Full Style

>

సెప్టెంబర్‌ 21న ‘వరల్డ్‌ అల్జీమర్స్‌ డే’మతిమరుపునకు ఇదీ మందు!

మెమొరీ గేమ్‌ చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందం టే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరో మారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదెైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు.


sectionఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుంద నుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాల న్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పెైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పెైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.

మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు
original
  • మెమొరీ గేమ్‌ చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందం టే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరో మారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదెైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు.
  • విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే నిచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటి వి పట్టించుకోవాలి. వాటిపెై చర్చలు చేయాలి. నిర్ణయాల కు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
  • శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూప లేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందో ళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొం చెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లా డే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్త విషయాలు మాట్లాడి నా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.
  • పజిల్స్‌ చేయటం ఈ పని పిల్లలదనుకుంటాం. కానీ పిక్చ ర్‌ పజిల్స్‌, సుడోకు వంటివి ఓదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటప్పుడు దుకాణాల బోర్డులు చదవం డి. వాటిని మరల అదే వరసలో గుర్తు చేసుకోండి.
  • భాషాపర వెైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగు వుతుం ది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది.
  • ఈ మెదడు వ్యాయామలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎఞతో చురుకుగా ఉండేలా చేస్తాయి. కనుక నేటి నుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివెైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.

Post a Comment

0 Comments