-చిన్న మశూచి ,చికెన్ పాక్స్,ఆటలమ్మ,చిన్న అమ్మవారు,Chickenpox-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఆటలమ్మ అంటువ్యాధి. ఇది 'వారిసెల్లా జోష్టర్' అనే వైరస్ క్రిముల ద్వారా సంక్రమిస్తుంది. ఈ క్రిములే తర్వాతి కాలంలో పెద్దల్లో 'సర్పి' వ్యాధికీ కారణమవుతాయన్నది గమనార్హం! సాధారణంగా 10 సంవత్సరాల వయసులోపు పిల్లలే ఎక్కువగా ఆటలమ్మకు గురవుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి మించిన అంటువ్యాధి లేదు. ఆటలమ్మ బారినపడిన రోగి మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుండి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా ఈ వ్యాధికారక క్రిములు ఎదుటి వారికి సంక్రమిస్తాయి.
వాస్తవానికి ఆటలమ్మ లక్షణాలు కనిపించటానికి 24 గంటల ముందు నుంచే ఈ వ్యాధికారక క్రిములు ఆ రోగి నుండి ఎదుటివారికి సంక్రమించే అవకాశాలుంటాయి. ఒంటి మీద ఆటలమ్మ పొక్కులు కనిపించి, అవి చెక్కులు కట్టడానికి 6, 7 రోజులు పడుతుంది. అప్పటి వరకూ కూడా ఆ రోగి నుండి ఈ వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశముంటుంది. ఆ చెక్కుల ద్వారా మాత్రం ఈ వ్యాధి ఇతరులకు రాదు.
ఆటలమ్మను పోలిన వ్యాధి సర్పి. ఇది పెద్ద వయసు వారిలోనే వస్తుంది. కనిపించే తీరును బట్టి దీన్ని 'జంధ్యాల సర్పి' అనీ అంటారు. సర్పితో బాధపడే రోగుల వద్దకు వెళ్ళిన పిల్లలకు ఆటలమ్మ రావచ్చు. కానీ ఆటలమ్మతో బాధపడే పిల్లల వద్దకు వచ్చిన పెద్దలకు మాత్రం ఆటలమ్మ రాదు. ఇది గమనార్హమే. బడి పిల్లల్లో ఆటలమ్మ వ్యాధి ప్రబలినప్పుడు దానికి మూలం బడిలోని ఓ ఉపాధ్యాయుని సర్పి కావచ్చు. ఇంట్లో పెద్దవారికి సర్పి ఉంటే వారి దగ్గరకు పిల్లలను పోనీయకూడదు.
ఆటలమ్మ 2-3 సంవత్సరాలకు ఒకసారి అంటువ్యాధిలా ప్రబలుతుంది. స్కూలు పిల్లలలో ఎక్కువగా కన్పిస్తుంది. 6 మాసాలలోపు శిశువులకు ఈ వ్యాధి సోకితే చాలా ప్రమాదకరమని గుర్తించాలి. చిన్న వయసులో ఈ క్రిములు ఒంట్లో చేరినా.. ఎటువంటి లక్షణాలూ లేకుండా గుప్తంగా ఉండిపోయి, పెద్ద వయస్సు వచ్చాక సర్పి వ్యాధి కనిపించవచ్చు. కొందరిలో ఈ క్రిములు శరీరంలో ప్రవేశించినా అవి వ్యాధిని కలగించలేకపోవచ్చు. వారిలోని రోగ నిరోధక శక్తి అధిక ప్రాధాన్యత సంతరించుకొంటుంది.
క్రిములు శరీరంలో ప్రవేశించిన తర్వాత 2 వారాలకు గానీ వ్యాధి లక్షణాలు బయటపడవు. దీన్నే 'ఇన్‌క్యుబేషన్ పీరియడ్' అంటారు. జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించడం, నడుము నొప్పి, నీరసం తదితరాలు ఈ వ్యాధి లక్షణాలు. ఛాతీ మీద మచ్చలు కన్పిస్తాయి. మచ్చలు క్రమంగా బొబ్బలుగా మారతాయి. బొబ్బల చుట్టూ చర్మం కంది ఉంటుంది. వీటిలో చీము చేరి.. క్రమేపీ ఈ చీము బొబ్బలు మాడిపోయి చెక్కులు గట్టి, వూడిపోతాయి. ఇదంతా మూడు వారాల్లో జరిగిపోతుంది. బొబ్బలు కన్పించగానే విపరీతమైన దురద ఉంటుంది. గోకితే గోకిన చోట చీముగుంటలేర్పడతాయి. నిద్రలో గోకే ప్రమాదముంది గనుక వీరికి గోళ్ళు కత్తిరించాలి. పిల్లలకైతే చేతులకు గుడ్డలు కట్టటం మంచిది. పక్క దుప్పట్లు తరచూ మారుస్తుండాలి. ఇంట్లో పిల్లలుంటే రోగి వద్దకు పోనీయరాదు. పెద్దవాళ్ళు కూడా ఆటలమ్మ రోగికి మరీ సన్నిహితంగా మెలగకూడదు. వీరికి ఆటలమ్మ రాకపోయినా సర్పి రావచ్చు. ఆటలమ్మ రోగి మగతగా ఉన్నా, తలనొప్పి, వాంతులు తోడయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
''చికెన్ పాక్స్'' (Varicella-minor) వైరస్ అనే చిన్న క్రిముల దార్వావచ్చు చర్మవ్యాధి. చికెన్ పాక్స్ ను ఆటలమ్మ, చిన్న అమ్మవారు అంటాం. ఆటలమ్మ అనే మాట వినగానే మనకు ఒళ్ళు జలదరిస్తుంది. దీనినే ఆంగ్లంలో చికెన్ పాక్స్ అంటారు. అటలమ్మ వచ్చిందంటే ఒళ్ళంత పుండ్లు గిల్లితే మరింత ఎక్కువ. జ్వరంతో ఆరంభమయ్యే ఈ వ్యాధికి రెండు రోజుల తరువాత మెల్లగా ఒళ్ళంతా గుల్లలు మొదలవుతాయి. కొన్ని తగ్గతూ ఉంటే మరికొన్ని కొత్తవి పుడతా ఉంటాయి. ఈ వ్యాధి దాదాపుగా 10 నుంచి 15 రోజుల వరకూ ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంటుంది.
