తుంటి నుండి వెనుకవైపు , కాలులో ను , పిక్కలలోను విపరీతమైన నొప్పి , తిమ్మిరిగా ఉండడము , రెండు కాళ్ళు కండరాలు బ్లహీన పడడము , సూదులు పొడిచినట్లుండడము , అశాంతి , చిరాకుగా ఉండడము సయాటికా నొప్పిని సూచిస్తాయి .
అసలు సయాటికా అంటే ఏమిటి ? ->
మన శరీరంలోని అన్ని నరాల్లోనూ పొడవైన నరం సయాటిక్ నరం. ఇది నడుములోని వెన్నుపామునుంచి ప్రారంభమై పిరుదులనుంచి పిక్కలకూ, అక్కడనుంచి దిగువకూ ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. కాలులో ఉండే అనేక కండరాలను, ఇతర నిర్మాణాలను ఇది నియంత్రిస్తుంది. తొడలు, పిక్కలు, పాదాల్లో స్పర్శను గ్రహించడానికి తోడ్పడుతుంది.
సయాటిక్ నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అనే పేరుతో వ్యవహరిస్తారు. నిజానికి సయాటికా అనేది ఒక లక్షణం. వెన్నుపూసల మధ్యనుండే డిస్కు జారటం వంటి వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరాల వ్యాధి స్థితి. . సయాటికా నొప్పి వచ్చినప్పుడు కుంగిపోకుండా తగిన చికిత్సలు తీసుకుంటూ, సరైన జాగ్రత్తలు పాటిస్తే 4 నుంచి 8 వారాల్లోనే తగ్గిపోతుంది.
ప్రధాన లక్షణాలు
సయాటికా వ్యాధి స్థితిలో కొన్ని ప్రధానమైన లక్షణాలుంటాయి. ఇవి అన్ని సందర్భాల్లోనూ, అందరిలోనూ ఒకేసారి కనిపించకపోవచ్చు. లేదా కలిసికట్టుగా కనిపించవచ్చు.
నొప్పి
నములుతున్నట్లు ఉండే నొప్పి ముందుగా నడుములో ప్రారంభమై పిరుదులలోకి, అక్కడనుంచీ తొడల్లోకి, అక్కడనుంచి పిక్కల్లోకి ప్రసరించడం సయాటికా నొప్పిలో ప్రధాన లక్షణం. సయాటిక్ నరం ప్రయాణించే మార్గం మొత్తం నొప్పిగా అనిపించవచ్చు. ముఖ్యంగా తొడ వెనుకభాగంలోనూ, పిక్కల్లోనూ నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. నొప్పి లక్షణాలు వివిధ రకాల స్థాయిల్లో ఉంటాయి. నొప్పి అస్పష్టంగా ఉండవచ్చు లేదా తీక్షణాతి తీక్షణంగా, పదునుగా ఉండవచ్చు. కేవలం అసౌకర్యంగా మాత్రమే ఉండవచ్చు. లేదా షాక్ కొట్టినట్లు ఝల్లుమనవచ్చు. దగ్గినప్పుడు గాని, తుమ్మినప్పుడుగాని, ఎక్కువసేపు కూర్చున్నపుడుగాని సమస్య తీవ్రతరమవ్వవచ్చు. రెండు కాళ్ళలోనూ ఒకే స్థాయిలో కాకుండా సాధారణంగా ఏదో ఒక కాలులో లక్షణాలు ఎక్కువ తీవ్రతతో కనిపిస్తాయి.
తిమ్మిర్లు, కండరాల్లో బలహీనత
సయాటిక్ నరం ఒత్తుకుపోవడంవల్ల కాలులో తిమ్మిరిగా అనిపిస్తుంది. ముఖ్యంగా నరం ప్రయాణించే మార్గంలో- అంటే కాలులోనూ, పాదంలోనూ మొద్దుబారినట్లు అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక కాలులో నొప్పిగా అనిపిస్తే మరో కాలులో తిమ్మిర్లుగా అనిపిస్తుంది.
సూదులు గుచ్చుకుంటున్నట్లు చిటపటలాడటం
ఇది సయాటికా వ్యాధి స్థితిలో మరో ప్రధానమైన లక్షణం. సాధారణంగా ఈ లక్షణం కాలు మొత్తంలో కాకుండా పాదంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
మలమూత్రాలమీద నియంత్రణ కోల్పోవటం
ఇది చాలా అరుదుగా కనిపించే లక్షణం. అయితే చాలా ప్రమాదకరమైన స్థితిని సూచిస్తుంది. మలమూత్రాలమీద నియంత్రణ తప్పడాన్ని వైద్యశాస్త్ర పరిభాషలో ‘కాడా ఈక్వినా సిండ్రోమ్’ అంటారు. దీనికి సత్వరమే వైద్య సహాయం పొందాలి.
