Full Style

>

ఇవి తింటే డాక్టర్ అవసరముండదు...


  సాధారణంగా రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చెబుతుంటారు. కాని అన్ని కాలాల్లో లభించే టమాటోలు తీసుకుంటే డాక్టరు తో అవసరముండదని చెప్పవచ్చు. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచీస్తుంది. టమాటలో లైకోపిన్ ఎక్కువ. తక్కువ కేలరీలు గల టమోటాలు చర్మం, కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. 
వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి. టమోటాలు తరచుగా తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌. ఈ యాంటీఆక్సిడెంట్ వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. టమాటలను ఆలీవ్ నూనెతో కలిపి తింటే మరింత మంచిది. ఆలీవ్ నూనె లైకోపిన్ రసాయన ప్రక్రియలో సహాయపడుతుంది.

 

Post a Comment

0 Comments