పొక్కులు శరీరము పై అనగా covered parts లో(చాతి , వీపుపైన ) ఎక్కువగాను ... ముఖము పైన , కాళ్ళు ,చేతులపైనా తక్కువగాను ఉండుట దీని ప్రత్యేక లక్షణము .
లక్షణాలు:-
1. ముఖం, వీపు, ఛాతి భాగములో దురదతో కూడిన ఎఱ్ఱగ వచ్చు చర్మవ్యాధి.
2. నీటితో కూడిన బొబ్బలు వస్తాయి.
3. ఈ లక్షణాలకు ముందు 2 రోజులు తేలికపాటి దగ్గు, జలబు, తేలికపాటి జ్వరము, తలనొప్పి, నీరసము, ఆకలి తగ్గుట, తేలికపాటి కడుపునొప్పిలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎలావ్యాపిస్తుంది:-
చికెన్ పాక్స్ తో బాధపడుతున్న వ్యక్తిని - ఆరోగ్యంగా వున్నవారు తాకిన; వారుతుమ్మినప్పుడు - దగ్గినప్పుడు - వైరస్ క్రిములు గాలి ద్వారా ఎదుటవున్న వారిలో ప్రవేశించి - ఈ జబ్బు వస్తుంది. ఇది ఒకరినుండి ఇంకోకరికి సోకే అంటువ్యాధి.
చర్మముపై లక్షణాలు కనపడక ముందు 2 రోజులనుండి - దద్దుర్లు పూర్తిగమాని, మచ్చలుగా తయారైనంతవరకు ఈ క్రిములు ఆరోగ్యవంతులకు సోకే అవకాశం వుంది.
చిన్నపిల్లలు, యుక్తవయస్సు వారిలో ఈ వ్యాధి ఎక్కువ శాతం వస్తుంది. చిన్నపిల్లల సంరక్షణ సంస్థలు, పాఠశాలలు, మురికి వాడలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
1. దద్దుర్లను, బొబ్బలను గీరకూడదు, చిట్లించరాదు.
2. వీలైనంతవరకు పిల్లలకుగోళ్ళు లేకుండా చేయాలి, రాత్రులలో- తెలియకుండా
గీచుకోకుండునట్లు - చేతులకు శుభ్రమైనగుడ్డకాని, గ్లౌజులుకాని తొడగాలి.
పిల్లలకు ఈ జాగ్రత్త నేర్పించాలి, చెప్పాలి.
3. వీలైనంతవరకు చల్లనినీటితో/గోరువెచ్చని నీటితో స్నానము చేయించిన దురదలు
కాస్తతగ్గుతాయి.
4. కాలమిన్ లోషన్ తో చర్మముపై పూత దురదను కాస్త తగ్గిస్తుంది.
5. జ్వరము, దగ్గు అధికంగా వున్నా, డాక్టరును సంప్రదించి వైద్యం చేయించడం అవసరం.
6. ఆస్పిరిక్ , ఇబూప్రొఫెన్(బ్రుఫెన్)లాంటి మందు వాడరాదు.
7. సులభంగా జీర్ణమగు అహార పధార్దాలు, ద్రవపదార్దాలు తీసుకోవాలి.
8. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి.
9. చికెన్ పాక్స్ వున్న వారి వస్తువులు, బట్టలు, సబ్బు మొదలైనవి వేరుగా వుంచాలి. వాడినబట్టలను - వేడినీళ్ళతో శుభ్రపరచాలి.
10. ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి.
11. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం.
12. జ్వరానికి పారాసెటమాల్ వాడవచ్చును .
నివారణ:-
చికెన్ పాక్స్ (varicella) టీకాలు మాత్రమే వ్యాధిని - నిరోధించగలవు. ఈ వ్యాధి వచ్చు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, యుక్త వయస్సువారికి ఈ వ్యాధినిరోధక టీకాలు వేయించుట ద్వారా - వ్యాధి సంక్రమణను అదుపుచేయవచ్చును.సమాజంలో ఈ వ్యాధిలక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అనగాహన కలిగే చర్యలు చేపట్టాలి.
చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.
చికిత్స :
జ్వరానికి : పరసెటమా మాత్రలు వేసుకోవాలి .. చిన్నపిల్లకు 250 మి.గ్రా. చొప్పున , పెద్దవాళ్ళకు 500 మి.గ్రా . రోజుకు మూడు సార్లు .5-7 రోజులు .
దురదకు : Cetrazine Or Levocetrazine రోజుకి ఒకటి 5-7 రోజులు వాడాలి.
పుల్లు అవకుండా : Azithromycin 250 mg . (adults ) 125 mg (children) రోజుకు 2 చొ. 7 రోజులు . చర్మము పైన Aloderm skin ointment రాయవచ్చును ... మచ్చలు కొంతవరకు పోవును .
నీరసము తగ్గడానికి : బి.కాంప్లెక్ష్ మాత్రలు గాని సిరప్ గాని వాడాలి.

0 Comments