Full Style

>

సయాటిక నొప్పికి సంపూర్ణ చికిత్స

ఆధునిక జీవితం తెచ్చిన అనారోగ్యాలలో సయాటిక నొప్పి ఒకటి. యుక్త వయస్కులు, మధ్య వయస్కులలో అధికులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సయాటిక నొప్పికి ఆపరేషన్ ఒక్కటే మార్గమని చాలామంది భయపడుతుంటారు. అయితే ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా హోమియో మందులతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చని అంటున్నారు హోమియో నిపుణులు డాక్టర్ మురళి అంకిరెడ్డి.
మానవ శరీరంలో అన్నిటి కంటే పెద్దది, పొడవాటి నరము వీపు కింది భాగమైన పిరుదుల నుండి కాలు వెనుక భాగం వరకు వ్యాపించి ఉంటుంది. దీన్నే సయాటికా నరము అని అంటారు. ఈ నరము ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది(ఎల్ 4, ఎల్ 5, ఎస్ 1, ఎస్2, ఎస్ 3). వెన్నుపూస లోపల నుండి ప్రయాణించు నరాలపై ఒత్తిడి వలన కాలు వెనుక భాగం నొప్పికి గురవుతుంది. దానినే 'సయాటిక నొప్పి' అంటారు. ఈ నొప్పి వీపు కింది భాగంలో మొదలై పిరుదుల నుండి తొడ, కాలు వెనుకభాగం, మడిమల వరకు పాకే అవకాశం ఉంది. తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, మంటలు, నడకలో మార్పు వంటి లక్షణాలు కనపడతాయి.
కారణాలు
Sciatic Nerve

  • నర్వ్ కంప్రెషన్:  నర్వ్ రూట్స్ ప్రెస్ అవటం వలన నొప్పి వస్తుంది.
  • స్పైనల్ డిస్క్ హెర్నియేషన్: ఎల్4, ఎల్5 నరాల రూట్స్ ఒత్తిడి గురై సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరిగి సయాటిక నొప్పి వస్తుంది.
  • స్పైనల్ స్టీనోసిస్: ఎముకల్లో ఏర్పడే స్పర్శ వలన వెన్నెముక కంప్రెస్ అవుతుంది. దీని వలన సయాటిక నొప్పి వస్తుంది.
  • పైరిఫార్మిస్ సిండ్రమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పిరిఫార్మిస్ కండరము వాచి నర్వ్ రూట్స్‌ను ప్రెస్ చేస్తుంది. దీనివల్ల సయాటిక నొప్పి వస్తుంది.
  • సాక్రోఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు సరిగా పనిచేయక సయాటిక నొప్పి రావచ్చు.
  • ప్రెగ్నెన్సీ: గర్భిణి స్త్రీలకు చివరి నెలలో కడుపులోని శిశువు బరువు పెరిగి నర్వ్ రూట్స్ ప్రెస్ అవటం వలన సయాటిక నొప్పి వస్తుంది.
పరీక్షలు
హోమియో వైద్యుని సమక్షంలో కొన్ని వ్యాయామ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అలాగే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా డిస్క్ హెర్నియేషన్, డిస్క్ ప్రొలాప్స్ నిర్ధారణ జరుగుతుంది. ఏ నర్వ్ రూట్ ఎక్కడ కంప్రెస్ అవుతోందో నిర్ధారణ చేయవచ్చును. నొప్పి వస్తే ఏదో ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేసే వారు చాలామంది ఉంటారు. పెయిన్ కిల్లర్స్ తరచు వేసుకోవడం వల్ల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అసిడిటి, అల్సర్ వంటి వ్యాధులు రావచ్చు.
హోమియో వైద్య విధానం
సయాటిక నొప్పికి, వెన్నుపూస సమస్యలకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. కారణాన్ని బట్టి పరీక్షలలో అంటే ఎక్స్‌రే, ఎంఆర్ఐలలో ఏదైనా వెన్నుపూసలో డిస్క్ సమస్యలు, నరములో కంప్రెషన్ వంటివి నిర్ధారించుకున్న తర్వాత సయాటికాకు సంపూర్ణ చికిత్స చేయడం జరుగుతుంది. ఎటువంటి ఆపరేషన్ లేకుండా మందులతో వ్యాధిని నయం చేయడం హోమియో విశిష్టత.
హోమియో మందులు
రస్‌టాక్స్: కండరాల వాపు కారణంగా వచ్చే నొప్పికి ఇది సరైన మందు. చల్లగాలికి నొప్పులు ఎక్కువ కావడం, నొప్పితోపాటు తిమ్మిర్లు, స్టిఫ్‌నెస్, తొడల నుండి కిదికి నొప్పి వ్యాపించడం, కూర్చుని లేస్తే నొప్పి విపరీతంగా ఉండటం, కొద్దిసేపు నడచిన తరువాత నొప్పి తగ్గడం వంటి లక్షణాలకు ఇది మంచి మందు. ఎడమ వైపు కాలుకు వచ్చే సయాటిక నొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది. సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్‌కు కూడా ఇది బాగా పనిచేస్తుంది.
కిలోసింథ్: నరాలు లాగినట్టుగా భరించరాని నొప్పి ఉండడం, నొప్పి పిరుదుల నుండి మోకాలు, పాదం వరకు పాకడం, కదలినా, ముట్టుకున్నా, చల్లటి వాతావరణంలో తిరిగినా నొప్పి పెరగడం వంటి లక్షణాలకు ఇది చక్కని మందు. ముఖ్యంగా కుడి కాలికి వచ్చే సయాటికాకు మంచి మందు.
రోడోటెన్‌ట్రాన్: సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఇది మంచి ఔషధం. వేసవి వాతావరణంలో నొప్పి రావడం, స్టిఫ్‌నెస్ ఎక్కువగా మెడభాగంలో ఉండి నొప్పి భుజాల వరకు పాకడం, విశ్రాంతి తీసుకుంటే నొప్పి పెరగడం, వాతావరణం మార్పు వల్ల నొప్పి రావడం వంటి లక్షణాలకు ఇది మంచి మందు.
కాస్టికమ్: ఈ మందు ముఖ్యంగా నరాల మీద బాగా పనిచేస్తుంది. కండరాలు శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి ఉండటం, మెడభాగంలో నొప్పి ఉండి భుజాల మధ్య స్టిఫ్‌నెస్ ఉండటం వంటి లక్షణాలు ఉన్నపుడు ఇది చక్కని ఉపశమనం ఇస్తుంది. ఎడమ వైపు వచ్చే సయాటికా నొప్పికి ఇది బాగా పనిచేస్తుంది.

Post a Comment

0 Comments