మనిషి ఆరోగ్యముగా ఉల్లాసముగా వుండాలంటే ఎలాంటి ఆహారము తీసుకోవాలి? ఎలాంటి
దిన చర్య పాటించాలి? అధిక బరువు తగ్గాలన్నా, షుగరు వ్యాధిని
అరికట్టాలన్నాఎటువంటి ఆహారం తీసుకోవాలి. డయాబెటీస్ వ్యాధి వచ్చిందంటే, ఏ
ఆహారాలు తినాలి? ఏవి తినరాదు అనేది అందరికి సందేహంగా ఉంటుంది. ముఖ్యంగా
పండ్లు విషయంలో చాలా మంది అన్ని రకాల పండ్లకు దూరంగా ఉంటున్నారు. కారణం
వ్యాధిగురించి పూర్తిగా తెలుసుకోక పోవడం, అధికంగా ఆందోళన చెందడంతో షుగర్ ను
కంట్రోల్ చేయాలనే నెపంతో తినదగిన వాటికి కూడా దూరంగా ఉంటూ శరీరంలోని
కాలరీలను పూర్తి పోగొట్టుకొంటూ షుగర్ మరింత ఎక్కువ చేసుకుంటున్నారు.
కాబట్టి షుగర్ పేషంట్స్ ఎటువంటి పండ్లను తీసుకోవాలో చూద్దాం...
ఎర్రని ద్రాక్ష: ఎర్రని ద్రాక్ష అంటే ఆరెంజ్ లేదా స్వీట్ లైమ్ ను గుర్తు చేస్తుంది. అయితే ఇది తియ్యగా, పుల్లగా, జ్యూసీగా ఉంటుంది. ఈ పండ్లు మధుమేహవ్యాధుగ్రస్తులకుల మంచి ఆరోగ్యకరమైన ఆహరం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు.. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా సాయపడుతూ గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తాయి
బెర్రీస్: క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది
పుచ్చకాయ: పుచ్చకాయ (వాటర్ మెలోన్), మస్క్ మెలోన్, లేదా హనీడ్యూ ఇవన్నీ ఒకే జాతికి చెందినటువంటి పండ్లు. వీటిలో విటమిన్ బి మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే బీటా కెరోటి, పొటాషియం మరియు లైకోపిపిన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యాన్నికి చాలా మంచిది. మీ శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి కావలసినన్ని విటమిన్లు అంధిస్తుంది.
చెర్రీస్: చెర్రీ పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక వాపు, కీళ్ళనొప్పులు, కీళ్ళ వాపు వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రోజుకు రెండుసార్లు చెర్రీపండ్ల రసాన్ని తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు 12 చెర్రీ పండ్లను తీసుకోవచ్చు
పీచెస్: ఇవి చూడటానికి వెల్ వెట్ కలర్ లో ఉంటాయి. అందులో వీటిలో విటమిన్ ఎ మరయు విటమిన్ సి లు అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, తక్కువ. ఫైబర్, పొటాషియం అధికం.
ఆప్రికాట్ : ఆప్రికాట్ ఒక డ్రై ఫ్రూట్ , ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ.ఈ ఫలము మధుమేహ రోగులకు మేలుచేస్తుంది. తీపిపదార్ధాలు తినాలనే కోఇకను తగ్గిస్తుంది. దీనిలోని రసాయనాలు శరీరములో ఉన్నటువంటి చెక్కెరలను నియంత్రిస్తాయి. అప్రికాట్ లోని బీటా కెరోటిన్ కంటికి, రోమాలకు, చర్మానికి, మేలుచేస్తుంది. ఒకటి, రెండు అప్రికాట్లను తింటే శరీరానికి కావాలసిన దినవారి విటమిన్ 'ఎ' సగం లభ్యమౌతుంది.
ఆరెంజ్: చక్కగా తినేసి జీర్ణం చేసుకోగల ఫలం కమలాఫలం. ఆరెంజ్ రంగులు చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపించే పండు కమలాపండు. నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి.
కివీ పండ్లు: కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అత్యధికము గా బీటా కెరోటిన్ ఉన్నందున మంచి యాంటీ ఆక్షిడెంట్ గా ఉపయోగపడును. కివి పండులోని ఫైటోకెమికల్ ‘లుటెయిన్' ప్రోస్టేట్ గ్రంధి, కాలేయ క్యాన్సర్ లను నిరోధించును. కివిపండు తొక్కలో ఉండే ఫ్లావనాయిడ్ యాంటీఆక్షిడెంట్ శరీరములోని ఫ్రీరాడికిల్స్ ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడును.
యాపిల్: యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటంవల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమవుతుంది. అలాగే, సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గటానికి కారణమవుతుంది.
0 Comments