Full Style

>

Skipping as Exercise, స్కిప్పింగ్ మంచి వ్యాయామము


స్కిప్పింగ్ వ్యాయామము- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వ్యాయామం (Exercise) మంచి ఆరోగ్య పరిరక్షణ కోసం చాలా అవసరం. ఇది ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను ధృఢపరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి ఉపయోగిస్తారు. దైనందిక వ్యాయామం వలన మన శరీరపు వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెందుతుంది, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కొన్ని రకాల మానసిక వ్యాధుల నివారణ కు తోడ్పడుతుంది.

స్కూల్ లో పిల్లలకి తప్పకుండా నేర్పించే ఆట స్కిప్పింగ్. ఇది చాలా సింపుల్ గా కనిపించే ఆట. నిజానికి అది ఒక ఆట కాదు... వెలకట్టలేని వ్యాయామము. ఒక గంటసేపు స్కిప్పింగ్ చేస్తే 1000 క్యాలరీల శక్తి కరిగించబడుతుంది . దీనికి కావల్సింది స్కిప్పింగ్ తాడు మాత్రమే . ఏ సమయములోనైనా ఎక్కడైనా ఎంతో సులభము గా చేయవచ్చును . దీనివల్ల కాళ్ళు, చేతులు , పాదాలన్నిటికీ వ్యాయామము లభిస్తుంది.

ఆరోగ్యరీత్యా అందరూ అనేక రకాల వ్యాయామాలు, వాకింగ్‌, జాగింగ్‌ చేస్తుంటారు. అలాగే అందం, ఆరోగ్యం కలకాలం నిలవాలంటే చేయగలిగినవాళ్ళు స్కిప్పింగ్‌ చేస్తే చాలా సుగుణాలు కనిపిస్తాయి. ఇది చేస్తున్నప్పుడు శరీరాన్ని నిటారుగా వుంచాలి. రిలాక్సింగ్‌గానూ వుండాలి. చూపులు నిటారుగా ముందుకే వుండాలి. కాళ్ళవైపు చూడకూడదు. స్కిప్పింగ్‌ చేసే సమయంలో శరీర బరువునంతా పాదాల ముందుభాగంలోనే నిలపాలి. మడమల మీద పడకూడదు. స్కిప్పింగ్‌ను గట్టిగా వుండే నేలమీద కాకుండా మెత్తటి తివాచీ మీద చేయాలి. లేదా చాపమీదకానీ, ఇంటి బయట పచ్చికలోకానీ చేస్తే వీలుగా వుంటుంది. స్కిప్పింగ్‌ చేయడం మొదలుపెట్టిన కొత్తలో కొంత అలసటగా వుంటుంది. అయినా క్రమం తప్పకుండా రోజూ కొంతసమయం చేస్తే క్రమక్రమంగా ఎక్కువ సమయం చేయగలుగుతారు. స్కిప్పింగ్‌ చేయడానికి ప్రత్యేకమైన దుస్తులు అవసరంలేదు కానీ బాగా వదులుగా వుండాలి. దీనిని సాధారణంగా ఉదయాన్నే చేస్తే మంచిది. భోజనం ముందుకానీ, భోజనం అయిన రెండు గంటల తర్వాతకానీ స్కిప్పింగ్‌ చేయవచ్చు. మహిళలు తమ శరీరాకృతిని అందంగా మలచుకోవడంతోపాటు బరువును కూడా నియంత్రించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని సులభమైన పద్దతితో శరీరంలోని బరువును, కొవ్వును కరగదీయవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీనికి చేయాల్సిందల్లా ఒక్కటే... స్కిప్పింగ్ చేయడం.

మీరు ఎంచుకునే తాడు మీ ఎత్తుకు తగ్గట్టు ఉండాలి. స్కిప్పింగ్ ఎలా చేయాలంటే... మీ ఎత్తుకు తగ్గ తాడును రెండింతలుగా ఉండేలా చూసుకోవాలి. దానిని మీ పాదాలతో అదిమి పట్టి రెండు అంచులను మీ ఎత్తుకు సమానంగా ఇరువైపులా చూసుకుని మీ చేతులతో తిప్పాలి.

స్కిప్పింగ్ వలన రక్త సరఫరా మెరుగవుతుంది. కంటికి, పాదాలకు, చేతులకు సమన్వయం పెరిగి మనుషులు సురుకుగా స్పందించ గలుగురారు . క్రమము తప్పకుండా స్కిప్పింగ్ చేస్తే శరీరక బలం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. సుగరు, బి.పి వ్యాదులు అదుపులోకి వస్తాయి . స్కిప్పింగ్ ప్రారంభించినపుడు తక్కువ సమ్యము తో ఆరంభించి ... క్రమముగా సమ్యాన్ని పెంచుకోవాలి.

స్కిప్పింగ్‌ వల్ల లాభాలు:

స్కిప్పింగ్‌ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుంది.
శరీరంలో వుండే అధిక కొవ్వును తొలగించుకోవచ్చు.
దీనిని చేయడం వల్ల మనస్సు, శరీరం చురుకుదనాన్ని పొందుతాయి.
రోజూ స్కిప్పింగ్‌ చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.
ఊబకాయాన్ని నియంత్రించేందుకు స్కిప్పింగ్ చేయాలి .
పొట్టపై పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించవచ్చు. ఇక్కడ డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించేయవచ్చును .
స్కిప్పింగ్‌ చేసిన తరువాత త్వరత్వరగా శ్వాస తీసుకోవాల్సివుంటుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళు తొడల వద్దనున్న కండరాలు బలిష్టంగా తయారవుతుంది.
స్కిప్పింగ్‌ చేయడంతో ఉదరభాగం లోపలికి-బయటకు వెళుతుంది. దీంతో ఉదరభాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది.
స్కిప్పింగ్‌ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి.
చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. రచయితలకు, కళాకారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.
చిన్న వయసువారు స్కిపింగ్‌ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్‌ చేయడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది.

స్కిప్పింగ్‌ ఎవరెవరు చేయకూడదంటే:

అధిక రక్తపోటు వారు ఈ వ్యాయామం చేయకూడదు.
సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళలు ఏ మాత్రం చేయకూడదు. పూర్తిగా కొలుకున్నాము అనుకున్న తరువాత మాత్రమే స్కిపింగ్‌ చేయాలి. లేదా
మూడు నెలలు తరువాత వైద్యుల సలహా మేరకు స్కిప్పింగ్‌ చేయవచ్చు.
హెర్నియా రోగులు స్కిప్పింగ్‌ చేయకూడదు.
గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారు ఈ వ్యాయామం చేయకూడదు.

Post a Comment

0 Comments