యోగ , Yoga
యోగము అంటే ఏమిటి?
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాళ ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధీంచడంవలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి.వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు
అలసట, ఆందోళన, ఒత్తిడి, తీవ్ర ఒత్తిడి (హైపర్ టెన్షన్), ప్రతి దానికి ఒత్తిడికి గురవటం..... మాటలేమో ఎదుటివారితో, ఆలోచనేమో మరెక్కడో, ప్రతిదానికి విసుగు, కోపం.... వీటితో లెక్కకు మించిన అనారోగ్యాలు....... అలాంటి టెన్షన్‌సను తగ్గించుకుని శరీరాన్ని, మనసును ఓ దగ్గర ఉంచుకోలేకపోవటం, మనసు మీద పట్టులేకపోవటం. ఇలాంటి వాటిని అధిగమించడానికి పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసిక పరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగ పద్దతులతో పాటు అంతకుముందు కొన్ని ప్రాచీన యోగ పద్దతులను కూడా పాటించేవారు.
యోగాసనాలు :
యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.
ధ్యానం
ధ్యానం అంటే ఏదో ఒక సుఖవంతమైన స్థితిని కనుగొనడం కాదు. దేన్నో వెంపర్లాడి వెతికి పట్టుకోవడం కాదు. అన్ని వెంపర్లాటలు అంతం కావడమే ధ్యానం. ధ్యానం చేసి ఏదో అద్భుతమైన శక్తిని, అనుభవాన్ని పొందాలనుకోవడం ధ్యానం కిందికి రాదు.
ధ్యానం అంటే ఏమిటి..? ఎలా చేయాలి..?
ఏకాగ్రతను ఎడతెగకుండా పొడిగించడాన్నే ధ్యానం అంటారు. ఈ ధ్యానాన్ని నాలుగు ఆసనాల ద్వారా చేయవచ్చు. అవి.. వజ్రాసనం, స్వస్తికాసనం, పద్మాసనం, సిద్థాసనం. ఈ నాలుగు ఆసనాల్లో పద్మాసనం చాలా శ్రేష్టమైనది మరియు సులభమైనదిగా చెపుతారు. అలాగే వజ్రాసనం, స్వస్తికాసనాలు కూడా చాలా ఉపయుక్తమైనవి. ఇక యోగులకు అనువైన ఆసనం సిద్ధాసనం.
ఈ ఆసనాల ద్వారా చేసే ధ్యానంతో బహిర్గత విషయములపై అంతర్గత విషయాలపై, సూక్ష్మ విషయాలపై వరుస క్రమంలో చేసినట్లయితే మనస్సును తటస్థీకరించుట సాధ్యమవుతుంది. ఇలా సాధన చేయడం ద్వారా ఏ సమస్యనైనా అవలీలగా అధిగమించగల శక్తి ఒనగూరుతుంది.
సూర్య నమస్కారాలు
యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్ధ్హానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ.
* ఆరోగ్యానికే కాదు... శృంగారానికీ భేషైన ఔషధం యోగా అంటున్నారు నిపుణులు. దాంపత్యజీవితాన్ని రసరమ్యం చేయడంలో యోగా చక్కటిపాత్ర పోషిస్తుందని హామీ ఇస్తున్నారు. వారు చెప్పిన ప్రకారం...
* రోజూ యోగా చేయడం వల్ల ఒత్తిళ్లూ ఆందోళనలూ తగ్గుతాయి. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా శృంగార పటుత్వం పెరుగుతుంది.
* కొన్ని రకాల ఆసనాలు వేయడం ద్వారా మహిళల పొత్తికడుపు కండరాలు బలపడతాయి. దానివల్ల భావప్రాప్తిలో ఆనందం మరింత పెరుగుతుందని గతంలో చాలా పరిశోధనల్లో తేలింది.
* ఆసనాలు వేయడంలో రకరకాల కదలికల కారణంగా శరీర సౌష్ఠవం పెరుగుతుంది. విభిన్న భంగిమల్లో శృంగారసౌఖ్యాన్ని పొందేందుకు వీలుగా తయారవుతుంది.
ఇవి మంచివి: యోగాలో ప్రత్యేకించి కొన్ని ఆసనాలు శృంగారజీవితంలో ఆనందాన్ని పెంచుతాయి. అవి... పద్మాసనం, ఉద్దియాన బంధం, హలాసనం, మత్స్యాసనం, సర్వాంగాసనం ఇలా చాలానే ఉన్నాయి.

శృంగారానికీ యోగా

0 Comments