ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహా రం. అనేక రకాల ఆకుకూరలు మనకు లభ్యమవుతున్నాయి. తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరి వేపాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. ఉదా పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి మొదలైనవి. ఆకుకూరలు మంచి పౌష్టికకరమైన ఆహారం. వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ‘ఎ', ‘సి', రైబోఫ్లెవిన్, ఫోలిక్‌యాసిడ్ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది

0 Comments