Full Style

>

పిల్లలు పళ్ళుకొరుకుట , Teeth biting habit in children(Bruxism)



పిల్లలు పళ్ళుకొరుకుట- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

కోపము తో కాక నిద్రలో మనము అప్పుడప్పుదు పళ్ళు కొరుకుతుంటాం . రాత్రుళ్ళు పిల్లలు మరీ కొరుకు తుంటారు తెలియకుండానే . అది వ్యాధి ... మరి రాత్రులు ఇలా పళ్ళు కొరుకోవడం నిజంగా భయపడవలసినదా! ... అవును . దీన్ని బ్రూక్సిజమ్‌ (Bruxism) అంటారు . తమ పళ్ళు తామే అస్తమానము కొరుక్కోవడం కొంతమందిలో అలవాటు గా మారుతుంది . చాలా మంది తల్లిదండ్రులు పిల్లలలో ఇది చూసి పట్టించుకోరు . సాదారణం గా ఇది మానసిక ఒత్తిడివల్ల తెలియకుండానే వస్తుంది . కాని పిల్లల్లో మానసిక ఒత్తిడి పసివయస్సులో ఉండదు కాని చదువు బరువవుతున్న వయసులో ఉండవచ్చు .. అలవాటుగా మారవచ్చు . కొంతమంది పిల్లలలో పళ్లు సరిగ తయారవనపుడు వచ్చే ఇబ్బంది భావనవల్ల పళ్ళు కొరుకుతుంటారు . దంతవైద్యులు దీన్ని పళ్ళలో వచ్చే మార్పుగా భావిస్తారు . పళ్ళలో ఏర్పడే హెచ్చుతగ్గులవల్ల పిల్లలో వచ్చే రాపిడికి తెలియకుండ నిద్రలోను , మామూలుగాను పళ్లు కొరుకుతూ ఉంటారు . ఇది అలవాటుగా మారకూడదు .

ఈ మధ్య లక్నోలో జరిగిన ఒక పరిశోధన లో పిల్లలఓ పరీక్షలు , స్కూలులో మిగిలిన వర్కు , సెమినార్లు వంటి వాటివల్ల వచ్చే మానసిక ఒత్తిడి వల్ల ఈ పళ్ళు కొరకడం ఒక లవాటుగా వస్తుందని సూచిందినది . మిగతావాళ్ళతో తమను పోల్చిచూసుకోవడం తో వచ్చే స్పర్ధవల్ల వచ్చే ఒత్తిడి ఈ పళ్ళ కొరకడం అలవాటుకి కారణం అవుతోందని .. ఇది ఆడపిల్లలలోనూ వస్తుందని గుర్తించారు . చాలా మందిలో ఉండే ఈ మానసిక ఒత్తిడి , ఆరాటం (anxiety, stress) తమకి తెలియకుండా చేసే ఈ పళ్ళు కొరుక్కోవడం గా బహిర్గతమఫుతాయని వాళ్ళ భావన . ఇది పెద్ద వ్యాధి కాకపోవచ్చుకాని భవిష్యత్తులో అలవాటుగా మారకూడదు . మామూలుగా కాదు కాని పళ్ళు పూర్తిగా నిర్మించబడ్డాక , జ్ఞానదంతం ఏర్పడ్డాక కూడా ఈ పళ్లు వాళ్ళకి తెలియకుండా కొరుక్కుంటుంటే అది మంచి అలవాటు కాదు . పెద్దలు జాగ్రత్తపడాలి .

పిల్లలు రాత్రుళ్ళు పక్కవాళ్ళతో పడుకున్నప్పుడు పళ్ళు కొరు్కుతుంటే వాళ్ళు గమనించి చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి . పళ్ళలో హెచ్చు తగ్గులు ఉంటే దంతవైద్యుని సంప్రదించి సరిచేయించుకోవాలి . సాదారణము గా దంతవైద్యులు పిల్లలు పళ్ళు కొరికే విషయం లో చేసేది చాలా తక్కువ . ఎందుకంటే ఇది సాధారణం గా ఇతర కారణాల వల్ల వస్తుంది కాబట్టి . ఒక్కొక్కసారి ఈ " బ్రూక్సిజమ్‌ " విపరీతమై వారి పెద్దలకు , ఇతరులకు ఆదుర్దా , ఇబ్బంది కలుగజేస్తుంది . ముఖ్యము గా ఈ పళ్ళు కొరకడం తోపాటు ముఖం ఉబ్బటం , తలనొప్పి , దవడలు నొప్పిగా ఉండడం వంటివి వస్తే అప్పుడు తొందరపడాలి .

ముఖ్య కారణాలు :
పాలపళ్ళు పెద్దవి గా ఉండడం ,
పై వరుస పళ్ళు హెచ్చు తగ్గులు గా ఉండడం ,
మానసిక ఒత్తిడి ఇతరులకి చెప్పుకోలేక తమలో తామే బాధపడుతూ ఉండడం ,
ప్రతిదానికీ ఆదుర్ధాపడడం ,
చాలా దూకుడుగా ఉండే ప్రవృత్తి ఉండడం ,
పళ్ళు కొరకడం అనేది పిల్లలలో అలవాటుగా మారిందనటానికి గుర్తులు :
నిద్రలోనే కాకుండా మాములుగా కూడా అప్పుడప్పుడు పళ్లు కొరుక్కోవడాం
అస్తమానము గోళ్ళు కొరుక్కోవడం ,
బొటనవ్రేలు నోటిలో పెట్టుకొని చప్పరించడం ,
దవడ జారిందని , నొప్పిగా ఉందని అనడం ,
బుగ్గ ఉబ్బి ఉండడం ,
చికిత్స సూచనలు :

పిల్లలు పళ్ళు కొరుక్కోవడం అలవాటు కి చదువో , పని ఒత్తిడో అని అనిపిస్తే రాత్రి పడికునే ముందు ఒక కప్పు వేడి పాలు పటిక బెల్లం కలిపి ఇవ్వండి .
తనకిస్టమైన జానపద , పురాణకథల పుస్తకాలో , కార్టూన్‌ పుస్తకాలో చదువుతూ పడుకోమనండి .
పళ్ళకి పెట్టుకునే " నైట్ గార్డ్ " అనే ప్లాస్టిక్ క్లిప్పులు వచ్చాయి. వైద్యుల సహాయము తో వాడండి .
మానసికం గా పిల్లలను తయారు చేయాలి ,

Post a Comment

0 Comments