చలికాలంలో… జబ్బులకు దూరంగా…
చర్మానికి సంబంధించిన వ్యాధులు సోరియాసిస్, ఎక్జిమా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్, చర్మం పొడి బారి దురద ముఖ్యమైనవి.
సోరియాసిస్
ఇది క్రానిక్‌గా, తరచుగా కన్పించే వ్యాధి. వెండి పొలుసుల్లా తయారై గోకినప్పుడు అవి రాలిపోతాయి. దీనికి స్పష్టమైన కారణం తెలియదు. శీతాకాలంలో ఎక్కువవుతుంది.
ఇది ఆందోళన చెందే వారిలో, మానసిక ఒత్తిడి వున్న వాళ్ళలో ఎక్కువగా కన్పిస్తుంది. మోచేతికి, మోకాళ్లు ముందుభాగంలో, తలపైనా ఎక్కువగా కన్పిస్తుంది. అరచేయి పాదాలలో కూడా కన్పిస్తుంది. ఈ వ్యాధి కీళ్లకు కూడా పాకుతుంది.
చికిత్స
మానసిక ప్రశాంతత అవసరం. ఆందోళన ఎక్కువుంటే, వాలియం 5 మిల్లీగ్రాములు బిళ్లలుగాని, రెస్టిల్ 0.5 మిల్లీగ్రాములు బిళ్లలుగాని వాడాలి. పైపూతకు ఇన్‌ఫెక్షన్ వుంటే యాంటీ బయాటిక్స్ వాడాలి. తార్‌తో కూడిన మందులు పుయాలి. ప్రెడ్సిసలోన్ బిళ్ళలు 40 మిల్లీగ్రాములు కాని 60 మిల్లీగ్రాములుకాని వాడాల్సి రావచ్చు. ‘మిథోట్రెక్సేట్’ను డాక్టరు సలహా మేరకు వాడాలి.
ఎక్జిమా
ఇది అలర్జీ వల్ల వచ్చేది. దురద ఉండి శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఆహారంలో మార్పు వచ్చి పడని పదార్థాలు వాడినప్పుడు చల్లటి వాతావరణ వున్నప్పుడు ఎక్కువగా కన్పిస్తుంది. కొంత మందికి బొట్టు పెట్టుకుంటే నుదుటి మీదరావచ్చు. దీనికి ఇన్‌ఫెక్షన్ తోడైతే యాంటీబయాటిక్స్ వాడాలి. దురద తగ్గడానికి సిట్రిజిన్ మాత్రలు 10 మిల్లీగ్రాములు రోజుకు రెండు సార్లుగాని, ఒక్క సారిగాని వాడాలి. కాళ్లకుంటే… స్నానం చేసినప్పుడు కాళ్లు కడుకున్నప్పుడు వెంటనే పొడిగుడ్డతో తుడిచి దానికి అనువైన ఆయింట్‌మెంట్ పూయాలి.
బెట్నోవేట్-సి గాని బెట్నోవిట్-జి గాని పు యాలి. కొంతమందికి పొడిబారిన డ్రై స్కిన్ వుం టే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రెండుసార్లు పూయాలి. శీతకాలంలో పొడిచర్మం వల్ల చాలా దురదగా వుంటుంది. ఫంగస్‌తో కూడిన చర్మవ్యాధులకు మికొనోజోల్ ఆయింట్‌మెంటు రోజుకు రెండుసార్లు పూయాలి. దురదకు లీవో సిట్రిజన్ 5 మిల్లీగ్రాములు బిళ్ళలు అవసరాన్ని బట్టి వాడాలి.
జలుబు, దగ్గు
ఇది బ్యాక్జీరియా వల్లగాని, వైరస్ వల్లగాని రావచ్చు. ఎక్కువగా వర్షాకాలంలో ,శీతాకాలం వచ్చేవ్యాధి జలుబుకు చాలా రకమైన వైరస్‌లు కారణమవచ్చు. సుమారుగా 200పైన వైరస్‌లున్నట్లు అధ్యయనంలో తేలింది. రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు గాలిలో కలిసి పది అడుగులు దూరం వుండే వ్యక్తికి కూడా సంక్రమించవచ్చు. గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసినప్పుడు ఈ వైరస్ త్వరగా మిగతావారికి సోకే ప్రమాదం వుంది.
