అతి తక్కువ కొవ్వు, పుష్కళంగా పీచు పదార్థం కలిగి ఉన్న 'కమలా ఫలం'ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే రక్తపోటు అదుపులో ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. కమలా ఫలం తినటంవల్ల హృదయ సంబంధ వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉండవచ్చునని వారంటున్నారు. అయితే కమలా ఫలంను అలాగే తింటే మూడు గ్రాముల పీచు శరీరానికి అందుతుంది. అదే జ్యూస్ గనుక చేసుకుని తాగితే మాత్రం కేవలం అర గ్రాము మాత్రమే అందుతుంది.
ఒక్క కమలా ఫలం మాత్రమే కాదు, మరికొన్ని రకాల పండ్లు, ఆహార ధాన్యాలు కూడా శరీరానికి అవసరమైన పీచు (ఫైబర్) పదార్థాలను పుష్కళంగా అందిస్తాయి. సాధారణంగా ఏ ఆహార పదార్థాలు అయితే ఎక్కువగా పీచు కలిగి ఉంటాయో అవి తక్కువ కేలరీలను అందిస్తాయి. కాబట్టి శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
మనకు ప్రకృతి సహజంగా లభించే అన్నిరకాల పండ్లు, కూరగాయలు, దినుసులు, గింజ ధాన్యాలలో పీచు పదార్థం లభిస్తుంది. ఇలాంటి ఆహారానికి అలవాటుపడితే క్రమంగా మితంగా తినటం కూడా అలవాటవుతుంది. దాంతో బరువును అదుపులో ఉంచుకోవటంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు. అందుకని ఎప్పుడుచూసినా పీచు పదార్థం ఉన్నవాటినే ఆహారంగా తీసుకోవాలని అనుకోవాల్సిన అవసరం లేదు.
రోజుకు కనీసం ఒక్క కమలా ఫలంను అయినా తింటే సరిపోతుంది. ముఖ్యంగా ఉదయంపూట అల్పాహారంలో భాగంగా కమలా ఫలంను తింటే చాలా మంచిది. అలాగే మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా కూరగాయలు ఉండేలా చూసుకుంటే చాలు. కూరలు, సూప్‌లను కూడా శాఖాహారంతో చేసుకోవటం ఉత్తమం. ఇంకా గింజ ధాన్యాలలో ఏదో ఒక దానికి ఆహారంతో తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లే.
పీచు పదార్థాలకు ఉండే ముఖ్య లక్షణం ఏంటంటే.. జీర్ణక్రియను సక్రమంగా నడిపేందుకు అవసరమైన ద్రవాన్ని పుట్టిస్తుంది. దీంతో పీచు పదార్థాలు తిన్నవారు అజీర్తి అన్న సమస్యనే ఎదుర్కొనే పరిస్థితి రాదు. కాబట్టి ఎల్లప్పుడూ పీచు పదార్థాలు మెండుగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే జీర్ణక్రియను సక్రమంగా ఉంచుకోవటమేగాకుండా, ఎలాంటి అనారోగ్యాలను దరిచేరనీయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

0 Comments