కొవ్వు పదార్థాలు కొన్ని ప్రాథమిక విషయాలు,Fatty food and basic awareness-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మనం తినే ఆహారంలో శక్తినిచ్చే పదార్థాలు స్థూలంగా కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫాట్స్ అన్న విషయం తెలిసిందే. మధుమేహ రోగులకు ఆహారం గురించి సూచించినప్పుడు మొత్తం కేలరీలు ఎంత తీసుకోవాలో చెప్పి, అందులో కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫాట్స్ నిర్దిష్ట పాళ్లలో ఉండేలాచూసుకోవాలని చెబుతారు. లిపిడ్స్ లేదా ఫాట్స్ అంటే కొవ్వు పదార్థాలను 30 శాతం మించకుండా తీసుకోవాలని సూచిస్తారు. అందులోకూడా శాచురేటెడ్ ఫాట్స్ 10 శాతం, అన్‌శాచురేటెండ్ ఫాట్స్ 20 శాతం ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా శరీరంలో శక్తి కార్బొహైడ్రేట్స్ రూపంలో కంటే ఫాట్స్ రూపంలో ఎక్కువ శక్తి నిల్వ ఉంటుంది. ఒక స్త్రీ శరీరం కార్బొహైడ్రేట్స్ రూపంలో 1000 కేలరీలశక్తిని నిల్వ ఉంచుకోగల్గితే, కొవ్వు రూపంలో 1,25,000 కేలరీలను నిల్వ ఉంచుకోగలదు. అదే స్థూలకాయం కల్గిన స్త్రీ శరీరం దాదాపు 5,00,000 కేలరీల శక్తిని నిల్వ ఉంచగల్గుతుంది. ఒక గ్రాము కొవ్వు పదార్థం 9 కేలరీల శక్తిని విడుదల చేయగలదు . సుమారు ప్రతి 7200 కేలరీల శక్తి శరీరంలో ఒక్క కిలోగ్రాము బరువుగా మారుతుంది . అందుకే కొవ్వు పదార్థాల వినిమయంలో కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రత్యేకించి మధుమేహరోగులకు ఎంతగానో ఉంది.
మెదడుకు కొవ్వు కావాలి :
శరీరము లో కొవ్వును పెంచుకోవడానికి ఎవ్వరూ ఏమాత్రము ఇస్టపడరు . వైద్యులు కూడా శరీరములో కొవ్వు పేరుకుపోకూడదంటారు . అయితే మెదడుకి మాత్రము కొవ్వు కావాల్సిందేనని అంటున్నారు . .. . శాస్త్రవేత్తలు . మెదడు ఎంత పాదరసం లా పనిచేస్తే మనం మన కార్యకలాపాల్ని అంత చురుగ్గా నివహిస్తాము . మెదడు లో 60% ప్ర్యాట్ ఉంటుంది . ఈ ప్యాటీ / లీడ్స్ మెదడు ఫిట్ గా , ఫైన్ గా ఉండేందుకు సహకరిస్తుంది . మెదడులో ఎక్కువ ఫ్యాట్ తగ్గితే సులువు గా అలసిపోయి జ్ఞాపకశక్తి లోపించడానికి , డిప్రెషన్ కు, అందో్ళనకు లోనవడము జరుగుతుందంటారు . ఒమేగా 3 ప్యాటీయాసిడ్ ఉన్న పదార్ధాలు తినడము వల్ల బ్రెయిన్ కు మంచి పోషకాలు లబిస్తాయి. ఒక పదార్ధము ఒక అవయవానికి మంచిదైతే మరొక అవయవానికి చెడ్డదిగా ఈ ప్రకృతి ఆదిపత్యము చేస్తూ ఉన్నది .
