Full Style

>

అధిక బరువు కాలేయానికి ప్రమాదమా !


మనిషి వయసుకు తగ్గ బరువు ఉండటంతో ఆరోగ్యంగా ఉంటారు, అదే అధిక బరువు పెరిగి ఊబకాయులుగా తయారైతే అది మరింత ప్రమాదకరమంటున్నారు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.

మద్యపానం తీసుకోవడంతో ఆరోగ్య పాడవుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ చాలామంది మద్యపానం తీసుకోవండ మానలేకపోతున్నారు. మద్యపానం తీసుకోవడంతో కాలేయం పాడైపోతుంది. దీంతోపాటు అధిక బరువు ఉండటం చేత వీటి ప్రభావం ముఖ్యంగా కాలేయంపై పడుతుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపినట్లు బ్రిటీష్ మెడికల్ జర్నల్ పేర్కొంది.

శరీర పరిమాణ సూచికననుసరించి మద్యపానం అధికంగా తీసుకుంటున్న అధిక బరువు కలిగిన వారిలో కాలేయానికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉత్పన్నమౌతున్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది ప్రధానంగా మధ్యవయస్సు వారిలో ఎక్కువగా కనపడుతోందని, నిత్యం తీసుకునే ఆహారంతోపాటు సాధారణమైన వ్యాయామం కూడా లేకపోవడంతో శరీర బరువు పెరిగిపోతోందని, దీంతో వారిలో కాలేయ సమస్యలు తలెత్తుతున్నాయని డాక్టర్ బెట్టె లియు తెలిపారు. కాబట్టి అధిక బరువును నియంత్రించుకోవడంతోపాటు మద్యపానం అలవాటును కూడా మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments