Full Style

>

ఆయిల్ పుల్లింగ్ చేయండి తాజా శ్వాసతో జీవించండి!!!


 


జీవన విధానంలో చాలా మంది తమ ఆరోగ్యం గురించి చాలానే జాగ్రత్తలు తీసుకొంటారు. అందుకోసం వ్యాయామం, డైయట్ వంటి వాటిని ఫాలో అవుతూ శరీరంలో ఉన్న టాక్సిక్ రసాయనాలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మంచి ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ తీసుకొంటూ, జంక్ ఫుడ్ ఆవాయిడ్ చేయడం చాలా ప్రయోజనకరం. మంచి ఆరోగ్యకరమైన శరీరానికి ఆహారం, వ్యాయమం మాత్రమే కాదు, అప్పుడప్పుడు కొన్ని చిన్ని చిన్న చిట్కాలను పాటిస్తుండాలి. అందుకు కొన్ని నిర్ధిష్ట పదతులు కూడా ఉన్నాయి. అందులో ఆయిల్ పుల్లింగ్. చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ దాని ప్రయోజనాలు, ఉపయోగించే విధానం తెలియక ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉంటారు. అయితే ఆయిల్ పుల్లింగ్ గురించి తెలుసుకొందాం...

కేవలం ఒక స్పూను నూనె వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటే ఆశ్చర్యంగానే వుంటుంది. ఎలాంటి చికిత్స, ఖర్చు లేకుండా దినచర్యలో ఒక భాగంగా ఆయిల్‌ పుల్లింగ్‌ చేశామంటే రోగాలు ఆమడదూరంలో వుంటాయి. పరిశుభ్రమైన, శుద్ధిచేయబడిన సన్‌ ప్లవర్‌ ఆయిల్‌, వేరుశనగ, కొబ్బరి నూనె, నువ్వుల నూనెలలో ఏదో ఒకటి ఒక టేబుల్‌ స్పూన్‌ పరిమాణంలో నోటిలో వేసుకొని, నోటి భాగమంతా, పళ్ళ సందుల మధ్య తిరిగేలా పదిహేను నుండి ఇరవైనిమిషాల దాకా పుక్కిలించాలి. ఆ విధంగా చేసిన తర్వాత నోటిలోని నూనె ద్రవంలా తయారవుతుంది. దాన్ని బయటకు ఉమ్మివేసి పళ్ళను,నోటిని శుభ్రపరచుకోవాలి.
ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి:
1. నిద్రలేవగా మొదటి చేయవలసిన పని ఆయిల్ పుల్లింగ్. రోజులో ఖాళీ కడుపువుండే సమయంలలో పై విధంగా చేయాలి. మిగిలిన టైమ్ లో కంటే ఉదయమే చాలా మంచిది.
2. ఉదయాన్నే నిద్ర లేవగానే బ్రెష్ చేసుకొని, నీటితో నోటిని బాగా శుభ్రం చేసి ఆ తర్వాత ఈ విధంగా మొదలు పెడితే మంచిది. 3. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని నోట్లో నింపుకోవాలి. నోటి భాగమంతా, పళ్ళ సందుల మధ్య తిరిగేలా పదిహేను నుండి ఇరవైనిమిషాల దాకా పుక్కిలించాలి. ఆ విధంగా చేసిన తర్వాత నోటిలోని నూనె ద్రవంలా తయారవుతుంది. దాన్ని బయటకు ఉమ్మివేసి పళ్ళను,నోటిని శుభ్రపరచుకోవాలి.
4. ఆయిల్ పుక్కలించేటప్పుడు మింగకూడదు, అలా పీలింగ్ ఉన్న రెండు నిమిషాల పాటు ముక్క ద్వారా చిన్న శ్వాస వదిలి, తీసుకోండి. ఒక వేళ అసౌకర్యంగా అనిపించిన వెంటనే ఉమ్మి వేసి నోటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక రోజు ప్రయత్నం చేయాలి.
5. ఆయిల్ పుల్లింగ్ చేసిన ప్రతి సారి డిఫరెంట్ ఆయిల్ ను ఉపయోగించాలి. నోటిలో ఉన్న టాక్సిన్స్ ను సులభంగా వదలగొడుతుంది. కాబట్టి వారంలో ఒక్కసారైనా ఇలా చేసి చూడండి మీ నోటి శుభ్రతతో పాటూ పండ్లు శుభ్ర పడి ఆరోగ్యంగా ఉండేందు సహయకరిస్తుంది.
ఆయిల్ పుల్లింగ్ వల్ల ఉపయోగాలు:
1. మన నోరు బాక్టీరియాలకు పుట్టినిల్లు. ఆయిల్‌ పుల్లింగ్‌ విధానంవల్ల క్రిములు, బాక్టీరియా నాశనమై, నోరు శుభ్రపడటమే గాక, మ్యూకస్‌ మెంబ్రేన్‌ ద్వారా శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలు బయటకు నెట్టబడుతాయి. రక్త ప్రసరణ భాగాలకు ఎలాంటి అడ్డులేకుండా దారి సుగమమై రక్తసరఫరా సక్రమంగా వుండేలా తయారవుతాయి. శరీరంలోని ఏ విభాగమైనా రక్తసరఫరా లోపం వల్ల బలహీన పడితే, పై విధానంవల్ల తేరుకొని ఉత్తేజాన్ని పొందుతాయి. వయసుతో నిమిత్తం లేకుండా దీన్ని అన్ని రకాల జబ్బులున్న వాళ్ళు పాటించవచ్చు.
2. జలుబు, దగ్గు, అస్తమా , బ్రాంకైటిస్‌, పంటి నొప్పులు, తలనొప్పి,చెవి, కంటి జబ్బులు, సైనసైటిస్‌ , మలబద్ధకం, బి.పి, ఊపిరి, నరాల వ్యాధులు, అల్సర్‌, ట్యూమర్లు, స్త్రీ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, మరెన్నో వ్యాధులు మనల్ని దరిచేరకుండా చూసుకోవచ్చు. దంత క్షయం, చెడు శ్వాస నివారణ కోసం, చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని అరికడుతుంది. పెదువులు, నోరు మరియు గింతు పొడిబారడం వంటి సమస్యలను నివారిస్తుంది. దవడప్రాంతంలో ఏర్పడ్డ సాదారణ పుండ్లును సులభంగా నయం చేస్తుంది. పీచుపదార్ధాలున్న కాయలు, పళ్ళు, కూరగాయలు, తక్కువ శాతంలో వున్న నూనె, క్రొవ్వు, చక్కెర, ఉప్పు పదార్థాల్ని తీసుకుంటే మంచిది. సర్వరోగ నివారిణి జలం. మనిషి ఆరోగ్యాన్ని కాపాడే రసాయనం జలం. మంచినీరు ఏరంగంలో వుంటాయో, మూత్రం అదే రంగులో వచ్చేటట్లు నీరు త్రాగుతూ వుంటే చాలా జబ్బులు నయం అవుతాయి.

Post a Comment

0 Comments