గుండె సమస్యలు ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల... చేయని వారితో పోల్చితే కోలుకునే అవకాశం మూడురెట్లు ఎక్కువగా ఉందని నెదర్లాండ్స్‌లోని మీండర్ మెడికల్ సెంటర్ డా.ఆరెన్డ్ మోస్టెర్డ్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనాల్లో తేలింది. గుండెజబ్బులు ఉండి, చికిత్స అనంతరం ఎలాంటి వ్యాయామం చేయనివారు పదిహేను శాతం కోలుకోగా, రోజూ వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బు నుండి 45శాతం త్వరగా కోలుకోవడాన్ని వీరు గమనించారు. ఆమ్ స్టర్ డామ్ ప్రాంతం లో ఈ పరిశోధనా బృందం 2,517 గుండెపోటు కేసుల డేటాను పరిశీలించింది. ఆ తర్వాత అందులో వ్యాయా మం చేసినవారు గుండెజబ్బుల నుంచి త్వరగా కోలుకున్నారని తేలింది.
ఈ వ్యాయామాల్లో ఎక్కువగా సైక్లింగ్, టెన్నిస్, జిమ్, స్విమ్మింగ్... వంటి యాక్టివిటీస్‌ని 35 ఏళ్ల వయసున్నవారు చేశారని, వారు త్వరగా కోలుకున్నారని తెలిసింది. శారీరక చురుకుదనం ఉన్న వ్యక్తుల్లో గుండె సంబంధిత ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు, ఈ కారణంగా మరణాల సంఖ్య బాగా తగ్గినట్టు కనిపెట్టారు. మరి ఆ శారీరం చురుకుగా ఉండేందుకు ఎం చేయాలో చూద్దాం...
1. వ్యాయామం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహం తగ్గుతాయి. వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది.
2. వ్యాయామాన్ని వార్మప్స్‌తో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి. వ్యాయామం చేయడాన్ని ఒకేసారి ఆపకూడదు. క్రమంగా వ్యాయామం చేయడంలోని తీవ్రతను తగ్గించుకుంటూ రావాలి. దీనివల్ల రక్తపోటు, గుండెకొట్టుకునే ప్రక్రియ ఒక నిర్దిష్ట క్రమంలో ఉంటాయి.
3. వ్యాయామం వల్ల రక్తప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వులు తగ్గుతాయి. ఎముకలు బలంగా మారతాయి. ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది గుండె ఆరోగ్యానికి పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మేలు చేస్తుంది.
4. రోజూ ఆటలాడటం వల్ల క్యాన్సర్, హార్ట్ ఎటాక్ ఎప్పుడూ ఓడిపోతాయి. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. అది మీ ఆయుర్దాయాన్ని పెంచడమే కాదు... జీవనంలోని నాణ్యత మెరుగవుతుంది.
5. రోజూ చేసే పనులు అంటే మెట్లెక్కడం, తోటపని వంటివి గుండెకు మంచి చేస్తాయి. రోజూ చేసే పనులు... అంటే ఉతికిన బట్టలు ఆరేయడం, ఆరిన తర్వాత మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం... ఇలాంటి ఇంటిపనులు గుండెజబ్బుల రిస్క్ తగ్గిస్తాయని గుర్తుపెట్టుకోండి.
6. ప్రతిరోజూ కనీసం 30-60 నిమిషాల పాటు ఓ మోస్తరు నుంచి కాస్తంత తీవ్రంగా చేసే వ్యాయామం ఒక పూట భోజనం పూర్తిగా అరిగిపోయేలా చేస్తుంది. అంటే... దానితో కొవ్వులు శరీరంలోకి చేరవన్నమాట. అలా కొవ్వులు చేరకపోవడం గుండెకు మంచిది.
7. బద్దకంగా ఒకేచోట కదలకుండా ఉండటం వల్ల స్మోకింగ్‌తో ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో అలాంటి వాటినే కలగజేస్తుంది. క్రమం తప్పని వ్యాయామం వల్ల గుండె బలంగా అవుతుంది. పది లక్షల సార్లు గుండె కొట్టుకుంటే కలిగే శ్రమను ఒక్కసారి చేసే వ్యాయామం దూరం చేస్తుంది.
8. నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. ప్రతిరోజూ అదే వేళకు నిద్రపోయి, అదే వేళకు లేవండి. కోపంగా ఉన్న సమయంలో నిద్రకు ఉపక్రమించవద్దు.
9. మీకు రక్తదానం చేసే అలవాటు ఉంటే... ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు చేసే రక్తదానం గుండెకు మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
10. సెక్స్ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వ్యాయామాలతో వచ్చే ప్రయోజనాలన్నీ సెక్స్‌తోనూ ఒనగూరుతాయి. సెక్స్‌లో పాల్గొనే వారు ఎక్కువకాలం జీవిస్తారు. అయితే జీవిత భాగస్వామితో కాకుండా బయటి వ్యక్తులతో సెక్స్ సంబంధాలు సామాజికంగానే కాదు... ఒత్తిడి పెంచి గుండెకూ హాని చేస్తాయి. కనీసం వారానికి రెండు సార్లు సెక్స్‌లో పాల్గొనడం అన్నది రోజూ వ్యాయామం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాన్నే ఇస్తుంది.
0 Comments