Full Style

>

నాడీ శక్తిని పెంచే "ఇండియన్ జాక్‌ఫ్రూట్"


Jackfruitఆంగ్ల భాషలో "ఇండియన్ జాక్‌ఫ్రూట్" అని పిలిచే "పనస పండు"ను తిన్నట్లయితే నాడీ శక్తి పెంపొందుతుంది. తియ్యగా ఉండే పనస తొనలు శరీరానికి పుష్టినిస్తాయి. తేమ, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు, ఇనుము, విటమిన్ ఏ, సీలు కలిగి ఉన్న పనసపండును తిన్నట్లయితే శరీరానికి 540 కెలోరీల శక్తి అందుతుంది. ఈ పండులో లభించే ఫైటో న్యూట్రియంట్‌లు క్యాన్సర్ నుంచే కాకుండా హైపర్ టెన్షన్‌ను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఆస్తమాతో బాధపడేవారికి పనసపండు మంచి ఉపయోగకారి. పనస వేరును ఉడికించి, దాన్నుంచి వచ్చే రసాన్ని ప్రతిరోజూ తీసుకున్నట్లయితే ఆస్తమా అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పనస వేరు చర్మ వ్యాధులకు కూడా చక్కగా పనిచేస్తుందని వారంటున్నారు. రక్త పోటు అధికంగా ఉన్నవారు పొటాషియం అధిక మోతాదులో లభించే పనసను తీసుకున్నట్లయితే సమస్య తీవ్రతను తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

పనస పాలను ద్రాక్ష సారాయిలో నూరి పట్టు వేసుకున్నట్లయితే దెబ్బలు, వాపులు నయమవుతాయి. పండిన పనస ఆకులు, వేర్లను సైతం చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంటారు. పనస చెట్టు నుంచి పండిన కాయను కోసిన వెంటనే తిన్నట్లయితే అంత రుచిగా ఉండకపోవచ్చు. అదే కాయగా ఉన్నప్పుడే చెట్టునుంచి కోసి పండిన తరువాత తింటే పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. అయితే ఈ పండుకి విరోచనాన్ని బంధించే శక్తి ఎక్కువ కాబట్టి, మితంగా తినాలి. ఎక్కువగా తిన్నట్లయితే అతిసార వ్యాధికి గురికాక తప్పదు.

అయితే లవణాలు, విటమిన్లు పనస పండులో తక్కువగా ఉంటాయి కాబట్టి జీర్ణం కావటం కష్టం. అందుకనే ఈ పండును మితంగానే భుజించాలి. తియ్యగా ఉంది కదా అని ఎక్కువ తింటే మేలు కంటే కీడే చేస్తుంది. అలాగే పనస గింజల్లో తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా చాలా కష్టంగా జీర్ణం అవుతాయి. అయితే పిల్లల్లో జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పండును కాల్చి ఇచ్చినట్లయితే వారు సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు.

Post a Comment

0 Comments