Full Style

>

అమ్మలూ...అమ్మమ్మలూ మీ ఆరోగ్యం...



మహిళలు మహరాణులు అన్నమాట వాస్తవమే. కాని తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవడంలో మాత్రం వెనుకంజవేస్తారనడంలో సందేహంలేదు. కోడి కొక్కొరకో అన్నప్పటినుంచి రాత్రి పడుకునేవరకు విరామం లేకుండా ఇంటిపని, వంటపని, బంధువులు, స్నేహితులరాకలు వారికి ఆతిథ్యం ఇవ్వడం వరకు అన్నీ తామై చూస్తుంటారు. కాని మీకుగా మీరు ఆరోగ్యం గురించి ఆలోచించే క్షణాలు మీ చేతుల్లోనేవుందంటున్నారు వైద్యనిపుణులు.

పెళ

్ళికి ముందు తమ అందం, ఆరోగ్యం గురించి ఆందోళనపడే అతివలు ఆ తరువాత వాటిగురించి పెద్దగా పట్టించుకోరు. ఒకరిద్దరు పిల్లలు పుట్టి వారి బాధ్యతలు తమ భుజస్కంధాలపై వేసుకున్నతరువాత అందం, ఆరోగ్యం గురించి పట్టించుకోరు.

మీకు ఎన్నిబరువు బాధ్యతలున్నా, ఎంతపనివున్నాకూడా మీ ఆరోగ్యం గురించి కాస్త పట్టించుకోవాలని వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ చిట్కాలు పాటిస్తే చక్కని శరీరాకృతితోపాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చని వారు తెలిపారు.

**ప్రతి రోజు నిద్రలేవగానే ప్రతి ఒక్కరికి వ్యాయామం చేసే తీరిక కుదరకపోవచ్చు, కాని ఇంట్లోనున్న మెట్లను కనీసం పదిసార్లైనా ఎక్కి దిగడం చేయాలి.

**క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ఆరోగ్యంగా వుండడానికి మార్గం సుగమమౌతుంది. ధ్యానంవల్ల పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

**వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి వ్యాయామం చేస్తే మీ శరీరంలోని క్యాలరీలు అధికంగా ఖర్చవుతాయో ఆ వ్యాయామాన్నే ఎంచుకుని వాటినే చేయండి. దీంతో శరీర బరువును, అధిక క్యాలరీలను కూడా తగ్గించుకోవచ్చు.
**వ్యాయామం చేసేటప్పుడు పాటలు వింటూ చేసినట్టయితే శరీరానికి అలసట అనిపించదు.

**ఇంట్లోవున్న మహిళలు ముఖ్యంగా టీ, కాఫీలను అధికంగా తీసుకుంటుంటారు. వీటిని తీసుకునే అలవాటును పూర్తిగా మానుకోవడానికి ప్రయత్నించండి. వీటికి బదులుగా నీటిని అధిక శాతంలో తీసుకుంటే మంచిది.

నీటిలో ఏ మాత్రం క్యాలరీలు వుండవు కాబట్టి నీటిని అధిక శాతంలోతీసుకోవడానికి ప్రయత్నించండి. దీంతో శరీర ప్రక్రియను క్రమబద్దం చేయడానికి నీరు దోహద పడుతుంది.

**చిన్నచిన్నపనుల కోసం ఇతరులను పురమాయించకండి. ఆ పనులను మీరే స్వయంగా చేసుకోవడానికి అలవాటుచేసుకోండి. ఉదాహరణకు టీవీ ఆన్ చేయాలన్నా, ఇంటి బయట పచారీ కొట్టుకు వెళ్లాలన్నాకూడా మీరే స్వయంగా చేసుకోవడానికి ప్రయత్నించండి.

**సాధ్యమైనంత వరకు ఆహారం విషయంలో తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి. అన్నం తక్కువగా తీసుకుని గోధుమ, జొన్నరొట్టెలు, పీచు పదార్థాలు ఎక్కువగా వుండేటట్లు చూసుకోవాలి.

**ఆహారం తీసుకునే సమయంలో ఒక పద్ధతిని పాటించండి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పరిమితమైన భోజనం, సాయంత్రం ఒకటి లేదా రెండు స్నాక్స్, రాత్రిపూట డిన్నర్...ఇందులో చపాతీలుంటే ఇంకా మంచిది.

మీకు మీరుగా ఆహారం మీద నియంత్రణ విధించుకోండి. సాయంత్రం తీపి పదార్థాలను తీసుకోదలిస్తే రాత్రిపూట భోజనం మానెయ్యండి.

**శరీర బరువు తగ్గడంవలన కలిగే లాభాలు, వాటికి సంబంధించిన పుస్తకాలను, ఆర్టికల్‌ను చదవడం అలవాటు చేసుకోండి.

Post a Comment

0 Comments