నిద్ర అవస్థ , Sleep disorder- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సాధారణంగా ప్రతి మనిషికి 6-8 గంటల నిద్ర ఉంటే సరిపోతుంది. చిన్నపిల్లలు 8-10 గంటలు, రోజుల పిల్లలు 14-20 గంటలు నిద్రపోతారు. 50 ఏళ్ల తర్వాత నిద్ర క్రమేపీ తగ్గుతూపోతుంది. 60 ఏళ్లకు 4-6 గంటలు, 70 ఏళ్లకు 4-5 గంటలు, 80 ఏళ్లకు 3-4 గంటలు మాత్రమే నిద్ర సరిపోతుంది. మెదడులో నిద్రకు సంబంధించిన భాగాన్ని ‘పీనియల్‌గ్లాండ్’అంటారు. దీని నుంచి మెలటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది నిద్ర ఎంత స్థాయిలో అవసరం అవుతుందో తెలియజేస్తుంది.
పీడకల వచ్చిందంటే నిద్రపట్టింది అనడానికి సంకేతం. ఆ పీడకల వల్ల నిద్ర ఇచ్చే సాంత్వన దూరమవుతుంది. అది ఒక అవస్థ. ఒకవేళ నిద్ర పట్టకపోయినా అదీ అవస్థే. నిద్ర అందరికీ కావాలి. రోజంతా పనులతో అలసిపోయిన మనిషి రాత్రివేళ నిద్రలో విశ్రాంతి పొందుతాడు. అయితే కొందరు నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు అతినిద్ర కారణంగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోతుంటారు. జీవితంలో సగభాగం నిద్రలో గడిపినా మనిషి దాన్ని వృథా అనుకోడు. నిజానికి ఆరోగ్యం కోసం అది అవసరం కూడా. మనిషికి నిద్ర ఎన్ని గంటలు కావాలి? ఏయే వయసులో ఎంత నిద్ర అవసరం? నిద్ర పట్టకపోవడానికి కారణాలేంటి? హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?
ప్రతియేటా ప్రపంచంలో 50 శాతానికి పైగా జనాభా రకరకాల నిద్రకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా మనిషి రోజూ 6-8 గంటలు హాయిగా నిద్రపోతే 50 శాతం వరకు జబ్బులు దరిచేరవు అనేది వైద్యులు చెబుతున్నమాట.
నిద్ర సమస్యలు
1.నిద్రలేమి (ఇన్‌సామ్నియా)
2.అతినిద్ర (హైపర్ సామ్నియా)
3.నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం. (పారాసామ్నియా) వీటిలో నిద్రలేమి సమస్య ఎక్కువమందికి వస్తుంది.
నిద్రలేమి
రాత్రిపూట కావలసినంత నిద్రలేకపోవడం. దీని వల్ల పగలు పనిలో మధ్య మధ్యలో నిద్రపోవడం. త్వరగా కొపం రావడం, ఏకాగ్రత లోపించడం. మతిమరపు, పనిలో సామర్థ్యం తగ్గిపోవడం... వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ ఎక్కువ రోజులు కొనసాగితే బి.పి., గుండెజబ్బులకు దారితీయవచ్చు. అలాగే మైగ్రెయిన్ తలనొప్పి, బ్రెయిన్‌స్ట్రోక్, కడుపులో హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్లు రావడం, యాంగ్జైటీ న్యూరోసిస్, డిప్రెషన్ లాంటి జబ్బులు వస్తాయి. వేళకు నిద్ర పోకపోవడం, వేళకు తినకపోవడం, నిద్రపోయేముందు పొగతాగడం, కాఫీ, టీలు ఎక్కువ తీసుకోవడం, శీతలపానీయాలు సేవించడం, తీవ్ర ఒత్తిడికి గురికావడం, కొన్నిరకాల మందులు
(ఆస్థమా, గుండెజబ్బులు, మూత్రపిండాలు, లివర్ జబ్బుల, స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు... వంటి వాటికి వాడే మెడిసిన్స్), విపరీతమైన నొప్పి (తలనొప్పి, మెడనొప్పి, పంటినొప్పి, కాళ్లు-చేతులు మంటలు, కడుపులో మంటలు...) వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.
