శిరోజాలు చక్కగా పెరిగేందుకు, నిగనిగలాడేందుకు ఉసిరికాయ టానిక్‌లా పనిచేస్తుంది. ఉసిరికాయ ముక్కలను ఎండబెట్టండి. కొబ్బరి నూనెలో ఎండిన ఉసిరికాయ ముక్కలను వేసి మరిగించండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు శిరోజాలకు అంటిస్తుంటే వెంట్రుకలు చక్కగా పెరగడమే కాకుండా నిగనిగలాడతుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని సేవించండి.
వారానికి రెండుసార్లు మాత్రమే షాంపూను ఉపయోగించండి. వెంట్రుకల కుదుళ్ళకు కొబ్బరినూనె దట్టించి మసాజ్ చేయండి. వీలైతే బాదం నూనెతో తలను మర్దన చేయండి. మెంతులను నీళ్ళల్లో రుబ్బుకుని తలకు దట్టించండి. అరగంట తర్వాత మెంతులను కాసిన్నిచల్లటి నీటితో కడిగేయండి. దీంతో మీ శిరోజాలు చక్కగా పెరుగుతాయి
0 Comments