Full Style

>

యవ్వన రూపానికి.. కాస్మెటిక్ చికిత్స

కొరవడిన వ్యాయామం, మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి శరీరాకృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనివల్ల వివిధ రకాల అనారోగ్యాలతోపాటు తక్కువ వయసులోనే వృద్ధాప్యఛాయలు కనిపిస్తున్నాయి. చర్మం ముడతలు పడటం, జుట్టు రాలటం, చర్మం కాంతిహీనం కావటం, అవాంచిత రోమాలు ఏర్పడటం, మొటిమలు, మచ్చలు, పులిపిర్లు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యలన్నింటిని అధునాతన వైద్యపద్ధతులతో నివారించి, ఆరోగ్యవంతులుగా చేయవచ్చంటున్నారు కాస్మెటాలజీ, డెర్మటాలజీ నిపుణురాలు డాక్టర్ శ్వేత.
ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. ఇది కేవలం అందరి కోరిక మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా అవసరం. సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం వల్ల బరువు పెరిగి శరీరాకృతి దెబ్బతింటుంది.
ఉద్యోగంలో ఎక్కువసేపు కుర్చీలో కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల పొట్ట విపరీతంగా పెరిగి శరీరాకృతి దెబ్బతింటుంది. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం ఏర్పడుతుంది. స్థూలకాయం వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టడమే కాకుండా మనిషి జీవిత కాలాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో పెరిగిన కొవ్వును తగ్గించుకోవటం కోసం, అందమైన శరీరాకృతిని పొందటం కోసం జనం కాస్మెటిక్ సర్జరీల వెంట పరుగులు తీస్తున్నారు. ఈ సర్జరీల వల్ల అంతగా ఉపయోగం లేకపోగా, శరీరంపై మచ్చలు, గాట్లు ఏర్పడే అవకాశం ఉంది.
యుక్తవయసు తిరిగి రావాలంటే
ప్రస్తుతం మీకు ఉన్న వయసు కంటే 8 ఏళ్లు తక్కువ వయసు ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకున్న వృద్ధాప్య ఛాయలను అధిగమించేందుకు వీలుగా పలు రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. శరీరం ముడతలు పడినా, రంగు మారినా, కాంతీహీనంగా కనిపించినా, ముఖంపై మొటిమలు, పులిపిర్లు, మచ్చలు ఏర్పడినా, శరీరాకృతి సరిగా లేకున్నా, చర్మం వదులుగా మారినా, గొంతువద్ద చర్మం కిందకు జారినా, అవాంఛిత రోమాలు వస్తున్నా, వెంట్రుకలు రాలిపోతున్నా, బట్టతల ఏర్పడినా అభివృద్ధి చెందిన ఆధునిక వైద్య విధానాలతో ఈ సమస్యలన్నింటిని నివారించవచ్చు.
నివారణ చికిత్సలు
అందంగా కనిపించాలంటే వివిధ రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఫ్రాక్షనల్ లేజర్, పీల్స్, మైక్రోడెర్మ్ అబ్జార్షన్, డెర్మ్‌రోలర్, రేడియో ఫ్రీక్వెన్సీ, లైపో కెవిటేషన్, నాన్ సర్జికల హిపో, ఆర్.ఎఫ్. , సెల్లోఫేజ్, లేజర్ ట్రీట్‌మెంట్, స్టెమ్‌సెల్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి.
స్థూలకాయాన్ని తగ్గించేందుకు
ఒక వ్యక్తికి బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 25 వరకు అంటే సాధారణ బరువు అని పరిగణిస్తారు. 25 నుంచి 29.9 బీఎంఐ ఉంటే అధిక బరువుగా భావిస్తారు. బీఎంఐ 30.4కు పైగా ఉంటే ఒబేసిటీ. మార్బిడ్ ఒబేసిటీ అని చెప్పవచ్చు. బీఎంఐ 30-40 మధ్య ఉన్న వారు స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు నాన్ సర్జికల్ పద్ధతిలో చికిత్స చేయించుకోవాలి. పురుషులు, స్త్రీలు శరీరంలోని ఏ భాగంలోనైనా చర్మం కింద అదనంగా పేరుకుపోయిన కొవ్వును తొలగించేందుకు నాన్ సర్జికల్ లైపోసక్షన్ అంటారు.
నాన్ సర్జికల్ లైపోసక్షన్ అంటే ఏ భాగంలో కొవ్వును కరిగించాలో నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రదేశంలోని ఆల్ట్రాసౌండ్ వేవ్స్‌ను పంపించడం జరుగుతుంది. ముందుగా ఆల్ట్రాసోనిక్ జెల్ అప్లై చేసి లో ప్రీక్వెన్సీలో ఆల్ట్రాసోనిక్ వేవ్స్‌ను ఫ్యాట్ సెల్స్‌పైకి పంపిస్తారు. ఈ చికిత్స విధానంలో రక్తనాళాలపైన కాని, నరాల పైన కాని ఎలాంటి ప్రభావం చూపించదు. పూర్తిగా సురక్షితమైన ట్రీట్‌మెంట్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. వారంలో రెండు రోజులు ఈ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చికిత్స ద్వారా 10 నుంచి 15, 15- 20 కిలోల బరువు తగ్గవచ్చు.
బరువు తగ్గించేందుకు ఆర్ఎఫ్ చికిత్స
శరీరంలో నీటిశాతం ఎక్కువగా ఉంటే, సులువుగా బరువు తగ్గుతారు. తక్కువ సిట్టింగ్స్‌లో బరువు తగ్గుతారు. నొప్పి ఉండదు. శరీరంపై గాట్లు, కుట్లు ఏర్పడవు. ఎక్కువ కాలం తిరిగి ఫ్యాట్ తొలగిన తర్వాత చాలా వదులుగా ఉంటుంది. ఇలాంటపుడు చర్మం బిగుతుగా చేయడానికి ఆర్ఎఫ్ అనే మెషీన్ చికిత్స చేయవచ్చు.
ఈ చికిత్స వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ప్రసవం తర్వాత చాలామంది మహిళల్లో పొట్ట పెరుగుతుంది. బిడ్డ పెరిగేటప్పుడు సాగిన పొట్ట మళ్లీ యథాస్థితికి చేరకపోవటం వల్ల వచ్చే సమస్య ఇది. 30 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్ఎఫ్ మెషీన్ ద్వారా సాగిన పొట్టను బిగుతుగా చేయవచ్చు.

Post a Comment

0 Comments