కొవ్వు పదార్థాలు
అన్ని రకాల పదార్థాల్లోనూ కొవ్వులు ఎంతో కొంత శాతం ఉంటాయి. కానీ ఎక్కువగా కొవ్వు కల్గిన పదార్థాలు ఏమిటో చూద్దాం... వృక్షసంబంధమైన కొవ్వులు ఎక్కువగా నూనెల రూపంలో ఉంటాయి. పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్), కుసుమ (సాఫ్లవర్), వేరుశనగ, ఆవనూనె, నువ్వులనూనె, కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, సోయాచిక్కుడు నూనె, రైస్‌బ్రాన్ ఆయిల్ వంటివి ఉదాహరణలు. అలాగే జంతుసంబంధమైన కొవ్వులకు పాలు, పాలుఉత్పత్తులైన వెన్న, నెయ్యి, జున్ను వంటివి, గడ్లు, మాంసం వంటివి ఉదాహరణలు.
ఒమేగా ఫాటి ఆమ్లాలు
ఫాటి ఆమ్లాలలో లినోలిక్, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు శరీరానికి అత్యవసరం. వీటిని శరీరం లోపల తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారా బయటి నుండి తీసుకోవాల్సిందే. అందుకే వీటిని ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు అంటాం. పాలిఅన్‌శాచురేటెడ్ ఫాటి ఆమ్లాల గ్రూపునకు చెందిన ఒమేగా-3 ఫాటి ఆమ్లాలు శరీరంలో ఆల్ఫాలినోలెనిక్ ఆమ్లం ద్వారా తయారవుతాయి. ఇపిఎ, డిహెచ్‌ఎ వంటి వాటిని ఆల్పాలినోలెనిక్ ఆమ్లం ద్వారా శరీరం తయారు చేసుకోగలదు. ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ట్రైగ్లిసరైడ్స్‌ను, రక్తపోటును తగ్గిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తాయి. క్యాన్సర్ నివారణకో దోహదం చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అల్జిమర్స్ వంటి వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.
ఫాస్ట్ ఫుడ్స్
దాదాపు అన్ని రకాల ఫ్యాక్డ్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్స్, చిప్స్, పేస్త్రీలు వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌లో మార్గరిస్, డాల్డా (వనస్పతి) వంటి హైడ్రోజెనేటెడ్ చేయబడిన కొవ్వుపదార్థాలు, చవకగా లభించే పామాయిల్ వంటివి వాడతారు. ఎందుకంటే ఈ రకంగా హైడ్రోజనేట్ చేసిన కొవ్వులు ఎక్కువకాలం చెడకుండా ఉంటాయి. సువాసన కూడా చెడకుండా ఉంటుంది. వ్యాపార ప్రయోజనాలకు ఇవి ఉపకరిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా చూస్తే, ట్రాన్స్‌ఫాట్స్, శాచురేటెడ్ ఫాట్స్ వాడకం వల్ల రక్తంలో టోటల్, చెడు కొలెస్టరాల్ శాతం పెరిగి, ధమనుల్లో రక్తప్రసరణకు అడ్డుపడతాయి. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువవుతుంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఫాస్ట్‌ఫుడ్స్ మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా బహుళజాతి కంపెనీలకు లాభాల వర్షం కురిపిస్తోంది. ఒక్క 2006లోనే ప్రపంచ ఫాస్ట్‌ఫుడ్ మార్కెట్ విలువ 10,240 కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఒక్క మెక్‌డోనాల్డ్స్ బహుళజాతి కంపెనీ 6 ఖండాల్లో 126 దేశాల్లో 31,000 ఫాస్ట్‌ఫుడ్‌రెస్టారెంట్స్ నడుపుతుందంటే దీని విస్తృతి మనకు అర్థమవుతోంది. ఇలాంటి ట్రాన్స్‌ఫాట్స్, శాచురేటెడ్ ఫాట్స్ బారిన పడి బహుళజాతి కంపెనీలకు లాభాలను కూర్చిపెట్టి అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్న ఈ దుస్థితికి పరిష్కారం ప్రజల్లో ఆరోగ్యం పట్ల విస్తృతమైన అవగాహన పెంపొందించడం మాత్రమే కాగలదు.