విచిత్రంగా ప్రవర్తించడం
కొంతమందికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది ఇది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో జరుగుతుంది. వీరు కొన్నిసార్లు తలుపు తీసుకుని బయటకు వెళ్లడమే కాకుండా, అనుకోని ప్రమాదాల బారిన పడుతుంటారు. మెలకువ వచ్చాక తామిలా చేశామన్న విషయమే వీరికి గుర్తుండదు. ఇంకొంతమంది నిద్రలో లేచి భయంకరంగా ప్రవర్తిస్తారు. పెద్ద పెద్దగా అరవడం, వస్తువులను పగలగొట్టడం చేస్తుంటారు. కలలో మమేకం అయిపోయి ఇలా ప్రవర్తిస్తారు. ఇది కూడా నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంది. రాత్రి నిద్రలో ఇలా ప్రవర్తించినట్టు పొద్దునే వీరికి గుర్తుకు రాదు. ఈ సమస్యను స్లీప్‌టెరర్ ్రఅంటారు. ఇది 5-15 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు నిద్రలో మాట్లాడుతుంటారు. దీనిని స్లీప్ టాకింగ్ అంటారు. దీంతో పాటు కొంతమంది పిల్లలకు రాత్రిపూట పక్కతడిపే అలవాటు కూడా ఉంటుంది. 5-7 సంవత్సరాల పిల్లల్లో ఇది సాధారణమే. పదేళ్లకు పైబడిన పిల్లల్లో ఈ సమస్య ఉంటే దీనిని నాక్టర్నల్ ఎన్యురోసిస్ అంటారు. భయంకరమైన కలలు రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ మంచి చికిత్స ఉంది. కౌన్సెలింగ్, మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు.
నిద్ర పరీక్షలు
నిద్ర సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించడానికి ఆధునిక పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రో ఎన్‌సెఫలో గ్రామ్ (ఈఈజీ)అనే టెస్ట్ ద్వారా స్లీప్ డిజార్డర్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో కనిపెట్టి, దానికి తగిన చికిత్స చేయవచ్చు. నిద్రకు సంబంధించిన ఏ సమస్య అయినా అది మన జీవనశైలి సక్రమంగా లేకపోవడం, అనారోగ్య పరిస్థితులే కారణం అవుతుంటాయి. వీటిని సరిచూసుకుంటే రోజులో శరీరానికి ఎంత నిద్ర అవసరమో, అంతవరకు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకుంటుంది .
అతినిద్ర
హైపర్‌సామ్నియా అని పిలిచే అతినిద్ర సమస్య ఉన్నవారు రోజుకు 10 గంటలకంటే ఎక్కువ నిద్రపోతారు. ఇది హైపోథైరాయిడ్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు ఉండేవారి లో ఎక్కువ. నార్కోలెప్సీ సమస్య ఉన్నవారు పగలుకూడా నిద్రపోతుంటారు. దీనిని ఇర్రెస్టిబుల్ స్లీప్ డిసార్డర్ అని కూడా అంటారు. క్లీన్ లెవిన్ సిండ్రోమ్ ఉన్నవారు నెలల తరబడి నిద్రపోతుంటారు. రామాయణంలో కుంభకర్ణునికి ఈ జబ్బు ఉందనుకోవచ్చు.
గురక
పక్కవారికి నిద్రపట్టకుండా చేసే గురక స్లీప్ ఆప్నియా లో ఉంటుంది. సెంట్రల్ స్లీప్ ఆప్రియా, అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని ఇది రెండు రకాలు. నిద్రలో గురక పెట్టేవారు సాధారణంగా స్థూలకాయులై ఉంటారు. ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంటుంది. గాలి పీల్చుకునే శ్వాసకోశంలో బ్లాక్స్ ఉంటే గురక వస్తుంది. అప్నియా అంటే గాలి పీల్చుకోవడం కొద్దిగా కొద్దిగా ఆగిపోతూ ఉండటం. గురకతో పాటు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉంటే తప్పనిసరిగా వె ద్యులను సంప్రదించాలి. పగటిపూట నిద్రపోతూనే చాలామంది గురకతీస్తుంటారు. వీరికి రాత్రిపూట నిద్ర కరువే. కష్టపడి పనిచేయటం ద్వారా వీరికి గురక వస్తుందని కాదు. దీనికి స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా వ్యాధికి ముఖ్య లక్షణం ఈ గురక తీయడమే . ఈ గురక మూడు సమయాలలో రావచ్చును . పడుకోగానే గురక మొదలయ్యే గురక, మధ్యరాత్రి మొదలయ్యేగురక. తెల్లవారు జామున మూడు గంటలప్రాంతంలో మొదలయ్యే గురక.
ఈ స్లీప్ అప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఆక్సిజన్ అవసరం కోసం కాస్త వ్యాయామ రీతిలో పనిచేయడం,
ఆల్కహాల్‌ను సేవించడం నిలిపివేయడం,
అతిగా భోజనం చేయకూడదు ,
క్రొవ్వు పదార్థాలను తక్కువుగా తీసుకోవడం,
స్లీప్ అప్నియా అంటే...
