట్టుకుంటుంది. ఏడవ వారంలో నిముషానికి 165 నుంచి 185సార్లు కొట్టుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి పది రోజులకు గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. 9.2 వారాలనుంచి గుండె కొట్టుకునే రేటు నిమిషానికి 150కి తగ్గుతుంది. క్రమంగా 15 వారాలకు గుండె కొట్టుకునే రేటు 145కు తగ్గుతుంది.
శిశువు గర్భంలో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలతో లోపాలుంటే తెలుసుకోవచ్చు. కొన్నింటిని గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవచ్చు. కవాటాల లోపాలు లాంటి వాటిని శిశువు చుట్టూవున్న మూల కణాల్ని తీసి, కావలసిన సంఖ్యకి లేబరేటరీలో పెంచి ఈ కవాటాన్ని కవాట లోపమున్న శిశువు జన్మించగానే అమర్చవచ్చు.
గుండె కండరాలు దెబ్బతింటే అదే వ్యక్తి బోన్‌మార్మోనుంచి మూలకణాలు తీసి లేబరేటరీలో కావలసిన సంఖ్యలోకి పెంచి, గుండె కండరాలలోకి ఎక్కించి, కండరాల్ని బలమయ్యేట్టు చేయవచ్చు. ఈ చికిత్స ఫలితం కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. కొంతే అభివృద్ధి చెందితే మళ్ళీ ఆ ప్రాంతంలో మూల కణాల్ని పంపి మరికొంత అభివృద్ధి కనిపించేట్టు చేయవచ్చు. ఎవరి మూలకణాల్ని వారికి ఎక్కిస్తారు కాబట్టి, రోగ నిరోధక మందుల్ని జీవితాంతం వాడాల్సిన పనిలేదు. మూల కణ చికిత్సని పునరుత్పత్తి వైద్యమంటారు. ఇది భవిష్యత్తులో బంగారంలాంటి చికిత్సగా భావిస్తారు.
గుండె భారం పెంచకండి
యాంజియో ఇంతకుముందు తొడలోని రక్తనాళాల ద్వారా చేసేవారు. తొడలోంచి చేయడంవల్ల రక్తస్రావం అధికంగా ఉండేది. ఒకరోజు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చేతి మణికట్టునుంచి రేడియల్ రక్తనాళం ద్వారా యాంజియో చేస్తున్నాం. రక్తస్రావం తక్కువ చేతినుంచి కాబట్టి త్వరగా పంపించి వేయడం జరుగుతోంది. ప్రతిరోజూ గుండె రక్తనాళాల ద్వారా రక్తాన్ని 90,000 కి.మీ దూరం నెడుతుంటుంది. ఒక ఎత్తునిబట్టి బరువుంటుంది. దీనిని బాడీమాస్ ఇండెక్స్ అంటారు.
బాడీమాస్ ఇండెక్స్= బరువు కిలోలలో/ ఎత్తు మీటర్లలో
బాడీ మాస్ ఇండెక్స్ 20నుంచి 25వరకు మామూలు బరువు. 25 నంచి 30 వరకు ఉంటే అధిక బరువు. 30నుంచి 35 వరకు స్థూలకాయం గ్రేడ్ 1, 35నుంచి 40 స్థూలకాయం గ్రేడ్ 2, 40కన్నా స్థూలకాయం గ్రేడ్ 3- మార్బడ్ ఒబేస్ అంటారు. ఉండాల్సిన దానికన్నా శరీర బరువు ఒక కిలో ఎక్కువ వుంటే గుండెకి రోజుకి 30 కి.మీ దూరం ఎక్కువ నెట్టాల్సిన భారం పడుతుంది. బరువు ఎక్కువైనకొద్దీ గుండె మీద పడే భారం ఎక్కువవుతుంది. అందుకని బరువుని అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్‌లో నరాలు దెబ్బతింటాయి. అందుకని గుండె నొప్పి వచ్చినా తెలీదు. కాబట్టే డయాబెటిస్‌ని సైలెంట్ కిల్లర్ అంటారు. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోవడం అవసరం.దవడ దగ్గర నుంచి బొడ్డువరకు ఎక్కడ నొప్పి వచ్చినా అనుమానం రావాలి. వెంటనే వైద్యుడికి చూపించాలి. కార్డియక్ అరెస్ట్ అయితే, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతే కార్డియో పల్మోనరి రిససిటేషన్ ప్రారంభించాలి. అంటే గుండె మీద ఒక చేత్తో మృదువుగా రాస్తూ, నోట్లో నోరుపెట్టి కృత్రిమ శ్వాసను కల్పిస్తూ, వెంటనే అవసరమైన చికిత్స అందేలా చూడాలి. ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్ అందుబాటులో ఉంటే దాని సాయంతో డిఫిబ్రిలేషన్‌ని అందులో ఉంచవచ్చు.
గుండె జబ్బులున్నవాళ్ళ ఆహారం
తీసుకునే ఆహారంలో కొవ్వు 7%కి మించరాదు. రెడ్‌మీట్ పూర్తిగా మానేయాలి. మనం ఆహారంగా తీసుకునే జీవులలోని అవయవాలలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకూడదు. రొయ్యలు, పీతలు, గుడ్డులోని పచ్చ సొన, పాల పదార్థాలు లాంటి కొవ్వుని పెంచే పదార్థాల్ని పూర్తిగా మానేయాలి.
ఒమెగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా వున్న చేపలు, బాదం పప్పు, అక్రూట్, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటివి ఆహారంలో తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ని తగ్గించే ముడి ధాన్యాలు, దంపుడు బియ్యం, ఓట్స్, గోధుమలు, సోయా పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి, మొక్కజొన్న, చిక్కుడు, కేరట్ లాంటి కూరగాయలు; నారింజ, యాపిల్, బేరి, అరటి, అంజీర్, ఆప్రికాట్స్‌లాంటి పళ్ళు తీసుకోవడం మంచిది.

0 Comments