ఆదర్శ నూనె-లక్షణాలు
* శాచురేటెడ్ ఫాటి ఆమ్లాలు (శా.ఫా. ఆ.) తక్కువగా (6 నుంచి 8 శాతం) ఉండాలి.
* మోనోఅన్‌శాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు (ముఫా) ఎక్కువగా (65 నుంచి 70 శాతం) ఉండాలి.
* పాలిఅన్‌శాచురేటెడ్ ఆమ్లాలైన (పూఫా) లినోలిక్ (ఓమెగా-3), ఆల్ఫాలినోలెనిక్ (ఓమెగా-6) ఫాటీ ఆమ్లాలు సరైన నిష్పత్తిలో ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ఓమేగా-3, ఓమేగా-6 పాలిఅన్‌శాచురేటెడ్ ఆమ్లాల నిష్పత్తి 4:5 ఉండాలి.
* ట్రాన్స్‌ఫాటి ఆమ్లాలు రెండు శాతం కంటే తక్కువుండాలి.
ఏ ఒక్క వంట నూనెలో కూడా ఆదర్శనూనెకు చెప్పబడిన పరిమాణాల్లో, పాళ్లలో అన్ని ఫాటీ ఆమ్లాలు ఉండవు. ఉన్నతంతో మూఫాస్ ఎక్కువుండే నూనె ఒకరోజు, పూఫాస్‌లో ఓమేగా3/ఓమెగా-6 ఫాటీ ఆమ్లాల నిష్పత్తి ఆదర్శవిలువలకు దగ్గరగా ఉండే నూనె మరోరోజు వాడుకోవడం మంచిది. అంటే రెండు రకాల నూనెలు వాడుకోవడం ఉత్తమం. ఉదాహరణకు మూఫా ఎక్కుండే ఆవనూనె,వేరుశనగనూనె, రైస్‌బ్రాన్ నూనెల్లో ఏదైనా ఒకరోజు వాడుకోవాలి. మరుసటి రోజూ పూఫాస్ ఎక్కువుండే సన్‌ఫ్లవర్ నూనె, సోయాచిక్కుడు నూనెల్లో ఏదైనా వాడుకోవడం ఉత్తమం.
నూనె శా.ఫా. ఆ.శాతం ముఫా శాతం పూఫా ఓమేగా-3 శాతం పూఫా ఓమేగా-6 శాతం ఓమేగా 3/ ఓమేగా-6 నిష్పత్తి ప్రధాన ఫాటీ ఆమ్లాలు
ఆవనూనె 8 70 12 10 6:5 మూఫా
సోయానూనె 15 27 53 5 10.6:1 పూఫా
పామాయిల్ 45 44 10 0.5 20:1 శాచురేటెడ్+మూఫా
వేరుశనగ 24 50 25 0.5 50:1 మూఫా
సన్‌ఫ్లవర్ 13 27 60 0.5 120:1 పూఫా
రైస్‌బ్రాన్ 22 41 35 1.5 23:1 మూఫా+పూఫా
జాగ్రత్తలు
*వంటనూనెల వ్యాపారతయారీ ప్యాక్‌పై లేబుల్‌ను క్షుణ్ణంగా పరివీలించండి. శాచురేటెడ్ ఫాట్స్ శాతం 6 నుంచి 8 శాతం ఉండేలా చూసుకోండి. అలాగే ట్రాన్స్‌ఫాట్స్ శాతం 2 శాతం మించకుండా గమనించండి. దేశంలో లభ్యమయ్యే ఎక్కువశాతం బ్రాండ్స్ వంటనూనెల్లో ట్రాన్స్‌ఫాట్స్ శాతం 2 శాతం మించకూడాదన్న నిబంధన అతిక్రమించి 12 శాతంపైగా ఉంటోంది.
