Full Style

>

గుండె జబ్బులను, షుగర్ వ్యాధులను ధరిచేరనివ్వని స్ట్రాబెరీ


 మెదడుకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు బెర్రీస్ అనే ఈ పండ్లుం ముఖ్యమైనవి . బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి.

 

కాడతో సహా ఉన్న స్ట్రాబెర్రీలను పంచదార కలిపి కానీ, కలపకుండా కానీ దాదాపు సంవత్సరంపాటు నిలవ వుంచుకోవచ్చు. వీటిల్లో వుండే ఫైటోకెమికల్స్‌ వల్ల శక్తి పెరుగుతుంది.బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. మార్కెట్‌లో కనిపించే ఎర్రెర్రటి బెర్రీలను కడుపార ఆరగిస్తే... అందులోని యాంటీ ఆక్సిడెంట్‌ శరీరంలో చేరి ఆరోగ్యాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు.
స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్‌లంటే మీకు చాలా ఇష్టమా.. అయితే స్ట్రాబెర్రీ పండ్లను ఐస్‌క్రీమ్ రూపంలో గాకుండా స్ట్రాబెర్రీ పండ్లను అలాగేనూ లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటే డయాబెటిస్, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వార్విక్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. కార్డియోకు సంబంధిత వ్యాధులు ముఖ్యంగా గుండెపోటుకు చెక్ పెడుతుందని వార్విక్ యూనివర్శిటీ తెలిపింది.
స్ట్రాబెర్రీలోని ఎన్ఆర్ఎఫ్2 మన శరీరానికి కావాల్సిన యాంటియాక్సిడెంట్లును పెంపొందింపజేస్తుందని వార్విక్ పరిశోధకులు తెలిపారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె సంబంధిత రోగాలు దరిచేయకుండా చేయడంలో స్ట్రాబెర్రీ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుచేత వారానికి రెండుసార్లు స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుందని పరిశోధకులు అంటున్నారు.
స్ట్రాబెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మెదడు, నరాల రుగ్మతలు వచ్చే అవకాశాలను సమర్థవంతంగా నిరోధిస్తుంది. రక్తశుద్ధి చేస్తుంది. రక్తంలోని హానికర విష పదార్థాలను తొలగిస్తాయి స్ట్రాబెర్రీలు. ప్రతిరోజూ స్ట్రాబెర్రీలను తినడం వల్ల కాలేయ రోగాలు, కంటిచూపు మందగింపు, వాతరోగం, కీళ్లవాతం, మలబద్దకం, అధిక రక్తపోటు, మెదడు పనితీరు క్షీణించడం, చర్మ క్యాన్సర్ వంటి ఎన్నో రోగాలను దూరంగా ఉంచవచ్చు.
స్పష్టమయిన ఆరోగ్య ప్రయోజనాల సంగతి అలా ఉంచితే, రోజూ 8 నుంచి 10 స్ట్రాబెర్రీలను తినడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని ఇటీవల అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అతిసార, వాతరోగం, జీర్ణక్రియ సమస్యలు స్ట్రాబెర్రీ ఆకులు, వేరులు తినడం వలన నయమవుతాయి. స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున అల్జీమర్స్ (జ్ఞాపక శక్తి తగ్గడం) మెదడు పనితీరు క్షీణించడం వంటి వ్యాధులు వస్తే తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

 

Post a Comment

0 Comments