Full Style

>

పెరుగు ఎంత ఎక్కువగా తింటే అంత చురుకుదనం మీలో..




పాలలో కన్నా పుల్లటి పెరుగులో క్యాల్షియం శతం ఎక్కువ. ఒక కప్పు(250mg) పెరుగు లో370 mg కాల్షియం ఉంటుంది. పెరుగులో విటమిన్ బి, పాస్ఫరస్, పొటాసియం, మాంసకృత్తులు సంవృద్ధిగా ఉంటాయి. పుల్ల పెరుగు అరటిపండుతో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది. కాల్షియం మనలో ఉత్సాహాన్ని పెంచే న్యూరోవూటాన్స్‌మిటర్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 

కాబట్టి పెరుగు ఎంత ఎక్కువగా వినియోగిస్తే అంత చురుకుగా ఉండొచ్చు. పొట్టచుట్టూ కొవ్వు.. పెరుగుతో తగ్గు కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం. పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది.
రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు.. శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచండి.

 

Post a Comment

0 Comments