స్లీప్ అప్నియా అనేది ఒక నిద్రా అవ్యవస్థ లేదా క్రమరాహిత్యం. ఇది నిద్రిస్తున్నప్పుడు శ్వాసలో అంతరాయాల ద్వారా ఏర్పడుతుంది. లేమి నుండి, శ్వాస పీల్చడం వరకూ అప్నియా అని పిలువబడే ప్రతి ఘటన కూడా, చాలా కాలం కొనసాగుతుంది కాబట్టి ఒకటి లేదా రెండు శ్వాసలు తప్పిపోతాయి, అలాంటి ఘటనలు నిద్రాసమయం పొడవునా పదే పదే సంభవిస్తుంటాయి. ఏదైనా స్లీప్ అప్నియా ఘటనకు సంబంధించిన ప్రామాణిక నిర్వచనం శ్వాసల మధ్య కనీసం 10-సెకనుల విరామంతో కూడుకుని ఉంటుంది. నాడీశాస్త్రపరమైన మేల్కొలుపు , లేదా O2గా కొలవబడే EEG ఫ్రీక్వెన్సీలో 3 సెకనులు లేదా అంతకు మించిన మార్పు లేదా రక్తం ఆక్సిజన్ లో 3-4% లేదా అంతకు మించిన శాతం కోల్పోవడం లేదా పెంపు మరియు కోల్పోవడం అనే రెండు రూపాలలో ఇది ఉంటుంది. స్లీప్ అప్నియా అనేది పోలిసోమ్నోగ్రామ్, లేదా "నిద్రా అధ్యయనం అని పిలువబడే ఒక రాత్రిపూట నిద్రా పరీక్షతో వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది.
శరీరంలోని టాన్సిల్ సైనసైటిస్, రైనైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంది. నిద్రలో దేహక్రియలన్నీ తమ సహజవేగాన్ని కోల్పోయి శ్వాస ఆడటంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎప్పటికీ ప్రమాదం. జీవ ప్రక్రియల వేగం పడిపోవడంతో శ్వాస మందగించి కొన్ని క్షణాల పాటు నిలిచిపోవడం ఈ అప్నియా లక్షణం.
అయితే ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్యతో రాత్రి నిద్ర కరువై పగటిపూట కునికి పాట్లు తీస్తుంటారు. ఈ అప్నియాతో కోపం, గుండెజబ్బులు, అసహనం, శరీరంలో కొలస్ట్రాల్ వల్ల ప్రాణాపాయం ఉండును . అయితే రక్తనాళాల బలహీనత గుండెకు సంబంధించిన జబ్బులు మాత్రం ఉంటే ప్రాణాంతకంగా మారవచ్చు.
స్లీప్ సైకిల్...

7-8 గంటల నిద్రలో 4-5 స్లీప్ సైకిల్స్ ఉంటాయి. మళ్లీ ఇందులో ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్, రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ అని రెండు దశల నిద్రలు ఉంటాయి. ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో మళ్లీ నాలుగు దశలుంటాయి. ‘రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’లో కనుపాపలు వేగంగా కదులుతుంటాయి. దీంతో పాటు కాళ్లు, చేతులు కదలడం, గుండె వేగంగా కొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. దీనినే కలతనిద్ర అంటారు. ఇక ‘నాన్ రాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్’ను గాఢ నిద్ర అంటారు.
నిద్రలేమి-నివారణ
నిద్రకు ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు...
ఊపిరితిత్తులకు, గుండెకు సంబంధించిన జబ్బులకు మందులు వాడుతుంటే డాక్టర్ సలహామేరకు పగటిపూట వాడేటట్లు చూసుకోవాలి.
పడకగదిని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గది వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా ఉండకూడదు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. గది గోడలు, కర్టెన్లు, బెడ్‌షీట్లు... తేలికపాటి రంగుల్లో ఉండాలి.
ఆల్కహాల్ తీసుకోకూడదు.
రోజూ ఒకే సమయంలో నిద్రపోవాలి.
పగటిపూట నిద్రపోకూడదు.
సాయంకాలం 30 ని.లు వ్యాయామం చేయాలి.
నిద్రించే ముందు రోజూ గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
నిద్రకుపక్రమించడానికి 2-3 గంటల లోపల టీ, కాఫీ, పొగ... తాగకూడదు.
నిద్రపోయేముందు నవలలు, పుస్తకాలు చదవకూడదు. (ఆసక్తికరమైన అంశాలు ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు)
నిద్రకు ముందు భయానక దృశ్యాలను (టీవీ, సినిమా..) చూడకూడదు. (ముఖ్యంగా పిల్లలు వీటిని చూడటం ద్వారా రాత్రి కలల్లో వచ్చే దృశ్యాలకు విపరీతంగాప్రవర్తిస్తుంటారు.)
నిద్రపోవడానికి ముందు గోరువెచ్చటి పాలు తాగాలి.
నిద్రపోయేటప్పుడు ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినాలి.

0 Comments