Full Style

>

మడమ నొప్పి,Heel pain


మడమ నొప్పి,Heel pain- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలిని అలవర్చుకోలేక చాలామంది మడమ నొప్పితో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం తోడై మడమ నొప్పిని అతి చిన్నవయస్సులోనే ఎదుర్కొంటున్నారు. నిత్య జీవితంలో ప్రతి కదలిక మడిమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటం వలన మడమ నొప్పితో కదలికలు కష్టంగా మారతాయి. మడమ కింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదునుగా పెరుగుతుంది. ఫలితంగా పాదం అడుగు భాగంలో నొప్పి కలుగుతుంది.
రాత్రంతా విశ్రాంతిగా పడుకున్న తర్వాత ఉదయం మంచం దిగుతూనే కాలు నేల మీద పెట్టాలంటే చాలామందికి నరకం కనిపిస్తుంటుంది. రోజులో ఎక్కువ సేపు నిలబడే ఉండటం, లేదా సాధారణంగా గట్టి నేల మీద నడక, పరుగు, జాగింగ్‌ వంటివి దీనికి ముఖ్య కారణం.

కారణాలు :
మన పాదం అడుగున- మడమ నుంచి వేళ్ల వరకూ ఒక బలిష్టమైన కండరం ఉంటుంది. దీన్నే 'ప్లాంటార్‌ ఫేషియా' అంటారు. పాదం అడుగు వైపున.. ఒక పక్క గొయ్యిలా ఉండే భాగానికి (ఆర్చ్‌) కూడా ఈ దృఢమైన కండరమే ఆధారం. గట్టి నేల మీద బలంగా పరుగెత్తటం, ఎక్కువసేపు నిలబడే ఉండటం.. ఇలా ఏదైనా కారణాన ఈ కండరం మీద తీవ్రమైన ఒత్తిడి పడితే ఇది కొద్దిగా చిరగొచ్చు. లేదా బాగా నలిగినట్టుగా అవ్వచ్చు. ఫలితమే- నడిచేటప్పుడు మడమ నొప్పి. చెప్పుల్లేకుండా నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా ఈ నొప్పి ఇంకా పెరుగుతుంటుంది. సాధారణంగా ఈ నొప్పి పూర్తిగా తగ్గటానికి ఎంతలేదన్నా 8, 9 నెలలు పడుతుంది. కొంతమందికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు కూడా.

నివారణ--
ఇటువంటి నొప్పులకు వ్యాయామం బాగా పని చేస్తుంది. పాదానికి సాధ్యమైనంత విశ్రాంతి ఇవ్వటం, నొప్పి బాధ తగ్గేందుకు మందులేసుకోవటం వంటివన్నీ కాక కొన్ని ప్రత్యేక వ్యాయామాలతో మంచి ప్రయోజనం ఉంటుంది. పాదం అడుగున ఉండే ఈ ప్లాంటార్‌ ఫేషియా కండరాన్ని నిదానంగా సాగదీసి వదులుతుండటం (స్ట్రెచ్‌) దీనిలోని వ్యాయామం.
జాగ్రత్తలు
మడమ నొప్పికి నాటు వైద్యం, పచ్చబొట్లు లాంటివి చేయకూడదు.
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాదాలను వేడి నీళ్ళల్లో ఉంచి అడుగు భాగమును నెమ్మదిగా ప్రెస్ చేయాలి.
కాలి పాదాన్ని కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి త్రిప్పుతూ నెమ్మదిగా వ్యాయామం చేయాలి.
వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజయోథెరిపీ వైద్యుల సలహాలు తీసుకోవాలి.
నిప్పి ఉన్నప్పుడు అతిగా ‘పెయిన్ కిల్లర్స్’ వాడకుండా డాక్టర్ సలహా మేరకు మందులను వాడుకోవాలి.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుటానికి ప్రయత్నించాలి.
నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్తడం, పరిగెత్తడం, మెట్లు ఎక్కడం, దిగడం చేయకూడదు.
వైద్యుల సలహామేరకు తీసిన ఎక్స్‌రే వలన ఈ మడిమ నొప్పి తీవ్రత తెలుస్తుంది.

వ్యాయామాలు
1. మడమ నొప్పి ఉన్న కాలు పైకి వచ్చేలా.. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. చేత్తో పాదాన్ని వేళ్ల దగ్గర పట్టుకుని... సాధ్యమైనంత వెనక్కి వంచాలి. ఇలా వెనక్కి సాగదీసి 10 సెకన్లు పట్టుకుని తర్వాత మామూలు స్థితికి తేవాలి. రోజూ రెండుపూట్లా.. ఇలా కనీసం 10 సార్లు చెయ్యాలి.
2. నేల మీద ఓ శౌకం (టవల్) పడెయ్యండి. దాన్ని కాలి వేళ్లతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ.. కొద్దికొద్దిగా మీ వైపు లాక్కుంటూ ఉండండి. రోజూ ఇలా 10 సార్లు చెయ్యండి.

Post a Comment

0 Comments