Full Style

>

మూడ్ బాగోలేదా.. మరేం వర్రీ అవ్వద్దు... అదీ మంచిదే..!!

మూడ్ బాగోలేని వారిని చూడటానికి ఇతరులకు బాగుండదేమో కాని, ఆ చెడు మూడ్ బాగుండని వారికి అది మంచిదే. చెడు మూడ్‌ని ప్రదర్శించే వారికి జ్ఞాపకశక్తి చాలా బాగుంటుంది. ఇతరులను అంచనా వేయటంలో మెరుగ్గా ఉంటారు. ఇతరుల మాటలను అంత సుళువుగా నమ్మనే నమ్మరు.

సరైన మూడ్ లేనటువంటి వారు తమ పరిసరాలను బాగా గమనిస్తారు. ఆనందకర మూడ్‌లో ఉండేవారు పట్టించుకోలేకపోయిన అంశాలను కూడా మూడ్ సరిగా ప్రదర్శించని వారు గమనించి అర్థం చేసుకుంటారు. వీరి ఆలోచనలు చాలా సమతుల్యంతో ఉంటాయి. తొందరపడి నిర్ణయాలకు రారు. చెడు మూడ్ కలిగిన వారు హఠాత్తు నిర్ణయాలు అస్సలు తీసుకోరు.

భాష, మతం, జాతిపరమైన తేడాలను పట్టించుకోరు. అందరినీ ఒకేలా చూడగలిగిన గుణం వీరి సొంతం. తమ వాదనను చక్కని పద్ధతిలో కాగితం మీద పెడతారు. ఇటువంటి మూడ్ కలిగిన లాయర్స్ విజయం సాధించటం వెనకున్న పరమ రహస్యం ఇదే.

Post a Comment

0 Comments