image : courtesy with Prajasakti News paper.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --బర్మింగం హిప్ రీసర్ఫేసింగ్ , Birmingham Hip Resurfacing (BHR)-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
Hip joint diagramatic.
ఆర్థోపెడిక్స్‌లో పూర్తి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స (టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్) ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పాల్సిందే. ఈ శస్త్రచికిత్స వల్ల లక్షలాది మంది ప్రజలు నొప్పిలేకుండానే తమ పనులు తాము చేసుకుంటున్నారు. అయితే సాంప్రదాయమైన తుంటి మార్పిడికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ముఖ్యంగా యువకుల్లో. ఎందుకంటే అప్పటికే ఎముకలు నష్టపోయి ఉంటాయి. ఒక వేళ సర్జరీ చేస్తే తర్వాత మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరముంటుంది. ఈ పరిమితిని అధిగమించడానికే బర్మింగం హిప్ రీ సర్ఫేసింగ్ సర్జరీని రూపొందించారు. ఇది యువకులకు ఒక వరం లాంటిది. సర్జరీ తర్వాత సాధారణ వ్యక్తుల్లాగా వీరు తమ పనులు తాము చేసుకుంటారు. ఈ వారం బర్మింగం హిప్ రీసర్ఫేసింగ్ సర్జరీ గురించి తెలుసుకుందాం....
తుంటి గురించి --
మన శరీరంలో అతి పెద్ద కీలు మోకాలి కీలు. నడుస్తున్నప్పుడు, నిల్చున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు వాటిపైన చాలా బరువు పడుతుంది. కీళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి కొద్దిగాదెబ్బతిన్నా అవి వేరే సున్నితమైన భాగాల్ని కూడా దెబ్బతీస్తాయి. తుంటి కీలులోని బంతికి రక్తప్రసరణ ముఖ్యం. బంతికి అనుసంధానమై ఉండే 'నెక్' కట్ అయితే బంతికి వెళ్లే రక్తప్రసరణ పూర్తిగా దెబ్బతింటుంది. చాలా వరకు ప్రమాదాల్లో నెక్ ఫ్రాక్చర్ అయితే బంతికి రక్తప్రసరణ దెబ్బతింటుంది. దీన్ని మళ్లీ ఫిక్స్ చేసినా కొంత మందిలో రక్తప్రసరణ సాధారణ స్థితికి చేరుకోవచ్చు. అటువంటి వారిలో బంతి పూర్తిగా దెబ్బతింటుంది. ప్రమాదాల్లో గాయాలై తుంటి వద్ద ఉండే బంతి, సాకెట్, కీలు దెబ్బతిన్నవారికి ఐదారేళ్ల తర్వాత ఆర్థ్రయిటీస్ వస్తుంది. ఇలాంటి వారికి బర్మింగం హిప్ రీసర్ఫేసింగ్ చేసే వీలుంది. కొందరికి బంతిలో రక్తప్రసరణ ఆగిపోయి బంతి పూర్తిగా చెడిపోతుంది. ఇది యువకుల్లో ఎక్కువ.
తుంటిలో సమస్యలుంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
తుంటిలో సమస్య ఉన్నవారు ముఖ్యంగా ఎదుర్కొనే తొలి లక్షణం నొప్పి. నడుస్తున్నప్పుడు, కూర్చొని లేచినప్పుడు నొప్పితో బాధపడతారు. తుంటి గజ్జ (హిప్ గ్రాయిన్), లేదా తొడల్లో, పిరుదుల్లో నొప్పి వస్తుంది. ఒకే కాలుపై నిల్చున్నప్పుడు నొప్పిగా ఉంటుంది. కూర్చొని లేచినప్పుడు నొప్పి ఎక్కువైతుంది. కింద కూర్చొలేరు. అటూ, ఇటూ తిరగలేరు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కొన్ని రోజుల తర్వాత నడుం భాగంలో నొప్పి వస్తుంది. రాత్రిపూట నొప్పి వల్ల నిద్ర సరిగ్గా రాదు.
ఏమిటీ దీని ప్రత్యేకత ?
బర్మింగం అనేది బ్రిటన్‌లో ఒక ప్రాంతం. బర్మింగం ఆసుపత్రిలో బర్మింగం హిప్ డిిజైన్ చేశారు. బర్మింగం హిప్ చాలా పెద్దది. సాధారణ హిప్‌లాగా ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత కింద కూర్చోవచ్చ. ఎగిరిగెంతేయొచ్చు. క్రీడల్లో పాల్గొనేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అన్ని పనులు చేసుకోవచ్చు. సంప్రదాయ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కింద కూర్చోలేరు. ఒక వేళ కూర్చుంటే డిస్‌లొకేట్ అవుతుంది. అంతేకాక బంతి సైజు తక్కువే. ఎక్కువగా కూర్కోవడ, ఎగరడం, గెంతేయడం, రన్నింగ్ చేయడం వల్ల అరిగిపోయే అవకాశముంటుంది. బర్మింగం హిప్ పెద్దగా ఉంటుంది. అందుకని తొందరగా అరిగిపోదు.
