సమస్యలంటూ లేనిదెవరికి? కానీ,
అందరూ సమస్యలను చూసి భయపడటం లేదు. అధిక శాతానికి చెందిన వారు, సమస్యలకు
ఎదురొడ్డలేక ఓడిపోతుండగా, అతి తక్కువ శాతం మాత్రమే సమస్యలను ధైర్యంగా
అధిగమిస్తున్నారు.
లెక్కకు మిక్కిలి సమస్యలు ఎదురైనప్పుడు, కొంతమంది కేవలం చిరునవ్వుతో ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తుంటారు. మరికొంతమంది మాత్రం సమస్యలకు తమ జీవితాన్ని అప్పగించి చోద్యం చూస్తుంటారు. అసలు చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కోవడమే అసలైన తరుణోపాయం.
కొన్నికొన్నిసార్లు తీవ్ర సమస్యలు ఎదురై, మనిషిని తల్లక్రిందులు చేసి, విరక్తికి గురిచేస్తాయి. అలాంటప్పుడే మనకు ఇలాంటి సమస్యలు నుంచి తేలిగ్గా బయటపడిన వ్యక్తుల స్ఫురణ వస్తుంటుంది. ఒక్కసారిగా పేదరికంలో పడిపోవడం, ఆప్తులు మరణించడం వంటి కష్టాలు, అతి పెద్ద సమస్యలు. అయితే, కొంతమంది ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా గుండె దిటవు చేసుకుని సమస్యల నుంచి బయటపడుతుంటారు.
జటిలమైన సమస్యలైనప్పటికీ, సాధారణమైన సమస్యలైనప్పటికీ, క్రమశిక్షణా రాహిత్యంలో కూడిన తెలివితక్కువ వారినే అధికంగా బాధిస్తుంటాయి. తెలివిగలవారు మాత్రం సమస్యలతో సహజీవనం చేస్తూనే, తగిన సమయం, సందర్భాన్ని చూసి, సమస్యలకు సమాధి కడుతుంటారు. అలాంటి వ్యక్తులను దీర్ఘదర్శులుగా ఈ ప్రపంచం గుర్తిస్తుంది.
కానీ, మనలో అధిక శాతం, సమస్యలతో హాయిగా ప్రయాణం చేయలేక, సమస్యలకు లోంగిపోతున్నారు. చెప్పాలంటే, సమస్యలు మనల్ని సమాధి చేయకముందే, సమస్యలను మనం సమాధి చేయాలి, ఇంకా చెప్పాలంటే, సమాధి కూడా ఒక సమస్య కాదు.... దాన్ని సరిగ్గా ఎదుర్కోగలిగితే!!
సమస్యలకు మనం లొంగిపోవడం వల్ల, ఆ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. మనం లొంగుతున్నకొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఇది వ్యక్తిగత జీవితానికి, సామూహిక జీవితానికి అన్వయిస్తుంది. దేశాన్ని పట్టిపీడించే సమస్యలను ఆ దేశప్రజలే ఎదురొడ్డి పోరాడాలి.
ధైర్యసాహసాలతో కూడిన ప్రజలే సమస్యలను అధిగమించగలరు. సమస్యలతో రాజీపడిపోయే ప్రతీ వ్యక్తి జీవితంలో అన్ని రంగాలలో విఫలమౌతాడనడంలో సందేహం లేదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ ఈ ఎత్తుపల్లాలను దాటాలి. అది భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు. ప్రతిస్థాయిలో, దానికి తగిన విధంగా పోరాడాల్సి ఉంటుంది. ప్రేమాదరణలకు నోచుకోలేని ఓ బాలికకు, అందుకు తగిన పరిష్కారమే కావాలి. అలాగే అశాంతితో మగ్గిపోతున్న వ్యక్తికి మానసిక శాంతి కావాలి.
ఆధ్యాత్మిక దాహం గల వ్యక్తులు, ఆధ్యాత్మిక సాధన ద్వారా స్వాంతన పొందుతుంటారు. దీనికి ఎలాంటి అడ్డదారులు లేవు. అనాది నుంచి మన భారతీయులకు దిశానిర్దేశం చేస్తున్న మార్గం ఇదే !!

0 Comments