Full Style

>

సైనస్ సమస్యకు శాశ్వత చికిత్స

విపరీతమైన తలనొప్పి, ముక్కులు మూసుకుపోయి శ్వాసకు ఇబ్బంది, యాంటీ బయోటిక్స్ వేసినా ఫలితం శూన్యం. ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం ఉంటుందన్న గ్యారంటీలేదు. సైనసైటిస్‌తో బాధపడే వారి పరిస్థితి ఇది. కానీ చల్లగాలి తగిలితే చాలు వణికిపోయే సైనస్ బాధితులకు హోమియో చికిత్స శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుందంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్ రవికిరణ్.

ముక్కు, కళ్ల చుట్టూ గదులుంటాయి. వాటిని సైనస్‌లు అంటారు. మనం శ్వాస పీల్చినపుడు గాలి ముక్కునుంచి సైనస్‌లలోకి వెళుతుంది. మనం పీల్చే గాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను ఇవి నిర్వర్తిస్తాయి. సైనస్‌ల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటకు వెళతాయి. వైరల్, బాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ సైనస్‌లలో విపరీతమైన నొప్పి పుడితే దాన్ని సైనసైటిస్ అంటారు.
ఇన్‌ఫెక్షన్ కారణం
సైనస్ ముఖద్వారం మూసుకుపోతుంది లేదా అక్కడ చాలా మ్యూకస్ పేరుకుపోతుంది. ఫలితంగా బాక్టీరియా, ఇతర క్రిములు సులభంగా పెరిగి సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్ రావటం వల్ల సైనస్‌లకు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. కొందరిలో సైనస్‌లలో వాపు రావటంతో పాటు, బాగా నొప్పిగా ఉంటుంది. చాలాకాలం పాటు ఈ సమస్యకు పరిష్కారం కాకుండా ఉండిపోతుంది. దీన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు.
లక్షణాలు
తరచు జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తరువాత దశలో జలుబు చేసినపుడు ముక్కులు మూసుకుపోతాయి. తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండటం కూడా జరుగుతుంది. ముఖంలో వాపు కనిపిస్తుంది.
పళ్లు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కనిపిస్తుంది. కొద్దిరోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగా, నోరంతా చేదుగా మారుతుంది. కొందరిలో చెవి వినిపించకుండా పోతుంది. మరికొందరిలో రెండు చెవులూ పనిచేయవు. అలసటతో పాటు తరచు జ్వరం వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి సైనసైటిస్‌తో బాధపడుతున్నాడని భావించాలి. ముఖ్యంగా ఈ సమస్య మొదలైతే సాధారణ మందులకు లొంగదని గుర్తుంచుకోవాలి.
నిర్ధారణ
ఏ సైనస్‌లకు సమస్య ఉంటే ఆ ప్రాంతంలో నొప్పి, మొద్దుబారినట్టు అవడం జరుగుతుంది. కంటికి పైభాగంలో ఉండే సైనస్‌లకు సమస్య వస్తే నుదుటి భాగం, కనుబొమ్మల ప్రాంతం అంతా నొప్పిగా ఉంటుంది. చెంప ఉండే ఎముకలో సమస్య వస్తే కళ్ల కింది భాగం, పై దవడం, పళ్లునొప్పిగా ఉంటాయి. రెండు కళ్ల మధ్యభాగంలో ఉండే సైనస్‌కు సమస్య వస్తే ముక్కు చుట్టుపక్కల అంతా నొప్పి వస్తుంది. కళ్ల చుట్టూ కూడా వాపు వస్తుంది. ముఖంలోపలి భాగాలకు సైనస్ సమస్య వస్తే తల, చెవి, మెడ నొప్పి వస్తుంది. సైనస్ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేరు. అంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సత్వరం నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.
పరీక్షలు
కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. సాధారణ ఎక్స్‌రేల వల్ల ఫలితం ఉండదు. ఫైబర్ ఆప్టిక్ స్కోప్ ద్వారా వ్యాధి నిర్ధారణ సులువవుతుంది. కొన్ని సందర్భాల్లో సి.టి స్కానింగ్ చేయాల్సి వస్తుంది. సి.టి స్కాన్ చేస్తే సర్జరీ అవసరమా? కాదా? అనే విషయం నిర్ధారణ అవుతుంది. ఎం.ఆర్.ఐ చేయించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. వీటితో పాటు అలర్జీ టెస్ట్, రక్తపరీక్షలు, వైద్యుల పర్యవేక్షణలో మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
హోమియో చికిత్స
అల్లోపతి వైద్య విధానంలో సైనసైటిస్ సమస్యకు సర్జరీ మాత్రమే పరిష్కారం చూపుతుంది. కానీ హోమియోపతి చికిత్సతో సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్‌ను సమూలంగా తగ్గించుకోవచ్చు. సైనస్ సమస్యపై హోమియోలో సుదీర్ఘ పరిశోధనలు చేసి చక్కటి ఔషధాలను కనుగొన్నారు. హోమియో మందులు వాడిన చాలా మందికి సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్ తొలగిపోయింది.
అల్లోపతి మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. హోమియో మందుల్లో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. కానీ హోమియో చికిత్స వల్ల సైనసైటిస్ సమస్య సమూలంగా తొలగిపోతుంది. మళ్లీ మళ్లీ బాధించడం జరగదు. సైనస్ లక్షణాలను ప్రారంభదశలోనే గుర్తించి అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సమస్య ఇట్టే తగ్గిపోతుంది.

Post a Comment

0 Comments