కొందరు ఉదయాన్నే నిద్ర నుంచి లేచి కాలు కింద పెట్టగానే మడమ నొప్పితో విలవిల్లాడిపోతుంటారు. కొద్దిసేపు అటూఇటూ నడిచాక నొప్పి తీవ్రత కాస్త తగ్గగానే ఇక దాన్ని పట్టించుకోవటం మానేస్తుంటారు. కానీ ఈ మడమనొప్పి రావటానికి గల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే చాలావరకు దీన్నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి మడమనొప్పి రావటానికి చాలా కారణాలే ఉన్నాయి గానీ తరచుగా కనిపించేది మాత్రం ప్లాంటర్ ఫేషియైటిస్. మన అరికాలు చర్మం కింద.. మడమ దగ్గర్నుంచి పెద్దవేలు మూలం వరకు ప్లాంటర్ ఫేషియా అనే కణజాలం విస్తరించి ఉంటుంది. ఏ కారణంతోనైనా చినిగినప్పుడో, సాగిపోయినప్పుడో ఇది వాచి పోతుంది. దీంతో అక్కడ మంట, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది? ఎక్కువసేపు నిలబడటం, అధికబరువు, అరికాలు వంపు మరీ తిన్నగా గానీ ఎత్తుగా గానీ ఉండటం, అడుగుభాగం చాలాగట్టిగా ఉండే షూ, చెప్పులు వేసుకోవటం వంటివి దీనికి దారితీస్తాయి. ప్లాంటర్ ఫేషియైటిస్‌తో బాధపడే చాలామందిలో మడమ వద్ద ఉండే ఎముక బయటకు పెరగటం (హీల్ స్పర్స్) కూడా ఉండొచ్చు. అయితే హీల్ స్పర్స్ మూలంగా ఫేషియైటిస్ రావటానికి అవకాశం లేదు.
లక్షణాలేంటి?
* మడమనొప్పి. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే లేదంటే చాలాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎక్కువగా ఉంటుంది.
* నిలబడితే నొప్పి ఎక్కువ అవుతుండటం.
* వ్యాయామం చేసిన తర్వాత మడమ నొప్పిగా ఉండటం.
చికిత్స
* విశ్రాంతి తీసుకోవటం
* షూ వేసుకున్నప్పుడు అరికాలు వంపునకు దన్నుగా ఉండే ప్యాడ్స్ ధరించటం
* మడమ నుంచి పైకి వెళ్లే కండర బంధనం, పిక్క కండరాలు సాగేలా తేలికపాటి వ్యాయామం చేయటం
* నొప్పి ఉన్నచోట మంచు గడ్డలను ఉంచటం
* ఐబూప్రొఫెన్ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ మందులు వేసుకోవటం.
* అధికబరువును తగ్గించుకోవటం.
* కొందరికి కార్టికోస్టిరాయిడ్ ఇంజెక్షన్లూ అవసరమవుతాయి.
* ఏ చికిత్సలూ పనిచేయకపోతే ఆపరేషన్ కూడా చేయాల్సి రావొచ్చు.
ఇతర కారణాలు
* అన్ని మడమ నొప్పులకూ ఫేషియైటిస్‌్ మాత్రమే కారణం కాదు. మధుమేహం, రక్తనాళాల జబ్బు వంటి తీవ్రమైన సమస్యలూ కాలు, మడమనొప్పులకు దోహదం చేస్తాయి. కీళ్లవాతం, తీవ్రమైన దెబ్బ తగలటం, కమిలిపోవటం, గౌట్, ఎముకపై తరచుగా ఒత్తిడి పడటంతో స్వల్పంగా విరగటం వంటి సమస్యలూ మడమనొప్పిని కలగజేస్తాయి. కణితులు, ఇన్‌ఫెక్షన్లు కూడా కారణం కావొచ్చు గానీ చాలా అరుదు. విడవకుండా మడమనొప్పి వేధిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి సరైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవటం మంచిది.

0 Comments