చికున్‌గున్యా జ్వరం : ఇదొక వైరస్ వ్యాధి. ఈడిస్ ఈజిప్టై, ఈడిస్ ఆల్బోప్టికస్ అనే దోమలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి మనుష్యులకు సంక్రమిస్తుంది. డెంగ్యూ ఫీవర్, ఎల్లో ఫీవర్ వ్యాధులు కూడా ఈ దోమల కాటు వల్లనే వస్తాయి.
వ్యాధి చరిత్ర : ఆఫ్రికా ఖండంలోని టాంగన్యికా, మొజాంబిక్ దేశాల మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉండే మకాండే పీఠభూమిలో 1952లో ఈ వ్యాధి మొదటిసారిగా వ్యాపించింది. మేరియన్ రాబిన్సన్, లమ్స్‌డెన్ అనే వైద్యులు ఈ వ్యాధి గురించి 'ట్రాన్సాక్షన్స్ ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసన్ అండ్ హైజీన్ అనే వైద్య పత్రికలో ప్రథమంగా 1955లో ప్రచురించారు.
అప్పటినుంచి ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనూ, ఇతర ప్రాంతాల్లోను ఈ వ్యాధి వస్తూనే ఉన్నది. ఆసియాలో ఇండియా, శ్రీలంక, మయన్మార్, థా§్‌ులాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, కాంబోడియా, వియత్నాం, హాంకాంగ్, మలేషియా మొదలైన దేశాల్లో ఒకే సమయంలో వేలాదిమందికి (ఎపిడమిక్) ఈ వ్యాధి సోకింది.
భారతదేశంలో మొదటిసారి 1963లో కల కత్తాలోను, తరువాత 1964-65 సంవత్స రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ల్లోనూ ఈ వ్యాధి వ్యాపించింది. అప్పట్లో మద్రాసు నగరంలో సుమారు 3 లక్షల మందికి ఈ వ్యాధి సోకిందని నిపుణులు అంచనా వేసారు.
సుమారు 32 సంవత్సరాలు కనుమరుగై, తిరిగి 2005 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో అనేకమందికి ఈ వ్యాధి సోకింది. ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వ్యాపించింది.
2007 సంవత్సరంలో జనవరినుంచి ఆగస్టు వరకు 12 రాష్ట్రాల్లో 30,710 మందికి ఈ వ్యాధి సోకిందనీ, ఎక్కువగా కేరళ రాష్ట్రంలో 22,583 మంది ఈ వ్యాధితో బాధపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికలు తెలుపుతు న్నాయి. 2009లో మనరాష్ట్రంలో హైదరాబాద్ లోను, ఇతర జిల్లాల్లోనూ వేలాదిమందికి ఈ వ్యాధి సోకింది.
లక్షణాలు : దోమ కుట్టిన 2 నుంచి 12 రోజుల్లో (సాధా రణంగా 3 నుండి 7 రోజుల్లో) అకస్మాత్తుగా 102నుండి 105 డిగ్రీల జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి ఉంటాయి.
కళ్లు ఎర్రబడటం, కాళ్లు చేతుల మీద, శరీరం మీద దద్దుర్లు మొదలైన లక్షణాలు ఉండవచ్చు. మోకాళ్లు, మోచేతులు, మణికట్లు, మడమకీళ్లు, చేతి కీళ్లు వాచి బాధపెడతాయి. కదలికలతో ఈ నొప్పులు మరింత పెరుగుతాయి. తాకితే ఈ కీళ్లు, కండరాల బాధలు మరింత పెరుగుతాయి.
రాత్రిళ్లు నిద్ర లేకపోవచ్చు. తీవ్రమైన నొప్పులతో వంగిపోయే లక్షణాలు ఉండటం వల్ల ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది.
మకాండే స్థానిక భాషలోని క్రియాపదం 'కుంగున్యాల (వంకరపోవడం, వంగిపోవడం) నుంచి చికున్‌గున్యా అనే పేరు వచ్చింది. ఈ వ్యాధిలో జ్వరం 3నుంచి 4 రోజుల్లోనే తగ్గిపోతుంది. కొంతమందిలో కొద్ది రోజుల తరువాత మళ్లీ జ్వరం రావచ్చు. కీళ్ల నొప్పులు కూడా చాలామందిలో 1 నుండి 3 వారాల్లో తగ్గుతాయి. కొంత మందిలో కొన్ని వారాలపాటు నీరసం, అలసట ఉండవచ్చు.
