Full Style

>

అలసిన శరీరానికి మాలిష్ తో ఉపసమనం

ప్రస్తుత జీవితం ఉరుకుల పరుగులమయం అయిపోయింది. దీంతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. శారీరక లేదా మానసికపరమైన ఒత్తిడే దీనికంతటికి కారణం అంటున్నారు వైద్యులు. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే శరీరానికి సుగంధ భరితమైన తైలాలనుపయోగించి మీ శరీరానికి మాలిష్ చేస్తే సుఖవంతమైన నిద్ర సొంతమంటున్నారు.
ముప్పై మిల్లీగ్రాముల బేస్ నూనెలో ఐదు చుక్కల కైమోమైల్ నూనె, ఐదు చుక్కల మెజోరమ్ నూనె, పదిహేను చుక్కల చందనపు నూనె మరియు ఐదు చుక్కల క్లైరీసెజ్ నూనెను కలుపుకుని మాలిష్ చేయండి.
దీంతో శరీరానికి, మనసుకు కొత్త శక్తి వచ్చి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
మాలిష్ చేసుకునేటప్పుడు మీ శరీరపు వెనుక వీపు భాగం, మెడ, భుజాలను పూర్తిగా మాలిష్ చేయాలి. అలాగే వేడి నీటితో స్నానం చేసేటట్లయితే తగినంత వేడి ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగాను ఉండకుండా ఉండేలా చూసుకోండి.
శరీరానికి కావలసిన వేడి మాత్రమే మీరు శరీరానికి నీటిద్వారా అందివ్వాలి. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. మీరు ఏదైనా చికిత్సను ప్రారంభించదలచుకునే ముందు వైద్యుల సలహాలను పాటించండి.

Post a Comment

0 Comments