శృంగారం-మేధస్సుకు పదును- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మెదడును చురుకుగా ఉంచుకోవటానికి ఏం చేయాలి? పదకేళీలు, సుడోకు పూరించటం, చదరంగం ఆడటం.. ఇలా మెదడుకు పనిపెట్టే రకరకాల పద్ధతులు మనసులో మెదులుతాయి. కానీ శృంగారం కూడా మేధోశక్తి పెరగటానికి దోహదం చేస్తుందని మీకు తెలుసా? టెర్రీ హార్న్ అనే సైకాలజిస్టు, సైమన్ వూటన్ అనే బయోకెమిస్ట్ గతంలో రాసిన 'ట్రెయిన్ యువర్ బ్రెయిన్' పుస్తకంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రాసిన ఇందులో.. సంభోగం, చాక్లెట్, చేపలు, మాంసం మెదడును చురుగ్గా ఉంచుతాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఓ రసాయనిక స్థితిని సృష్టించి మెదడుకు నవోత్సాహాన్ని కలిగిస్తాయి. 2003లో ప్రచురితమైన మరో అధ్యయనంలోనూ శృంగారం మేధోశక్తికి తోడ్పడుతున్న సంగతి బయటపడింది. సంభోగంతో సంబంధం గల ఒక హార్మోన్.. మెదడు కణాలు వృద్ధిచెందటానికి దోహదం చేస్తున్నట్టు వెల్లడైంది. కాబట్టి మెదడుకు పదును పెట్టటానికి పదకేళీ, సుడోకు వంటి వాటితో పాటు కాస్త శృంగారం పైనా దృష్టి పెట్టటం అవసరమని వీటి ద్వారా తెలుస్తోంది కదూ.
0 Comments