* కల్తీ నూనె అని అనుమానం వచ్చినప్పుడు ఫుడ్ అడల్టరేషన్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదుచేసి, చెక్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
* నెలకు మనిషికి అరకిలో మించకుండా అంటే రోజుకు సగటున ఒక టేబుల్‌స్పూన్ మించకుండా వంటనూనె వాడకాన్ని పరిమితం చేయాలి.
* డీప్‌ఫ్రై ( మరిగేదాకా వేపుడు చేయడం) పద్దతులు అనారోగ్యకరం. డీప్ ఫ్రై పద్దతులు బదులు స్టిర్ ఫ్రై, గ్రిల్లింగ్, బేకింగ్ వంటి పద్ధతుల్లో వండడానికి ప్రాధాన్యతనివ్వాలి.
* నాన్‌స్టిక్ పాన్ వాడండి. తక్కువ నూనె పట్టేలా చేస్తుంది. అలాగే సాధ్యమైతే మార్కెట్‌లో లభ్యమయ్యే కనోలా లేదా ఆలివ్ ఆయిల్ స్రై వాడితే కూడా నూనె తక్కువ పట్టేలా వండుకోవచ్చు.
* చవక కదా అని పామాయిల్, డాల్డా వంటి వాడాకాన్ని ప్రోత్సాహించకూడదు.
* ఏదైనా నూనెను వేడిచేసినప్పుడు, బాగా మరిగి ఒక దశలో పొగ వస్తుంది. ఈ దశనే ఆనూనె స్మోక్ పాయింట్ అంటాం. ఈ దశలో నూనె మాడి, అనారోగ్యకరమైన రసాయన మార్పులు సంభవిస్తాయి. స్మోక్‌పాయింట్ దాటి వేడిచేసినప్పుడు జరిగే మార్పుల వల్ల క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయని కూడా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. గారెలు, పూరీలు, సమోసా, బజ్జీ, పకోడి, అప్పడాలు, వడియాలు, ఫ్రైడ్ చికెన్ వంటి వంటకాలకు ఇలా నూనె ఎక్కువగా మరగపెడుతుంటాం. వీలైనంత మటుకు మరగకాచిన నూనెను మరలా వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. సాధారణంగా చూస్తూ చూస్తూ ప్రతీసారీ నూనెని పారబొయ్యలేం కనుక మళ్లీ వాడేస్తుంటాం. కనీసం మరగకాచిన నూనెని వేరే పాత్రలో ఉంచి అదేరోజు తక్కువ కాచే అవసరం ఉండే కూరల్లో తాళింపు వంటి వాటిలో వాడండి.
* ఒకసారి వాడిన నూనెను తిరగి వాడే ముందు పాత్రలోని అడుగు భాగాన్ని వడగట్టండి.
ఫాటి ఆమ్లాలు
ఫాటి ఆమ్లాలు స్థూలంగా శాచురేటెడ్ ఫాటీఆమ్లాలు, అన్‌శాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు అని తెలుసుకున్నాం. అన్‌శాచురేటెడ్ ఫాటీఆమ్లాలను మళ్లీ మోనోఅన్‌శాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు, పాలిఅన్‌శాచురేటెడ్ అనే రెండు రకాల ఫాటీ ఆమ్లాలుగా విభజించొచ్చు. ఇవిగాక వ్యాపారోత్పత్తిలో భాగంగా వెజిటబుల్ నూనెలను హైడ్రోజనేషన్ ప్రక్రియకు గురిచేయడం ద్వారా ఉత్పత్తి చేసే కొవ్వుపదార్థాల్లో ట్రాన్స్‌ఫాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
* కొబ్బరినూనె, పామాయిల్ నూనెల్లో శాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.
* వేరుశనగ, ఆలివ్‌నూనె, ఆవ నూనె, నువ్వులనూనె, రేప్‌సీడ్ (కనోలా) నూనె, రైస్‌బ్రాన్ నూనెల్లో మోనోఅన్‌శాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.
