మందు తాగనోడు మడిసేకాదు. అన్నాడో సినీకవి. కాని ఇప్పుడు దానినే నిజం చేస్తున్నారు ఈ నాటి మనుషులు. ముఖ్యంగా నవయువకులు మద్యం సేవించి తమ బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. మద్యం తీసుకోవడం ఓ సాంప్రదాయంగా భావిస్తున్నారు నేటి యువత.
తమ తోటి వారు మద్యం తీసుకోవడానికి నిరాకరిస్తే వారిని పురుగును చూసినట్లుగా చూస్తున్నారు. ఎందుకీ వివక్ష. మద్యం తీసుకుంటేనే సంఘం
లో గౌరవం హోదా. ఇది ఎంతవరకు సబబు. మద్యం వలన వచ్చే దుష్పరిణామాలు మన కళ్ళముందే కనపడుతున్నాయి. అయినాకూడా మద్యం తీసుకోవడం మానరా?
యువకులకు ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యంవుండడమే మద్యం తీసుకోవడానికి ప్రేరేపిస్తోంది. మొదట్లో దీనిని నిషిద్ధ పదార్థంగా భావించేవారు. గతంలో మద్యం తీసుకున్నవారిని ఛీదరించుకునేవారు, పక్కన చేర్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు మద్యం సేవించడం ఒక హోదాలా భావిస్తున్నారు.
నగరాలలోనైతే మరీ ఏకంగా కొంతమంది ఉన్నత శ్రేణి మహిళలు కూడా బాహాటంగానే మద్యం సేవిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా 31 డిసెంబరు రాత్రి మద్యం మత్తులో మునిగి నూతన సంవత్సరాన్ని స్వాగతించడం ఎంత వరకు సమంజసం.
మద్యం తీసుకోవడం వలన వచ్చే జబ్బులు గతంలో నలభైయ్యవ దశకంలో బయట పడేటివి. కాని ప్రస్తుతం నవయువకులలో కూడా విపరీతమైన జబ్బులు బయటపడుతున్నాయని వైద్యులు తెలిపారు.

0 Comments