ముఖ్యంగా వృద్ధులకు, వ్యాధుల నుండి కోలుకొనే వ్యక్తులకు, చిన్నపిల్లలకు, బలహీనులకు వారి రోగనిరోధకశక్తి క్షీణించినప్పుడు త్వరగా వ్యాప్తిస్తుంది. రోగి వాడిన దుప్పట్లుగాని, ముక్కును తుడుచుకోవడం వల్లే గాని, అతడు ముక్కును తాకి అదే చేతితో ఏదైనా వస్తువు తాకితే, అదే వస్తువును వేరెవరైనా తాకితే వారికి కూడా సంక్రమిస్తుంది.
నివారణ మార్గాలు
పడుకొన్నప్పుడు కిటికీలు తెరచి వుంచాలి. రోగి వాడిన వస్తువులు వాడకూడదు. తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. రోగి, ఇంట్లో ఇతరులు కూడా మాస్క్ ధరించాలి.
ఆస్తమా
దీన్ని ఉబ్బసం వ్యాధి అని అంటారు. చిన్న పిల్లలనుండి పెద్దవారి దాకా ఎవరికైనా రావచ్చు. ముఖ్యంగా ఎలర్జీ కారకాలు…. ఇంట్లో దుమ్ము, ధూళి, పొగ, పెయింట్, సెంట్లు పొప్పడి రేణువులవల్ల, ఇంట్లో పెంచే పిల్లులు, కుక్కల ఆహారంలో దోషంవల్ల రావచ్చు. దీన్లో ఊపిరినాళాల్లో అడ్డంకి ఏర్పడి ఊపిరి ఆడక ఇబ్బంది కలొగొచ్చు. ఇది వైరస్‌వల్లగాని బాక్టీరియా వల్ల కూడా రావచ్చు.
మానసిక ఆందో ళన, ఒత్తిడివల్ల, ఎక్కువ పరుగెత్తి నప్పుడు, అధికంగా వ్యా యామం చేసినప్పుడు ఎక్కు వయ్యే అవకాశాలు ఎక్కువ. కొందరిలో వర్షం కురిసేట ప్పుడు వాతావ రణం చల్లబడడం వల,్ల కొన్ని పడని మందులు వాడినప్పుడు కూడా రావచ్చు. వీరు ఛాతీ ఎక్స్‌రే రక్త పరీక్ష, కళ్ల పరీక్ష చేయించుకోవాలి.
నివారణ
ఎలర్జీ కారకాల నుండి దూరంగా వుండాలి. అతిగా వ్యాయామం గాని, పరుగెత్తడంగాని చేయకూడదు. చల్లటిగాలి తగలకుండా చూసుకోవాలి. మందమైన దుస్తులు ధరించాలి.
చికిత్స
ఎక్కువ ఆయాసం వుంటే ఆక్సిజన్ ఇవ్వాలి. కార్టిజోన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఆస్తలిన్‌గాని, ఇన్‌హెలర్స్‌గాని, రోటకేప్స్ వాడాలి. లేక నెబులైజర్ వాడాల్సి రావచ్చు.
కీళ్ళనొప్పులు వాపులు
శీతాకాలంలో సరైన వ్యాయామం లేకుంటే ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. రక్తనాళాలు ముడుచుకుని రక్తప్రసరణ సరిగ్గా జరగక టాక్సిన్స్ వుండి కీళ్ళనొ ప్పులు అధిక మవుతాయి. రుమాటాయిడ్ ఆర్థ్రయిటిస్, గౌట్ వ్యాధి ఉన్న వారిలో ఎక్కువగా వాపు కనిపిస్తుంది.