ఈ చికిత్స ఎవరికి?
బర్మింగం హిప్ రీసర్ఫేసింగ్ సర్జరీ ముఖ్యంగా యువకులకు, యాక్టివ్‌గా ఉండేవారికి చేస్తారు. శస్త్రచికిత్స తర్వాత వీరు తమ రోజువారి పనులు చేసుకోవచ్చు. డైవింగ్, జంపింగ్, రన్నింగ్ ఇవన్నీ చేయొచ్చు. ఎముక గట్టిగా ఉండేవారికి, యువకులకు, కంండరాల్లో. బలమైన కండరాలు ఉన్నవారిలో ఆపరేషన్ విజయవంతం అవుతుంది. వృద్ధుల్లో ఎముకలు, కండరాలు బలహీనంగా ఉంటే ఆపరేషన్ అంతగా విజయవంతం కాదు.
చికిత్స దశలు వివరిస్తారా?
తుంటి సమస్యలకు నాలుగు దశల్లో చికిత్స చేస్తారు.
తొలి దశ : మందులు, ఫిజియోథెరపీతో చికిత్స.
రెండో దశ : మందుల డోసు పెంచి, ఫిజియోథెరపీ చేస్తారు.
3వ దశ : ఈ దశలో ఇంజక్షన్లు ఇస్తారు. ఆర్థ్రోస్కొపి చేస్తారు.
4వ దశ : ఈ దశలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఏర్పడుతుంది. శస్త్రచికిత్సలో పూర్తిగా బంతిని మార్పిడి చేయకుండా బంతి ఉపరితలాన్ని షేవింగ్ చేస్తారు. మన పంటిపైన ఎనామిల్ ఎలా ఉంటుందో బంతి లోపల కూడా ఎముక ఉంటుంది. దీన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్. ఇది దెబ్బతింటే చెక్కినట్లు షేవింగ్ చేసికొత్తది సాకెట్‌పెడతారు. దీన్ని సర్ఫేస్ రీప్లేస్‌మెంట్ అంటారు.
బర్మింగం హిప్ రీసర్ఫేసింగ్ శస్త్రచికిత్స ఎలా చేస్తారు?
సంప్రదాయ తుంటిమార్పిడి శస్త్రచికిత్సలో తుంటిలోని బంతి, సాకెట్‌ను పూర్తిగా తొలగిస్తారు. కానీ బర్మింగం హిప్ రీసర్ఫేసింగ్ శస్త్రచికిత్సలో కేవలం సాకెట్ మారుస్తారు. బంతిని పూర్తిగా మార్చరు. బంతి ఉపరితలంపై చెక్కినట్లు 'షేవింగ్' చేస్తారు. అంటే దెబ్బతిన్న ఎముకను తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల తుంటి చికిత్స అవసరమైన యువకుల్లో తర్వాత ఎముక అలాగే భద్రంగా ఉంటుంది. అవసరమైతే అప్పుడు బంతి తీసి మళ్లీ శస్త్రచికిత్స చేయొచ్చు.
దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి?
చాలా ప్రయోజనాలున్నాయి. నొప్పి పూర్తిగా పోతుంది. రెండో ఆపరేషన్ అవసరముండదు. ఒక వేళ చేయాల్సి వస్తే, ఆపరేషన్ సులభంగా అవుతుంది. బర్మింగం హిప్ డిస్‌లొకేట్ కాదు. అన్ని వైపులా తిరగొచ్చు. కింద కూర్చోవచ్చు. ఎక్కువ బరువైనా ఇబ్బంది ఉండదు. సంప్రదాయ హిప్ రీప్లేస్‌మెంట్ చేయించకున్నవారు రన్నింగ్, జాగింగ్, కింద కూర్చొవడం చేయకూడదని సలహా ఇస్తుంటాం.
ఇతర కంపెనీలు ఇలాటి హిప్‌ను తయారు చేస్తున్నాయి? వీటి మన్నిక ఎలా ఉంది?
బర్మింగం హిప్‌ను దృష్టిలోపెట్టుకుని చాలా కంపెనీలు హిప్‌ను తయారు చేస్తున్నాయి. అయితే ఇవి బర్మింగం హిప్‌లాగా పనిచేయలేదు. ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు హిప్ రీప్లేస్‌మెంట్‌కు లైసెన్స్ ఉన్నది బర్మింగం హిప్‌కే. ఫెయిల్యూర్ వల్ల ఇతర కంపెనీలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి.
బర్మింగం హిప్ ఎంత కాలం మన్నుతుంది? శస్త్రచికిత్స ఖరీదు ఎంత ?