* సన్‌ఫ్లవర్, కుసుమనూనె, సోయాచిక్కుడు నూనె, పత్తిగింజలు నూనె, మొక్కజొన్న గింజలనూనెల్లో పాలిఅన్‌శాచురేటెడ్ ఆమ్లాలుంటాయి.
* మార్గరిస్, డాల్డా (వనస్పతి)లో ట్రాన్స్‌ఫాట్స్ ఎక్కువుంటాయి.
శాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు రక్తంలో టోటల్ కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్ పరిమాణాన్ని పెంచి, ధమనుల్లో రక్తప్రసరణకు అడ్డుపడి గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని పెంచుతాయి.
* మోనోఅన్‌శాచురేటెడ్ ఫాటీ ఆమ్లాలు రక్తంలో చెడు కొలెస్టిరాల్‌ను తగ్గించడం ద్వారా గుండెకు మేలుచేస్తాయి. మంచి కొలెస్టిరాల్‌పై ప్రభావం చూపవు.
*పాలిఅన్‌శాచురేటెడ్ ఆమ్లాలు రక్తంలో చెడు కొలెస్టిరాల్‌ను తగ్గించడంతోపాటు మంచి కొటెస్టిరాల్‌ను కూడా తగ్గిస్తాయి.
* ట్రాన్స్‌ఫాట్స్ రక్తంలో చెడు కొలెస్టిరాల్, ట్రైగ్లిసరైడ్స్ పరిమాణాన్ని పెంచుతాయి. మంచి కొలెస్టరాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. స్థూలంగా ఇవికూడా గుండెకు, ఇతర రక్తప్రసరణ వ్యవస్థకు హానికరం.
డిస్‌లిపిడిమియా చికిత్స
అమెరికన్ డయాబెటిస్ ఆసోసియేషన్ సిఫార్సు ప్రకారం డయాబెటిక్ డిస్‌లిపిడిమియా చికిత్సలో ప్రథమ ప్రాధాన్యత. ఎల్‌డిఎల్ కొలస్టరాల్ స్థాయిని తగ్గించడంగానూ, తర్వాత ప్రాధాన్యత హెచ్‌డిఎల్ కొలెస్టరాల్ స్థాయిని పెంచడం గానూ, ఆ తర్వాత ప్రాధాన్యత ట్రైగ్లిసరైడ్స్ స్థాయిని తగ్గించ డంగానూ సూచించబ డుతుంది.
ఆహార నియమాలు : మధుమేహంలో ఉండే డిస్‌లిపిడిమియా చికిత్సలో మొదటి ప్రాధాన్యత ఆహారని యమాలతో నియంత్రించడానికి ప్రయత్నించడం. కేవలం మధుమేహ నియంత్రణకోసమే కాక, డిస్‌లిపిడిమియా నియంత్రణకు కూడా ఆహారనియమాలు ఉపయో గపడతాయి. శాచురేటెడ్ ఫాట్స్ మొత్తం కేలరీలో 7 శాతానికి తగ్గించాలి. ట్రాన్స్‌ఫాట్స్‌ను పూర్తిగా మినహాయించాలి. ఆహారంలో కొలెస్టరాల్ తక్కువగా తీసుకోవడం, పీచును ఎక్కువగాతీసుకోవడం వంటి చర్యలు పరిస్థితిని నియంత్రించడానికి దోహదం చేస్తాయి.
వ్యాయాయమం : క్రమం తప్పని, తగినంత వ్యాయామం, డిస్‌లిపిడిమియా నియంత్రణకు తోడ్పడుతుంది. ప్రత్యేకించి వ్యాయామం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పరిమాణం తగ్గడం, మేలుచేసే హెచ్‌డిఎల్ కొలెస్టరాల్ పెరగడం వంటి ఫలితాలు సాధించొచ్చు. అలాగే వ్యాయామం కొంతమేరకు ఎల్‌డిఎల్ కొలెస్టరాల్‌ను తగ్గిస్తుందని నిరూపించబడింది.