వ్యాధి నిర్ధారణ : వ్యాధి నిర్ధారణకు ఐజిఎం(igM) రాపిడ్ టెస్ట్ వంటివి ఉపయోగపడతాయి. రోగి రక్తం లో ఎలిసా పద్దతిలొ ఐ.జి.యం. యాంటిబాడీ పరీక్ష ద్వారా వైరస్ ను గుర్తించవచ్చును . రక్తం లో తెల్ల రక్తకణాలు కౌంట్ తనికీచేసి అవి నార్మల్ కంటే తక్కువ (4-11 thosands /cubic Milli meter ) ఉంటే ఈ వ్యాధి గురించి ఆలోచించాలి .
చికిత్స :
క్వాలిఫైడ్ వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే చికిత్స జరగాలి. విచ్చలవిడిగా స్టీరాయిడ్స్‌ను, నొప్పులను తగ్గించే ఎన్‌ఎస్‌ఎఐడి(NSAID) మందులను వాడకూడదు. మందుల షాపులు, అన్‌క్వాలిఫైడ్ వైద్యుల సలహాతో పై మందులను విచక్షణా రహితంగా వాడకూ డదు. ఆస్పిరిన్, కొన్ని యాంటీబయాటిక్ మందులను వాడటం వల్ల వాంతులు, రక్త స్రావం, రక్తంలో ప్లేట్ లెట్ కణాలు తగ్గిపో వడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
వ్యాధితో బాధపడుతున్న వారు విశ్రాంతి తీసుకుంటూ వైద్యుని పర్యవేక్షణలో పారాసిట మాల్ వంటి ఔషధాలను వాడవచ్చు. తగినంత ద్రవపదార్థాలను తీసుకోవాలి. డీహైడ్రేషన్ ఉంటే సెలైన్స్ పెట్టాలి . యాంటి వైరల్ ఔషధాలు ఈ వ్యాధిలో పని చేయవు. కొద్ది రోజులు, వారాల్లో ఈ వ్యాధి తగ్గుతుంది.
నివారణ
చికున్‌గున్యా బాధి తులు తమను దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని కుట్టిన దోమలద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపిం చవచ్చు.
ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలువ ఉండే ఖాళీ డబ్బాలు, ఖాళీ కుండలు, కొబ్బరి చిప్పలు మొదలైన వాటిని తొలగించాలి. ఇటువంటి చోట్ల దోమలు ఉత్పత్తి అవుతాయి.
దోమల లార్వాలను నశింపజేసే డీజిల్ ఆయిల్, కిరోసిన్ మొదలైన నూనెలను మురుగు కాల్వల మీద, ఇతర చోట్ల వారానికి ఒకసారి చల్లాలి.
ఫెన్‌థియాన్ వంటి కీటక సంహార మందు లను ఇంటి గోడల మీద చల్లాలి. లార్వాలను నిర్మూలించడానికి గంబూసియా, లెబిస్టర్ వంటి చేపలను కాలవల్లో, చెరువుల్లో వదలాలి.
దోమల నివారణకు పరిసరాల్లో ఫాగింగ్ చేయించాల్సిన బాధ్యత ఆరోగ్యాధికారులపై ఉంది. జెనిటిక్ ప్రక్రియల ద్వారా దోమల ఉత్పత్తిని నిరోధించే కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉంది.
వ్యక్తిగత జాగ్రత్తలలో ప్రతి వ్యక్తి దోమతెరను వాడటం, కిటికీలకు, ద్వారాలకు మెష్ ఏర్పాటు చేసుకోవాలి. డైఇథైల్‌టాల్యుమైడ్, డైఇథైల్ బెంజమైడ్ వంటి ఆయింట్‌మెంట్లను శరీరానికి పూసుకోవాలి.
దోమల నివారణకు ప్రజలు కూడా అవగా హనతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేలాది మందిని బాధిస్తున్న చికున్‌గున్యా వ్యాధికి త్వర లోనే వ్యాక్సిన్ కనిపెడతారని ఆశిద్దాం.

0 Comments