కారణాలు
హెర్నియేటెడ్ డిస్కు : హెర్నియేషన్ అంటే వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు వెలుపలకు చొచ్చుకువచ్చి వెన్నుపామును నొక్కటం. సయాటికా నొప్పికి అతి ప్రధానమైన కారణమిది. దీనివల్ల సయాటిక్ నరం ప్రారంభపు భాగంలో ఒత్తుకుపోయి నొప్పి వస్తుంది. దీనిని అర్థం చేసుకోవాలంటే వెన్ను గురించి కొంత అవగాహన ఉండాలి. నడుము భాగంలోని వెన్నుపూసలను లంబార్ వర్టిబ్రే అంటారు. వీటి మధ్య మృదులాస్తితో తయారైన డిస్కులు ఉంటాయి. ఇవి వెన్నుపూసలను తేలికగా ఒకదానిమీద మరోటి కదలడానికీ, వంగడానికీ, ఆడటానికీ సహాయపడతాయి. అలాగే కదలికల సమయంలో జనించే ఒత్తిళ్ళను గ్రహిస్తూ ‘షాక్ అబ్జార్బర్స్’గా పనిచేస్తాయి. వయసు పెరిగేకొద్దీ ఈ డిస్కులు దెబ్బతినడం మొదలెడతాయి. ఉదాహరణకు, శుష్కించిపోవచ్చు లేదా మందం తగ్గిపోవచ్చు లేదా స్నిగ్ధత్వం కోల్పోయి పెళుసుగా తయారుకావచ్చు. సమయం గడిచే కొద్దీ డిస్కు వెలుపల భాగాన్ని ఆవరించి ఉండే తంతుయుతమైన యాన్కులస్ అనే నిర్మాణంలో పగుళ్లు తయారవుతాయి.
ఫలితంగా ఈ పగుళ్లనుంచి డిస్కు మధ్యభాగంలో ఉండే జిగురు వంటి పదార్థం వెలుపలకు చొచ్చుకు వస్తుంది. ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో హెర్నియేషన్ అంటారు. దీనివల్ల సయాటిక్ నరం ప్రారంభ భాగంలో (మూలంలో) నొక్కుకుపోయి నడుములోగాని లేదా కాలులోగాని లేదా రెంటిలోగాని నొప్పి మొదలవుతుంది. ఒకవేళ నడుము చివరి భాగంలోని వెన్నుపూసల మధ్యన ఉండే డిస్కులు దెబ్బతింటే నొప్పితోపాటు తిమ్మిరి, సూదులు గుచ్చినట్లు ఉండటం, కండరాల బలహీనత వంటివి సైతం అనుభవమవుతాయి.
లంబార్ స్పైనల్ స్టీనోసిస్ : వెన్నుపూసల మధ్య ఉండే స్పైనల్ కెనాల్ అనే ఛానెల్‌లో వెన్నుపాము ప్రయాణిస్తుంది. వెన్నుపాము అనేది అనేక నరాల తంతువుల సముదాయం. నరాలు కట్టకట్టినట్లు ఒక పెద్ద తాడు మాదిరిగా అమరి వెన్నుపాముగా రూపుదాల్చుతాయి. దీని నుండి నరాల శాఖలు వెన్నుపూసల ద్వారా వెలుపలకు వస్తాయి. ఇవి శరీరానికి, మెదడుకూ మధ్య సమాచార వ్యవస్థను కొనసాగిస్తుంటాయి. ఒకవేళ ఏదైనా కారణం చేత వెన్నుపాము ప్రయాణించే కెనాల్ ఇరుకుగా మారితే కెనాల్ స్టీనోసిస్ అంటారు. ఇలా జరగటంవల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాల అధీనంలో ఉండే కండరాల్లో నొప్పి అనుభవమవుతుంది. వెన్ను చివరి భాగంలో ఒత్తిడిపడితే నడుము భాగానికి, కటి భాగానికి ప్రయాణించే నరాలు దెబ్బతింటాయి.
స్పాండిలో - లిస్థిసిస్ : వెన్నుపూసల మధ్యన ఉండే డిస్కులు శుష్కించిపోవటంవల్ల వెన్నుపూసలు ఒకదానిమీద మరోటి సరిగా అమరకుండా ముందుకు జరుగుతాయి. దీనితో, వాటిమధ్యనుంచి వెలుపలకు వచ్చే సయాటిక్ నరం మీద ఒత్తిడి పడుతుంది.