మందులు : ఆహార నియమాలతోపాటు సుమారు 90 శాతం రోగులలో డిస్‌లిపిడిమియా నియంత్రణకు మందుల వాడడం తప్పనిసరి. డాక్టర్ పర్యవేక్షణలోనే మందులు వాడాలి.
డిస్‌లిపిడిమియా
మధుమేహ వ్యాధిలో ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా, రక్తంలో అధిక పరిమాణంలో ఉండే గ్లూకోజ్ నిల్వల వలన ఫాటి ఆమ్లాల మెటబాలిజం ప్రభావితమై పలురకాల కొవ్వుపదార్థాల పరిమాణల్లో, పాళ్లలో సాధారణంగా ఉండాల్సిన సమతుల్యత లోపిస్తుంది. దీన్నే డయాబెటిక్ డిస్‌లిపిడిమియా అంటారు. ప్రధానంగా డయాబెటిస్ రోగుల్లో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉండడం, మంచి కొలెస్టరాల్ తక్కువ ఉండడం అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. మొత్తం మధుమేహరోగుల్లో 50 శాతం మందిలో రక్తంలో వివిధ కొవ్వుపదార్థాల పాళ్లలో సమతుల్యత లోపిస్తున్నట్లు తెలియజేస్తున్నాయి. అయితే మధుమేహరోగుల్లోనే కాకుండా ఇటువంటి కొవ్వుపదార్థాల పరిమాణాల్లో సమతుల్యత లోపించడం ఇతర కొన్ని వ్యాధిస్థితుల్లో కూడా సంభవిస్తుంది. మూత్రపిండాల వ్యాధి, హైపోథైరాయిడిజం, జన్యుసంబంధ లైపోప్రోటీన్ వ్యాధుల్లో కూడా డిస్‌లిపిడిమియా గమనించొచ్చు.
కొలెస్టరాల్
కొలెస్టరాల్ మనం తీసుకునే ఆహారంలోనూ లభ్యమవుతుంది. శరీరంలో కాలేయం, ఇతర అవయవాల్లోనూ తయారవుతుంది. కొలెస్టరాల్ రక్తంలో కరగదు కాబట్టి ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్ అనే లైపోప్రోటీన్స్‌తో కలిసి రవాణా అవుతుంది. ఎల్‌డిఎల్ కొలెస్టరాల్ ధమనుల్లో పేరుకుని రక్తప్రసరణకుఅడ్డుపడి గుండెపోటు, పక్షవాతం, పెరిఫరల్ వాస్కులర్ డిసిజెస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి దీన్ని చెడు కొలెస్టరాల్ అంటాం. హెచ్‌డిఎల్ కొలెస్టరాల్ రక్తంలోని,పరిధీయ కణాల్లోని కొలెస్టరాల్‌ను కాలేయానికి రివర్స్ ట్రాన్స్‌పోర్ట్ చేయడం ద్వారా గుండెకుమంచి చేస్తుంది కాబట్టి దీన్ని మంచి కొలెస్టరాల్ అంటాం. ట్రెగ్లిసరైడ్స్ అనే కొవ్వు పదార్థం మనం తీసుకునే ఆహారంలోనూఉంటుంది. అలాగే ఆహారంలో లభించే అదనపు శక్తి శరీరంలో ట్రైగ్లిజరాయిడ్స్‌గా మార్చుతుంది. ట్రెగ్లిసరైడ్స్ రక్తంలోని కైలోమైక్రాన్స్, విఎల్‌డిఎల్ (వెరీ లో డెన్సిటి లైపోప్రోటీన్స్) అనే లైపోప్రోటీన్స్‌తో కలిసి రవాణా అవుతుంది. ట్రెగ్లిసరైడ్స్ కూడా రక్తంలో అధికపరిమాణంలో ఉన్నప్పుడు రక్తప్రసరణకు అడ్డుపడడం ద్వారా హానీ చేస్తాయి. ఒక్కోసారి పాన్‌క్రియాటైటిస్ వ్యాధికి దారితీయవచ్చు.
