Full Style

>

గుండెనొప్పికి కారణం అవుతున్న కార్పోరేట్ కల్చర్...


భారీకాయాన్ని సైతం నియంత్రించగల శక్తి గుప్పేడంత గుండెకు ఉంది. "లబ్ డబ్" అంటూ మనిషి జీవితాన్ని అనుక్షణం కాపాడే చిన్ని గుండెకు జబ్బు చేస్తే.... ఆగిపోతే... మనిషి మనుగాడే ప్రశ్నార్థకమవుతుంది. గుండెకు జబ్బు చేయడానికీ, ఆగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ పురుషులకే గుండె జబ్బులు అధికంగా వస్తాయన్న అపోహ ఉండేది. అది నిజం కాదని అంటున్నారు కార్డియాలజిస్టులు. గుండె జబ్బులు స్త్రీలకైనా, పురుషులకైనా ఒకటే. అయితే ఇప్పటి వరకు పురుషుల కుండే అలవాట్లు, వారి జీవన సరళి గుండె జబ్బులు రావడానికి దోహద పడ్డాయి.

స్త్రీల జీవన విధానంలో పెను మార్పులు వచ్చాయి. కార్పోరేట్ కల్చర్ అభివృద్ది చెందినా ఈ పదేళ్ళ కాలంలో పురుషులతో పాటు స్త్రీలూ ధూమపానం, మధ్య పానం చేస్తున్నారు. ఈ అలవాట్లే కాకుండా పని ప్రదేశాలలో ఒత్తిడి కూడా వారికీ గుండెజబ్బు రావడానికి కారణమవుతోందని వైద్యులు చెపుతున్నారు హస్పిటల్స్ లోని కార్డియాలజీ విభాగానికి వచ్చే రోగులలో పురుషులతో సమ౦గా స్త్రీల సంఖ్య కూడా ఉంటోంది. సగటున ప్రతి రోజూ 40మంది స్త్రీలు హాస్పిటల్స్ లోని హృద్రోగ విభాగానికి వస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
కారణాలు:
గుండెజబ్బులు రావడానికి కారణాలను డాక్టర్లు కింది విధంగా విశ్లేషిస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, మందు తాగడం, శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడ౦, ఉబకాయం ఇవన్నీ గుండెజబ్బులకు దారితీస్తాయని వైద్యులు చెపుతున్నారు. దశాబ్ద కాలం క్రితం వరకూ ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య కూడా ఉంటోంది. దీనికి ఒకటే కారణం అంటున్నారు నిపుణులు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా సిగరెట్లు, మద్యం తాగడం.
గతంలో 40సంవత్సరాల తరువాతే గుండెజబ్బుతో హాస్పిటల్ కి వెళ్ళేవారు. ఇప్పుడు 20 సంవత్సరాల వయస్సు వారికీ కూడా గుండెజబ్బులు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.
హార్ట్ ఎటాక్ వచ్చే సూచనల విషయంలో పురుషులకు, స్త్రీలకూ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. చాలా మంది స్త్రీలలో చిన్న వయస్సులోనే గుండె జబ్బు సూచనలు కనిపించినా దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఆడపిల్లల్లో 12 నుంచి 20 సంవత్సరాల వయస్సులో గుండెలోని వాల్వ్ లు దెబ్బతింటూ ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, బాక్టీరియాల్ ఇన్ఫెక్షన్, జ్వరంతో పాటు కీళ్ళలో నొప్పులు గుండెజబ్బుకు సంకేతంగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ ఆరోగ్య సమస్యలను సాధారణమైనవిగా భావించి వైద్యం చేయించుకుంటారే తప్పించి గుండె నిపుణుడిని సంప్రదించాలని అనుకోరని వైద్యులు చెపుతున్నారు. అతి సాధారణంగా కనిపించే ఈ ఆరోగ్య సమస్యలే కొన్ని సందర్భాలలో ప్రాణాంతకమైన గుండెజబ్బుకి దారి తీస్తాయని వారు అంటున్నారు. ఈ సమస్యతో బాధపడే ఆడపిల్లలు గుండె నిపుణుని తప్పని సరిగా సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.
సాధారణంగా స్త్రీలు కరోనరీ ఆర్టరీ డిసీజెస్(సిఎడి)తోనే హాస్పిటల్ కి వస్తున్నారని వైద్యులు చెపుతున్నారు. రోగి రక్తనాళాలు బ్లాక్ అయి గుండెకు రక్తం అందకపోవదాన్నే వైద్య పరిభాషలో సిఎడి అంటారు. నలభై సంవత్సరాల్ వయస్సులోపు స్త్రీలే సిఎడితో భాధడుతున్నారని ఇటివల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అయితే స్త్రీలే సిఎడితో బాధపడుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. స్త్రీలలో ఈ సమసి తలెత్తడానికి ప్రత్యేకించి కారణాలు లేవని వైద్యులు చెపుతున్నారు. వాతావరణ పరిస్థితులు, స్త్రీలలో ధూమపానం, మద్యపానం వంటి కారణాలు సిఎడికి కారణమవుతున్నాయి.
వీటికి తోడూ ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, వేపుడు పదార్థాలు తినడం, ఫైబర్ తక్కువగా ఉండే మాంసం అధికంగా తీసుకోవడంతో పాటు ఉప్పు ఎక్కువగా వాడడం కూడా సిఎడి రావడానికి దోహదం చేస్తున్నాయి. సకాలంలో ఆరోగ్య సమస్యను గుర్తించకపోతే ఏంజీమా లేదా హార్ట్ ఎటాక్ లకు దారితీయవచ్చని వైద్యులు చెపుతున్నారు. వ్యాయామం చేయకుండా, ఏ పని లేకుండా ఉండే స్త్రీలలోనే కరోనరీ ఆర్టరీన్ వస్తోందని వారు అంటున్నారు. పై వారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదిస్తూ, గుండె పరీక్షలు చేయించుకోవాలని వారు సూచిస్తున్నారు. ఏ కొద్దిపాటి నొప్పి అనిపించినా వైద్యుడి దగ్గరకు వెళ్ళాలని వారు సలహా ఇస్తున్నారు.

 

Post a Comment

0 Comments