Full Style

>

ఆరోగ్యానికి మేలు చేసే ముల్లంగి


ముల్లంగిని చాలా మంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. దాని గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణం. కానీ వాస్తవానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
జాండిస్: ముల్లంగి లివర్ పాలిట వరప్రదాయని. హానికారక విషతుల్యాలను బయటకు పంపించండంలో ముల్లంగి పాత్ర అమోఘం. అలాగే కడుపును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కామెర్లు వచ్చిన వారు ముల్లంగి రసాన్ని తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది. అంతేకాదు కామెర్ల సమయంలో ఎర్రరక్తకణాలు తగ్గిపోకుండా కాపాడడంతోపాటు రక్తానికి ఆక్సిజన్ సక్రమంగా జరిగేట్లు చూస్తుంది. కామెర్ల సమయంలో నల్లముల్లంగి తీసుకుంటే చాలా మంచిది. వీటి ఆకులు కూడా కామెర్ల చికిత్సలో మంచిగా పనిచేస్తాయి.
పైల్స్: జీర్ణశక్తిని వృద్ధి చేసి దేహంలో నీరు నిలిచేలా చేస్తుంది. అలాగే పైల్స్ తొందరగా తగ్గిపోయేట్లు తోడ్పడుతుంది.
   మూత్రాశయ వ్యాధులు: మూత్రస్రావం మంచిగా జరిగేటట్లు చేసే గుణం ముల్లంగిలో ఉంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పితో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతుంది. మ్రూతపిండాలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి: ముల్లంగి రసానికి ఆకలి తగ్గించే గుణం ఉంది. అంతేకాదు ఇందులో క్యాలరీలు సమృద్ధిగా ఉన్నాయి. దాంతో ఈ రసం తాగడం వల్ల తినే ఆహార పరిమాణం తగ్గి తద్వారా బరువు తగ్గుతారు.
క్యాన్సర్: దీనిలోని సి-విటమిన్, ఫోలిక్ యాసిడ్, యాంతోసియానిన్ పలు రకాల క్యాన్సర్‌లను తగ్గించడానికి ఉపకరిస్తాయి. బొల్లి, తెల్లమచ్చలు: ముల్లంగి విత్తనాలను పొడిచేసి వెనిగర్‌లో లేదా అల్లంరసం, ఆవు మూత్రంలో కలిపి తెల్లగా ఉన్నచోట రాసినట్లయితే తగ్గిపోతాయి. ముల్లంగిని ఆహారంగా తీసుకున్నా తెల్లమచ్చలు తగ్గిపోతాయి.
చర్మవ్యాధులు: దీనిలోని సి-విటమిన్, ఫాస్ఫరస్, జింక్, బి- విటమిన్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముల్లంగి గుజ్జు ముఖానికి మంచి తేజస్సునిస్తుంది. ఇందులోని వ్యాధినిరోధక గుణం చాలా రకాల చర్మవ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది.

పురుగుకాటు: ముల్లంగి తేనెటీగ, పురుగు కాట్లలో వచ్చే నొప్పి, వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది. జ్వరం: జ్వరం కారణంగా వచ్చే నొప్పులను, శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ముల్లంగి రసంలో నల్లఉప్పును కలుపుకుని తాగితే ఇన్ఫెక్షన్లను తీసివేస్తుంది. దాంతో జ్వరం నెమ్మదిస్తుంది.
వీటితోపాటు ముల్లంగి ఆకలిని వృద్ధి చేస్తుంది. అలాగే నోటిశ్వాసను తాజాగా ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, తలనొప్పి, దగ్గుని తగ్గిస్తుంది.

Post a Comment

0 Comments