Full Style

>

మాల్‌ ఎబ్జార్పషన్‌ సిండ్రోమ్‌ , Malabsorption Syndrome



మాల్‌ ఎబ్జార్పషన్‌ సిండ్రోమ్‌ , Malabsorption Syndrome-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


బరువు క్రమేణా తగ్గడం, జిడ్డుతో కూడిన రంగు మారిన విరేచనాలు, ఆహారం తీసుకున్న కొద్దిసేపటికి విరేచనాలవడం వంటి లక్షణాలున్నప్పుడు దాన్ని మాల్‌ ఎబ్జార్పషన్‌ సిండ్రోమ్‌గా పరిగణించాలి. ఎన్నో వ్యాధుల కలయిక వల్ల ఇది వస్తుంది. ఆహారం జీర్ణమవుతున్నప్పుడు రక్తంలోనికి పేగుల ద్వారా ఆహారం శరీరంలోని కణజాలాలకు అందదు. సరిగ్గా లేని ఈ జీర్ణక్రియ వల్ల మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది. కొవ్వు పదార్థాల జీర్ణక్రియ సరిగ్గా వుండదు. కొవ్వులో కరిగే విటమిన్‌-ఎ, విటమిన్‌-డి, విటిమిన్‌-కె, కాల్షియం సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది.

వర్గీకరణ (classification) :
1. సెలక్టివ్ (selective) : ఇది లాక్టోజ్ మాల్ ఎబ్జార్పషన్ లో కనిపిస్తుంది .
2. పార్షియల్ (Partial) : దీనిని beta-lipoproteinaemia లో కనిపెట్టేరు .
3. టోటల్ (Total) : Coeliac disease లో చూడబడుతుంది .

మాల్ అబ్సార్పషన్‌ జీవ పక్రియ విధానము : (pathophysiology) :
ఆహారవాహిక ముఖ్యమైన పని జీర్ణ పక్రియ జరిపి పోషకాలు అయిన carbohydrates , proteins , fats and vitamins & minerala , water , electrolytes గ్రహించి (absorb) రక్తము లోనికి చేర్చడము . జీర్ణము ... మెకానికల్ అంటే నమలడము , అన్ని బాగా కలిసేటట్లు చేసి కైమ్‌ గా మార్చడము , రెండోది ఎంజైములతో కలిపి జీర్ణము చేయడము . మాల్ అబ్సార్పషన్‌ లో ఈ విధానము అస్తవ్యస్తము అయి తిన్నది సరిగా వంటపట్టదు . ఈ క్రింది కండిషన్లు మాలాబ్సాబ్ప్షన్‌ కి దోహదము చేస్తాయి .
మూకస్ పొర గాయాలు (mucosal damage ),
పుట్తుకతో వచ్చిన మార్పులు (congenital defects),
హైడ్రాలిసిస్ లో ప్రత్ర్యేక లోపాలు (defects of specific hydrolysis),
పాంక్రియాస్ గ్రంది లోపభూయిష్తము (pancreatic insufficiency),
గతితప్పిన ప్రేగుల-కాలేయ రక్తపరసరణ (impaired enterohepatic circulation),

కారణాలు :
బైల్‌ ఆమ్లాలు తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల కొవ్వు పదార్థాల జీర్ణ వ్యవస్థ లోపభూయిష్ట మవుతుంది.
జీర్ణకోశ ఆపరేషన్‌ జరిగినప్పుడు కొవ్వు పదార్థాలు పేగులలో పీల్చబడవు.
కొన్ని పేగుల వ్యాధులు అంటే, 'కాలన్స్‌ డిసీజ్‌', 'సీలియాక్‌ వ్యాధి' 'స్ప్రూ' 'లాక్టేజ్‌' లోపం, జెజునంలో లోపం.
కడుపులో ఏలికపాములు, జియార్థియాసిస్‌.
పేగులను కత్తిరించే శస్త్రచికిత్స వల్ల జీర్ణమైన ఆహారం రక్తంలోనికి చేరకపోవడానికి ముఖ్య కారణాలు.
whipple's disease ,
Intestinal T.B,
HIV related malabsorption ,

లక్షణాలు:
బరువు తగ్గిపోవడం. పిల్లలలో ఎత్తు పెరుగుదల ఆగిపోవడం. 'స్టిమోటోరియా' (జిడ్డుగా ఉండి, తెల్లగా దుర్వాసన కలిగిన విరేచనాలు). కడుపులో నొప్పిగా వుండటం. పోషక ఆహారపు లోపం వల్లే కలుగు లక్షణాలు (రక్తహీనత). విటమిన్‌- కె లోపం వల్ల కలిగే రక్తస్రావం. కాల్షియం లోపం వల్ల టెటాని అనే వ్యాధి లక్షణాలు కనిపించడం. 'ఆస్టియో మలేషియా' చిన్న పిల్లలో కలిగే 'రికెట్స్‌' అనే వ్యాధి. నోటి పూత. ప్రోటిన్‌ లోపంవల్ల కలిగే శరీరపు వాపు.

నిర్ధారణ :
బేరియమ్‌ మీల్‌తో ఎక్సరే. మలపరీక్ష. రక్తపరీక్ష. ఆహారం పేగుల్లో పీల్చబడే పరీక్ష. చిన్న పేగుల బయాప్సీ. క్లోమ గ్రంథిపరీక్షలు. కొలనోస్కోపి. పేగులోని ద్రావకాన్ని కల్చర్‌ పరీక్ష చేయడం. మల పరీక్షలో, ఏలికపాములు కనుక్కోవడం.

చికిత్స:
కాల్షియం, మెగ్నీషియమ్‌ విటమిన్‌-ఎ, విటమిన్‌-డి, విటమిన్‌- కె, రక్తహీనతకు ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి2, బికాంప్లెక్స్‌ ఇవ్వాలి. ప్రోటీన్లు ఎక్కువ వుండే ఆహారం ఇస్తూ వుండాలి. గ్లూటెన్‌ కలిగిన పదార్థాలు (బార్లీ, ఓట్‌, గోధుమ) ఇవ్వకూడదు. పాల ఉత్పత్తులు మానాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. మెట్రోనిడోయోజల్‌ 400 మిల్లీగ్రాములు రోజూ రెండు సార్లు ఒక వారం వాడాలి. టెట్రాసైక్లిన్‌ 250 మిల్లీగ్రాములు రోజూ 4 పూటలు మూడు వారాలు వాడాలి. విరేచనాలు తగ్గించడానికి లోపరమైడ్‌ మాత్రలు వాడాలి. పాంక్రియాటిక్‌ ఎంజైమ్‌ బిళ్ళలు వాడాలి. అవసరాన్ని బట్టి ప్రెడ్సిసలోన్‌ మాత్రలు వాడాలి.

Post a Comment

0 Comments