Full Style

>

జ్ఞాపక శక్తి పెరగాలంటే...


వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకాలు మసకబారుతాయి. దీంతో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ భయపడాల్సిన పనిలేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు తీసుకునే ఆహారంలో మెగ్నీషియం సమపాళ్ళలోవుంటే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నేర్చుకోవాలనే ఆకాంక్ష మరింతగా పెరుగుతుంది.

మనిషిలో తగ్గుతున్న జ్ఞాపక శక్తికి సంబంధించి చైనాకు చెందిన పేయిచింగ్‌లోని సింగహువా విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ మెమొరీ ఫర్ సెంటర్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ గుఓసోంగ్ లియూ నాయకత్వంలో ఎలుకలమీద పరిశోధనలు జరిపినట్లు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పత్రిక న్యూరాన్

జ్ఞాపక శక్తికి సంబంధించినంత వరకు ఎలుకల మీద పరిశోధనలు జరిపితే తెలిసి విషయాలేంటంటే వాటికిచ్చే ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, దీంతో వాటిలో జ్ఞాపక శక్తి మరింతగా పెరిగిందని డైరెక్టర్ గుఓసోంగ్ లియూ పేర్కొన్నారు. అదే శరీరంలో మెగ్నీషియం తగ్గితే ఆ ప్రభావం జ్ఞాపక శక్తిపై తీవ్రంగా ఉంటోందని ఆయన తెలిపారు. దీంతో వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుందన్నారు.

మనిషి శరీరంలోనున్న మెదడుతోపాటు ఇతర భాగాలకు మంచి పట్టు, దృఢత్వం కలుగజేసేందుకుగాను మెగ్నీషియం చాలా అవసరమంటున్నారు లియూ. తాము పరిశోధనలు చేసిన ఎలుకలలోని మెదడులో మెగ్నీషియం శాతం పెరగడంతో వాటిలో జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు తెలుసుకోవాలనే కోరిక బలీయంగా పెరిగినట్లు ఆయన వివరించారు. మనిషి తీసుకునే ఆహారంలో తరచూ మెగ్నీషియం ఉండేలా చూసుకుంటే వారిలోనున్న జ్ఞాపక శక్తి ఎప్పటికీ తరగదంటున్నారు లియూ.

Post a Comment

0 Comments