కమలా పండు చూడటానికే కాదు తినడానికీ బాగుంటుంది. దీనిలో ఎన్నో విటమిన్లు దాగున్నా సి విటమిన్ మరింత పుష్కలంగా ఉంటుంది. సత్వర ఉత్సాహాన్ని ఇచ్చే కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.
కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.
ఈ పండులో బీటాకెరోటిన్ అత్యధికంగా ఉంటుంది.
ఫోలిక్ యాసిడ్ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మెదడు సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఇందులో ఉండే మెగ్నీషియమ్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
కాల్షియం దంతాలు, ఎముకలను పటిష్టంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
కమలా పండులోని ఫైబర్ శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.
0 Comments