Full Style

>

How far exercise necessary for health?-వ్యాయామము ఆరోగ్యానికి ఎంత అవసరము?


How far exercise necessary for health?-వ్యాయామము ఆరోగ్యానికి ఎంత అవసరము?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మనము జీవించాలంటే  శ్వాసించడము , తినడము , నిద్రించడము లాగే కొంత వ్యాయామము కూడా అవసరము . పసిపిల్లలకు తొలిరోజుల్లో  రోదనము  ఆరోగ్యము . ఎదుగుతున్న, వయస్సు నిండి వృద్దాప్యము దాకా జీవితపు అన్ని అవస్థలలోనూ దానికి తగ్గ వ్యాయామము అవసరము .ప్రతి ఒక్కరికీ వ్యాయామము అవసరము . వ్యాయామము చేయడము వలన ఎన్నో అనారోగ్య పరిస్థితులనుండి విముక్తి పొందగలము . పలానా వ్యాయామము చేయాలా? ఏది చేస్తే బాగుంటుంది . రోజులో ఎప్పుడు చేయాలి ... ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమయ్యే వ్యాయామానికి ఒక పద్దతి , టైమ్‌ అంటూ ఏమీ అవసరము లేదు. శరీర కదలికలు . చెమటపట్టే వరకు సుమారు 30-45 నిముషాలు వారానికి 5 రోజులు మనకి నచ్చిన వ్యాయామము చేయవచ్చును. నడక , తోటపని, ఆటలు ఆడుకొనుట (టెన్నిస్ , బేట్మింటన్‌ , షటిల్ కాక్ , రింగ్ టెన్నిస్ , కబటి ,వాలీబాల్  మున్నగునవి . చివరికి ఇల్లు ఊడ్చడము , బట్టలు ఉతకడము , ఇంటిపనులు చేసుకోవడమూ కూడా వ్యాయామాలే .

బహుశా పూర్వము మనిషికి ఇప్పుడున్నంత వత్తిడి, చెడు ఆలోచనలు ఉండేవికావు . . . కాబట్టి శరీరము పై చెడుప్రభావము లేకుండా ఉండి ఉండవచ్చు. కాని ప్రస్తుతము పగలు , రాత్రులు ఉద్యోగము చేసి ఏదో ఒకటి  తినేసి జీవించే ఈ నాటి జీవన విధానానికి తప్పకుండా వ్యాయామము అవసరము .అదీ మనకి అవసరమైనంతవరకే చేయాలి. మనము దేసే ఉద్యోగాలలో 80% కుర్చీలో కూర్చుని చేసేవే . మరికొంతమందికి వ్యాయామమే కాని శరీరశ్రమ చాలా తక్కువ . వాహనాల సౌకర్యము రోజురోజుకీ ఎక్కువ అవడము వలన సాధారముగా మనము చేసుకునే కొద్దిపాటి శ్రమను కూడా చేయలేకపోతున్నాము . దానివలన చిన్నవయసులోనే లావు అవడము , కీళ్ళనొప్పులకు గురి అవడము , అజీర్ణము తో బాధపడడము , పొట్ట బాగా పెరగడము ఇలా ఎన్నో ఇబ్బందులు ... దానికి పరిష్కారము సరైన వ్యాయామము స్త్రీ ,పురుషులిద్దరికీ అవసరము .
మనకి కావల్సిన మంచి కొలెస్ట్రాల్ ' HDL' ను పెందుతుంది.
చర్మము యొక్క రక్తప్రసరణ పెంచి కాంతివంతము చేస్తుంది.
బి.పి.ని తగ్గిస్తుంది, మధుమేహ వ్యాదిని అదుపులో ఉంచుతుంది.
శరీరములోని వివిధ అవయవాలకు ప్రాణవాయువును చక్కగా అందిస్తుంది.
పక్షవాతము , గుండె పోటు .. వంటి ఎటాక్స్ రాకుండా కాపాడుతుంది.
ఎముకల పటిస్టతను బలపరుస్తుంది.
శరీరము లో ఫ్రీ రాడికల్స్ ... వ్యర్ధపదార్ధాలను విసర్జించే ప్రక్రియను వేగవంతము చేస్తుంది .
కేలరీల శక్తి ఉపయోగించడము వలన బరువు పెరిగే అవకాశము , ఊబకాయము నివారించవచ్చును .



Post a Comment

0 Comments