నివారణ
వీరు నీరు ఎక్కువగా తాగాలి. పళ్లరసాలు ఎక్కువగా వాడాలి. వెచ్చని నీళ్లలో కాళ్లు, చేతులను మంచి బాగా ఆడించాలి. రోజుకు రెండు మూడు సార్లు చెయాలి. డైక్లోఫెనిక్ ఇంజెక్షన్‌గాని, బిళ్ళలు గాని వాడాలి. డైక్లోఫెనిక్ జెల్ పూతగా వాడాలి.
చిన్న పిల్లలోని విరేచనాలు
ఈ సమస్యకు ముఖ్య కారణం రోటోవైరస్. దీంతో కలిగే విరేచనాలు సాధారణ మందులతో త్వరగా తగ్గవు. అందుకే పిల్లలు పుట్టిన 7వ నెలలో, ఎనిమిదవ నెలలో వ్యాక్సిన్ వేయించాలి. ఒక్కోసారి నులిపురుగుల వల్ల జి యార్డిసెస్ వల్ల కూడా విరేచానాలు కలగవచ్చు. వీరికి ఎలక్ట్రో లైట్ పౌడరు నీళ్ల లో కలి పి ఇవ్వా లి. డీహై డ్రే షన్ వుంటే నరాలకు సె లైన్ ఎక్కి ంచాలి. నార్ మెట్రో జాల్ సిరప్ వాడ వచ్చు.
వైరల్ జ్వరాలు
డెంగీ వ్యాధి, చికున్ గున్యా ఈడిస్ ఈజిప్టై అనే దోమవల్ల కలుగుతాయి. వీటిలో అకస్మాత్తుగా చలి జ్వరం కీళ్ళనొప్పులు, వాపులు, వాంతులు, విరేచనాలు, విపరీతమైన నిస్సత్తువ వుంటాయి. ఈ దోమలు పగటిపూటనే కుడతాయి. మంచి నీటిలో వృద్ధి చెందుతాయి. నివారణకు ఒళ్ళంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ఇంట్లో గాని పరిసరాల్లో వుండే (నిల్వవుండేవి) రోజూ మారుస్తూ వుండాలి. వీటికి పెయిన్ కిల్లర్స్, క్రోసిన్ మందులు వాడాలి.
మలేరియా
ఆడ ‘అనాఫిలిస్’ దోమ నుండి సంక్రమిస్తుంది. ఇవి రాత్రి వేళలో కుడతాయి. ఆరంభవంలో విపరీతమైన చలి, తర్వాత ఎక్కువ జ్వరం, ఆ తర్వాత చెమటలు పోసి జ్వరం తగ్గుతుంది. ఈ దోమలు మురికి నీళ్ళలో వృద్ధి చెందుతాయి. దీనికి క్లోరోక్విన్ మాత్రలు, క్రోసిన్ మాత్రలు తగుమోతాదులో వాడాలి.
నివారణ
దోమ తెరలు వాడాలి. శరీరమంతా కప్పే దుస్తులు వాడాలి. దోమలను వాటి లార్వాను నాశనం చేసే పైరిథ్రియమ్ మందులు పిచికారితో నాశనం చేయాలి. ఓడోమస్ వంటి లేపనం పూసుకోవాలి.
ఫైలేరియా
ఇది క్యూలెక్స్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. అకస్మాత్తుగా చలిజ్వరం, లింపు గ్రంథులు వాయడం వాంతులవడం కొన్ని రోజులు తగ్గిపోయి మరల మరల వస్తుంది. దీనివల్ల బోదకాలు వస్తుంది. దోమల బారినుండి రక్షించుకోవడం, హెట్రోజన్ 100 మిల్లీగ్రాములు మాత్రలు రోజుకు మూడుసార్లు, మూడువారాల పాటు వాడాల్సి వుంటుంది. నొప్పి గురించి అసిక్లోఫెనిక్ బిళ్ళలు, డాక్సీ 100 మి.గ్రా బిళ్ళలు.
0 Comments