మనిషి చాలా శక్తి సంపన్నుడు. ఈ ఆధునికయుగంలో సాంప్రదాయాలను మంటగలిపి ఆధునిక పోకడలకు పోయి తనను తాను రోగాలబారిన పడేలా చేస్తున్నాడు. మానవుడు పుట్టుకతోనే శక్తిసంపన్నుడు. అది దైవప్రసాదం. ఆ దైవిక శక్తిని గుర్తించిన పాశ్చాత్యులు మన భారత దేశ సాంప్రదాయాలను పాటించడానికి తహతహలాడుతుంటే మనం మాత్రం దేశ సాంప్రదాయాన్ని మనలోనున్న శక్తిని వృధాగా ధారబోస్తున్నాం.
ప్రతినిత్యం ధ్యానం చేస్తే మన ఆరోగ్యం
మన చేతిలోనేవుందని ఇలాంటి శక్తిని మనిషి వృధా చేస్తున్నాడని ఆధ్యాత్మిక
వేత్తలు అభిప్రాయపడ్డారు. మనిషి పుట్టుకతోనే శక్తి సంపన్నుడని ఆశక్తిని
తాను వినియోగించుకోకుండా వృధా చేస్తున్నాడని ఆధ్యాత్మిక గురువొకరు
తెలిపారు.
దీనికి మనిషి తన శరీరంలోని శక్తిని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి నిత్యం ధ్యానం చేయాలని ధ్యానం చేస్తే ఆరోగ్యమే కాకుండా సమాజం కూడా బాగుపడుతుందని ఆయన తెలిపారు. ధ్యానంతో అన్నీ సమకూరుతాయని ప్రముఖులు పేర్కొన్నారు. ఆరోగ్యం గురించి వివరిస్తూ ఆరోగ్యం మన చేతుల్లోనే వుందని చెబుతున్నారు.
దీనికి ఉదాహరణగా చెబుతూ.....ఏరియల్ ద్వారా రేడియోకు తరంగాలు ఎలా చేరుతాయో సరిగ్గా అదేవిధంగా విశ్వంలో ప్రయాణించే విద్యుత్ అయస్కాంత తరంగాల వల్ల మనిషికి ఆరోగ్యం సంప్రాప్తిస్తున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు మనిషి శరీరంలోని చేతి వేళ్లు త్వరితగతంగా గ్రహిస్తాయని వారు తెలిపారు.
అలాగే శరీరంలో అత్యధికంగా పేరుకు పోయివున్న విద్యుత్ అయస్కాంత శక్తిని వెలుపలికి పంపే గుణాన్ని కూడా ఈ వేళ్లు కలిగివున్నాయని వైద్యులు తెలిపారు. మనిషి శరీరంలోని చేతివేళ్లకు ఎంత ప్రాముఖ్యతవుందో అర చేతులకు అంతే ప్రాముఖ్యతను ఇచ్చారు మన సాంప్రదాయ వైద్యులు.
మనిషి చేతిలోని ఐదు వేళ్లు ఐదు గ్రహలని అవి రవి, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలకు సంకేతాలకు గుర్తుగా పేర్కొంటారు మన ప్రాచీన వైద్యులు. అలాగే అరచేయిని కుజుడు, చంద్రునికి సంకేతాలుగా చెబుతున్నారు పరిశోధకులు. ఈ కారణంగానే మన ఋషులు, మహాత్ములు వారివారి భక్తులకు శక్తిని ప్రసాదించిన సందర్భాలు కూడావున్నాయని వారు ఈ సందర్భంగా తెలిపారు.
కాబట్టి మీరు ప్రతి నిత్యం ధ్యానం చేయడానికి ప్రయత్నిచండి. ఈ ధ్యానానికి ఏమంత ఖర్చుకాదు. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని మనుసుని ప్రశాంతంగావుంచుకుని కాసేపు ధ్యానం చేస్తే మనలో కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దీంతో రోజంతా ఉల్లాసంగా పని చేస్తారు. అలాగే సాయంత్రం లేక రాత్రి పడుకోబోయేముందు కూడా ధ్యానం చేస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవు. నిత్యం ధ్యానం చేయండి ఆరోగ్యం మీ చేతుల్లోవుంచుకోండి.

0 Comments