Full Style

>

జీర్ణశక్తికి మంచి ఔషధంగా పనిచేసే ములక్కాడ..!!


1. ములక్కాడలు రుచిగా ఉండటమే కాకుండా జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. జ్వరం వచ్చిన వారికి లేతములక్కాడలు వంటి పెడితే త్వరగా తగ్గుతుంది.

2. లేత మునగాకును వండుకుని తింటే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. చిన్న పిల్లలకు పక్క తడిపే అలవాటుంటే ఈ కూర పెడితే ఆ అలవాటు పోతుంది.

3. ప్రతి రోజూ మునగ ఆకు లేదా కాడలు వున్న ఆహారం తీసుకుంటే పచ్చి బాలింతలకు పాలు పుష్కలంగా వుంటుంది. తల్లిపాలతో పెరిగిన బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఎదుగుతాడు. బాలింతలకు పాలను పెంచే శక్తి మునగాకుకు వుంది.

4.మునగ చెట్టు వేరును దంచి రసం తీసి, ఆ రసంలో తేనే కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. పక్షవాతం వున్నా తగ్గుతుంది.

5. లేత మునగ చిగుళ్ళు రోజూ రసం తీసుకుని తాగితే బరువు తగ్గుతారు.

6. మునగ జిగురు ఆవుపాలలో మెత్తగా నూరి నుదురు మీద, కణతల మీద పట్టీ వేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది.

7. మునగాకును ఎండబెట్టి పొడిచేసుకుని పరగడుపున ఒక స్పూన్ పొడిని నోట్లో వేసుకుని కాస్త మంచినీరైనా లేదా మజ్జిగైనా త్రాగితే అల్సర్ బాధ తగ్గుతుంది. మునగాకును నీడలో ఎండనివ్వాలి.

Post a Comment

0 Comments