బర్మింగం హిప్ జీవిత కాలం 15 ఏళ్ల వరకు ఉంటుంది. 40 ఏళ్లవారికి చేస్తే 55 ఏళ్లు వరకు వస్తుంది. మళ్లీ చేయాలంటే బంతిని తీసి కొత్తది వేసే అవకాశముంది. ఇది మళ్లీ 20 ఏళ్లు పనిచేస్తుంది. శస్త్రచికిత్స ఖరీదు రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షలు అవుతుంది.
శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఆపరేషన్ అయ్యాక రెండో రోజే ఆసుపత్రిలో నడిపిస్తారు. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తారు. మినిమల్ యాక్సెస్ పరిజ్ఞానం వల్ల చిన్న రంధ్రం ద్వారా ఆపరేషన్‌చేసే వీలుంది. దీని వల్ల రక్తస్రావం తక్కువ. రెండు వారాల వరకు జాగ్త్రతగా ఉండాలి. ఇంట్లోనే నడవాలి. ఎందుకంటే తొలి రెండు వారాల్లో ఇన్‌ఫెక్షన్ అయ్యే అవకాశాలెక్కువ. రెండు నుంచి 3 నెలల తర్వాత ఎప్పటిలాగే ఉండొచ్చు.
తుంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కండరం బలహీనంగా ఉంటే కీలుపై ఎక్కువ బరువు పడుతుంది. అప్పుడు కీళ్లు దెబ్బతింటాయి. ఎలాంటి శారీరక శ్రమ, వ్యాయామం లేనివారిలో కండరాలు బలహీనమవుతాయి. కొన్ని మందులు, స్టీరాయిడ్స్ వల్ల బంతికి రక్తప్రసరణ ఆగుతుంది. స్టీరాయిడ్స్ తీసుకోవడం పొరపాట్లు జరుగుతున్నాయి. ఆల్కహాలు ఎక్కువ తీసుకుంటే దీర్ఘకాలంగా రక్తప్రసరణ ఆగి ఆర్థ్రయిటీస్ వస్తుంది. ఆర్థ్రోపెడిక్స్‌లో ఆల్కలహాలు మిగతా జాయింట్స్ కంటే ఒక్క హిప్ జాయింట్‌నే ప్రభావితం చేస్తుంది. తుంటిలో సమస్య మొదలైనవారు ఆల్కహాలు, స్టీరాయిడ్స్ తీసుకోవడం మానాలి. కొందరికి రక్తానికి సంబంధించిన వ్యాధుల వల్ల రక్తప్రసరణ ఆగిపోతుంది. అందువల్ల వారు వ్యాధులకు చికిత్స చేయించుకుని నియంత్రించుకోవాలి. కండరాలు బలంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. కండరాలు బలహీనంగా ఉంటే కాలు సరిగ్గా లేపలేరు. నడిచేటప్పుడు కష్టపడుతు నడుస్తుంటారు. ఒక అడుగు ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుంది. కాలు పైకిలేపి వేయలరు.
హిప్ రీప్లేస్‌మెంట్‌పై ఎలాంటి అపోహలున్నాయి?
చాలా మంది హిప్‌రీప్లేస్‌మెంట్ అంటే పెద్ద ఆపరేషన్ అని, మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని, చాలా రోజులు మన్నిక ఉండదని, చాలా పనులు చేయలేమని అనుకుంటారు. ఇవన్నీ అపోహలే.
వైద్య రంగంలో వచ్చిన అధునాత పరిజ్ఞాం వల్ల తుంటి మార్పిడి శస్త్రచికిత్స 40 నిమిషాల్లో చేస్తున్నారు. ఇంతకు ముందు 3 గంటలకుపైగా పట్టేది. చిన్న రంధ్రంతో మినిమల్ యాక్సెస్ పద్ధతిలో రక్తస్రావం చాలా తక్కువ. ఒక తుంటి మార్పిడికి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు.
ఎక్కువ రోజులు విశ్రాంతి అవసరం ఉండదు. ఆపరేషన్ రెండో రోజే నడిపిస్తారు. తర్వాత మామూలుగా పనులు చేసుకోవచ్చు.
పూర్తిగా ఎప్పటిలాగా ఉండటానికి రెండు నుంచి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాతి సమయంలో తన పనులు తాను చేసుకోవచ్చు. ఎవరిపైనా ఆధారపడాల్సి అవసరం లేదు.
మళ్లీ ఆపరేషన్ అవసరం రాదు. 80 శాతం మందికి ఇది జీవితాంతం ఉంటుద. ఇది కేవలం 20 శాతం మందికే. మళ్లీ 15 ఏళ్ల తర్వాత చేయాల్సి ఉంటుంది.ఆపరేషన్ తర్వాత ఎప్పటిలాగే జీవనాన్ని కొనసాగించొచ్చు.

0 Comments