. బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Aids- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
నిర్వచనము : -మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్ లేదా హెచ్‌ఐవి) కారణంగా వ్యాధినిరోధక శక్తి నశించి, పలువ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్ లేదా ఎయిడ్స్ అని వ్యవహరిస్తాము. 25నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే పురుషుల్లో సంభవించే మరణాలకు అతి పెద్ద కారణం ఎయిడ్స్.
ఇదే వయస్సున్న స్త్రీలలో మరణాలు సంభవించడానికి నాలుగవ అతి పెద్ద కారణం ఎయిడ్సే.
హెచ్‌ఐవి క్రిములు మానవ శరీరంలోకి ప్రవే శించి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి దానిని నిర్వీర్యం చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి నశించడంతో వివిధ రకాలైన ప్రాణాంతక వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.
లక్షణాలు
హెచ్‌ఐవి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరు వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అత్యధిక భాగం హెచ్‌ఐవి క్రిముల కారణంగా కాకుండా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి.
హెచ్‌ఐవి సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపి స్తాయి కనుక బాధితుడికి తనకు హెచ్‌ఐవి సోకిందనే అనుమానం కలుగకపోవచ్చు. హెచ్‌ఐవికి సంబంధించిన పరీక్షలను ఒకటికి రెండుసార్లు చేయించుకుని, స్పష్టమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ లక్షణాలు హెచ్‌ఐవి వ్యాధికి సంబంధించినవి నిర్ధారించకూడదు.
హెచ్‌ఐవి క్రిములు శరీరంలోకి చేరిన తరువాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాలనుంచి నెలల వరకూ పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయిం చుకుంటే హెచ్‌ఐవి పాజిటివ్ అని ఫలితం రాదు. అయితే, బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింప చేయగలిగే స్థితిలో ఉంటారు.
హెచ్‌ఐవి క్రిములతో పోరాడటానికి వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ను తయారు చేయనారంభిస్తుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే హెచ్‌ఐవి పాజిటివ్ అని ఫలితం వస్తుంది. హెచ్‌ఐవి శరీరంలోకి చేరిన తరువాత తొలిదశలో కనిపించే.. ఫ్లూ వంటి లక్షణాలు తగ్గి పోయిన తరువాత బాధితులు కనీసం పదేళ్ల వరకూ ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవిస్తారు. అయితే ఆ సమయంలో హెచ్‌ఐవి క్రిములు మాత్రం వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి.
వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సిడి4 కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు. సిడి 4 కణాలను టి-హె ల్పర్ కణాలని కూడా అంటారు. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాలు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతులలో సిడి4 కణాలు ప్రతి మిల్లీ లీటర్ రక్తంలో 500 నుంచి 1500 వరకూ ఉంటాయి. సరైన చికిత్స తీసుకోని పక్షంలో సిడి4 కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్‌ఐవి వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది.
--వ్యాప్తి
హెచ్‌ఐవి ప్రధానంగా మూడు రకాలుగా వ్యాప్తి చెందుతుంది.
1.అనైతిక విశృంఖల లైంగిక సంబంధాలు కలిగి ఉండటం,
2. మాదక ద్రవ్యాలవంటి వాటిని తీసుకో వడానికి ఒకే సిరంజిని, సూదిని పలువురు కలిసి ఉపయోగించడం.
3.రక్తమార్పిడి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
తల్లి గర్భంలో ఉండే శిశువుకు తల్లినుంచి ఈ వ్యాధి శిశువు గర్భంలో ఉన్నప్పుడు కాని, జనన సమయంలో కాని వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటివి సరైన విధంగా శుభ్రపరచి వాడకపోతే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
ఎలా వ్యాపించదు?
హెచ్‌ఐవి బాధితుడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. అలాగే హెచ్‌ఐవి బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు
లేవు. దోమలు కుట్టడం ద్వారా హెచ్‌ఐవి వ్యాప్తి చెందదు. తుమ్ములు, దగ్గు, ఇంట్లో వస్తువు లను కలిసి ఉపయోగించుకోవడం మొదలైన వాటి వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు.
ఎఆర్‌టి మందులతో హెచ్‌ఐవి నివారణ
హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తల్లులకు లేదా పాలుతాగే పిల్లలకు 28 వారాలపాటు యాంటి రిట్రోవైరల్ మందులు ఇవ్వడం వల్ల హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ తల్లి నుండి బిడ్డకు సంక్రమించడాన్ని నివారించొచ్చని పరిశోధకులు తెలిపారు. భారీ స్థాయిలో యాదృశ్చికంగా జరిగిన అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని తెలిపాయి. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరొలినా పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు.

0 Comments