హాని చేస్తాయా ?
నిర్దిష్టమైన పరిమాణం కంటే అధిక పరిమాణాల్లో కొవ్వు పదార్థాలు శరీరంలో చేరినప్పుడు పలు దుష్ఫలితాలు కలుగుతాయి.
* చెడు కొలెస్టరాల్‌గా పిలిచే ఎల్‌డిఎల్ కొలెస్టరాల్ రక్తంలో ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడలపై చేరి పెంకులా ఏర్పడుతుంది. ఇది ధమనులు మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా గుండె కండరానికి రక్తసరఫరా చేసే కొరొనరీ ధమనులు మూసుకుపోయి గుండెపోటు, మెదడులోని భాగాలకు రక్తసరఫరా చేసే ధమనులు మూసుకుపోయి పక్షవాతం వస్తుంది. కాళ్లకు రక్తం సరఫరా చేసే ధమనులు మూసుకుపోయి ఫెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులొస్తాయి.
* ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా చేరినప్పుడు ఆక్యూట్ పాన్‌క్రియాటైటిస్ అనే వ్యాధికి దారితీయొచ్చు.
* వెజిటబుల్ ఆయిల్స్‌ను కృత్రిమంగా హైడ్రోజనేట్ చేయడం ద్వారా తయారయ్యే ట్రాన్స్‌ఫాట్స్ కూడా గుండెకు హానిచేస్తాయి.
*కొవ్వుకు సంబంధించిన వ్యాధులైన లైపోమా, లైపోసార్కోమా అనే గడ్డలుగా ఏర్పడొచ్చు.
వంట నూనె
వంట చేయడానికి ఏ వంటనూనె వాడాలి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రపంచంలో పలు దేశాల్లో, పలు ప్రాంతాల్లో పలు రకాల వంటనూనెలు సాంప్రదాయబద్దంగా వాడకంలో ఉన్నాయి. వీటి వాడకం వల్ల ఆయా ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఉదాహరణకు మెడిటెరేనియన్ ప్రాంతంలో ఆలివ్‌నూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ ప్రజల్లో గుండెపోటు వంటి వ్యాధులు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే బంగ్లాదేశ్, మన దేశంలోని పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో ఆవనూనె ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల కూడా సాపేక్షంగా గుండెపోటు వంటి వ్యాధులు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అలాగే మనదేశంలోని కేరళ ప్రాంతంలో వంటనూనెగా వాడే కొబ్బరినూనె వల్ల గుండెపోటు వంటి వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండటమే గాక, ఇన్సులిన్ నిరోధకపై కూడా దుష్ప్రభావం చూపుతుందని కొట్టాయంలోని ఎంజి విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.కనుక ఎలాంటి వంటనూనె వాడాలనే దానికి సమాధానం శాస్త్రీయంగా చెప్పాలంటే అసలు మనం వాడే వివిధ వంటనూనెల్లో ఏయే రకాల ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయో తెలుసుకోవాలి.
లిపిడ్ ప్రొఫైల్
ఒక వ్యక్తి రక్తంలో వివిధ రూపాల్లో ఉండే కొలెస్టరాల్, ఇతర కొవ్వు పదార్థాల పరిమణాన్ని లెక్కించడానికి చేసే పరీక్షలను లిపిడ్ ప్రొఫైల్ అంటాం. ప్రత్యేకించి మధుమేహ రోగుల్లో 6 నెలలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్షించుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తారు. లిపిడ్ ప్రొఫైల్‌లో టోటల్ కొలెస్టిరాల్, ఎల్‌డిఎల్ కొలెస్టిరాల్, హెచ్‌డిఎల్ కొలెస్టారాల్, ఎల్‌డిఎల్, హెచ్‌డిఎల్ నిష్పత్తి, కైలోమైన్స్, విఎల్‌డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ పరీక్షిస్తారు.

0 Comments