పైరీఫార్మిస్ సండ్రోమ్
పైరీఫార్మిస్ అనే కండరం సయాటిక్ నరంపైన అమరి ఉంటుంది. నడుము భాగంలోని వెన్ను వద్దనుంచి ప్రారంభమై తొడ ఎముక (ఫీమర్) వద్దకు వచ్చి అంతమవుతుంది. ఒకవేళ ఈ కండరంలో ఒత్తిడి పెరిగితే కండరం బిగుసుకుపోవటంతోపాటు సయాటిక్ నరం మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. నొప్పి నడుమునుంచి మొదలై తొడవరకూ విస్తరిస్తుంది. అయితే మోకాళ్ళకంటే క్రిందకు ప్రసరించదు. ఎక్కువ సమయంపాటు కూర్చోవటం, మోటారు వాహనాల యాక్సిడెంట్లు, నడుస్తున్నప్పుడు జారి కింద పడటం వంటివాటివల్ల పైరీ ఫార్మిస్ సిండ్రోమ్ ప్రాప్తిస్తుంది.
స్పైనల్ ట్యూమర్స్ : వెన్నుపాములోని అంతర్గత భాగంలోగాని, వెన్నుపామును కప్పి ఉంచే పొరల్లో (మెనింజెస్)గాని, వెన్నుపాముకు, వెన్నుపూసలకూ మధ్యన ఉండే ప్రదేశంలోగాని పెరుగుదలలు తయారైనప్పుడు వెన్నుపాము నొక్కుకుపోయి సైయాటికా వస్తుంది.
చికిత్స : Treatment
రెస్ట్ (విశ్రాంతి ) తీసుకోవాలి . మంచి పోషకాహారము తినాలి .
నొప్పి నివారణ కోసము పైన్ కిల్లర్స్ వాడాలి , Aceclofenac 100 mg 3 times /day .Or Nimsulide 100 mg 3 times/day చొప్పున్న 3-4 వారాలు వాడాలి .
కండరాల బిగువు తగ్గడానికి మజిల్ రిలాక్షెంట్స్ ను వాడాలి . Chlormezanone . or Chloroxazone 500 mg 3 timme /day 3-4 వారాలు వాడాలి .
ట్రాక్షన్ & ఫిజియో తెరఫీ కొంతవరకు ఉపయోగపడును .
ఎముకల స్పెసలిస్ట్ లతో కలిసి న్యూరోసర్జన్ చే ఆపరేషన్ చేయించుకుంటే చాలా మటుకు బాధ నివారణ అగును .
When the cause of sciatica is due to a prolapsed or lumbar disc herniation 90% of disc prolapses will be resolved with no intervention. Treatment of the underlying cause of the compression is needed in cases of epidural abscess, epidural tumors, and cauda equina syndrome.
Cases of sciatica are treated with different measures. Evidence of the effectiveness of these measures is limited, however. Some of these measures are:
* Anti-inflammatory medications (e.g., NSAIDs or oral steroids. However, NSAIDs are no more effective than placebos for acute sciatica)
* Paracetamol (acetaminophen): limited evidence of effectiveness
* Narcotics: often used if pain is severe
* Physical therapy / Stretching exercises
* Epidural steroid injections provide no long-term improvements in outcomes but do provide some short-term benefits
* Non-surgical spinal decompression
* Massage therapy
* Ultrasound
* Weight loss reduces pressure on Spinal nerve roots
* Acupuncture
Surgery
Surgery speeds the resolution of pain. Two years after surgery, however, surgical and non-surgical management have about the same results; so a patient's preference can be a valid reason to choose one or the other.
Prevention
Exercise like walking or swimming strengthen the muscles that support the back without putting any strain on it or subjecting it to a sudden jolt, and can prevent and reduce the symptoms of sciatica. Yoga or pilates can help improve the flexibility and the strength of the back muscles.
Bad posture can aggravate sciatica. Taking measures to improve it can alleviate pain and swelling:
Standing
Stand upright with a straight back and front-facing head. Weight should be balanced evenly on both feet and legs kept straight.
Sitting
Sit upright with a support, such as a cushion or rolled-up towel in the small of the back. Knees and hips should be level and feet should be flat on the floor, with the aid of a footstool if necessary.
Driving
As with sitting, the back should be properly supported. Correctly position wing mirrors to prevent having to twist the back. Foot controls should be squarely in front of the feet. If driving long distances, regular breaks should be taken to stretch legs.
Sleeping
Sleep on a medium-firm mattress (not too firm). The mattress should be firm enough to support the body while supporting the weight of the shoulders and buttocks, keeping the spine straight. Support the head with a pillow, but make sure the neck is not forced up at a steep angle.
Lifting and handling
To prevent injury-caused sciatica, the correct method for lifting and handling objects should be followed
1 Comments
Nice articles and your information valuable and good articles thank for the sharing information knee pillow for sciatica pain
ReplyDelete