పచ్చికోబ్బరిలో పోషక విలువలు అధికము. కొబ్బరి నీళ్లు , పాలు మంత్ర జలంలా పనిచేస్తాయి. దీనిలో విటమిన్ ఎ,బి, సి, రైబోఫ్లెవిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి, కొబ్బరికాయ ముదిరిపోయక లోపల పువ్వు వస్తుంది. అది గర్భాశాయానికి మేలు చేస్తుంది. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు.
శరీరానికి చల్లదనం లభిస్తుంది గొంతులో మంట, నొప్పిగా ఉన్నప్పుడు
కొబ్బరిపాలు తాగితే తగ్గుతుంది. మెదడు ఆరోగ్యానికి, చురుకుదనాన్ని
పెంపొందించే ట్రైగ్లిజరైడ్లు ఈ పచ్చికొబ్బరిలో ఉన్నాయి. కాబట్టి కొబ్బరిని
కూడా విరివిగా ఉపయోగించడం ద్వారా బద్దకాన్ని వదిలించుకోవచ్చు.
0 Comments